Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్… ఇషాన్ కిషన్ బాంబింగ్‌తో పాకిస్థాన్ బెంబేలు…

February 15, 2026 by M S R

.

చెప్పుకోవాలి… ఖచ్చితంగా చెప్పుకోవాలి… చాన్నాళ్ల తరువాత చాలా హీట్ జనరేట్ చేసిన మ్యాచ్ ఇది… వాడు బంగ్లాదేశ్ వాడు నేను ఆడనుపో అన్నాడు… పోతేపోరా అనేసింది ఇండియా…

బంగ్లాదేశ్ మీద తెగ ప్రేమ ఒలకబోస్తూ పాకిస్తాన్ కూడా నేనూ ఆడను, బంగ్లాదేశ్ గొంతెమ్మ కోరికలు తీర్చాలి అని ఎప్పటిలాగే తనదైన తిక్క స్టయిల్ పోకడ… నువ్వూ పోతేపోరా, తరువాత నువ్వే అనుభవిస్తావు అనేసింది ఇండియా…

Ads

కాళ్లబేరం అలవాటే కదా పాకిస్థాన్‌కు… దిగివచ్చింది… రాకుండా చేసేదేమీ లేదు… ఒకవైపు పెహల్గామ్ దురాగతం ఇండియన్ల గుండెల్ని మండిస్తూనే ఉంది… ఆపరేషన్ సిందూర్ పేలుళ్లు మరిన్ని వినిపించాలి ఈ మ్యాచులో అని ప్రతి ఇండియన్ కోరుకున్నాడు… హైవోల్టేజీ మ్యాచ్ కాదు… ఇది థర్మోబారిక్ బాంబింగ్…

అఫ్‌కోర్స్, దీన్ని కూడా బీజేపీకి, మోడీకి ముడిపెట్టి… లోలోపల ఇండియా ఓడిపోవాలని కోరుకున్న యాంటీ నేషన్ ఇడియట్స్‌కు కూడా కొదవ లేదు కదా దేశంలో… అందరూ ఒక్కసారిగా సైలెంట్…

అట్లా ఇట్లా కాదు… ఓ రాఫెల్ ఫైటర్‌‌ను ఎక్కి ఇషాన్ కిషన్ ఒక్కడే బాంబింగ్ చేసి వచ్చినట్టు… వాట్ ఏ బ్యాటింగ్… తరువాత కాగల కార్యం ప్రతి బౌలరూ తీర్చారు… వెరసి పాకిస్థాన్ చిత్తు చిత్తు… సగటు జాతీయ వాద భారతీయుడకి ఆత్మతృప్తి…

ఇంకా ఎవడూ మొదలుపెట్టలేదు, ఆటను ఆటలాగా చూడాలి అని… పర్లేదు… ఎవడి ఏడుపు వాడు ఏడవనీ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈరోజు టీవీని అతుక్కున్నారు… ఎక్కడెక్కడో దూరదేశాల్లో ఉన్నవాళ్లు కూడా… క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేని వాళ్లు కూడా…

అది ఎమోషన్… ఎస్, ఖచ్చితంగా ఓ పాట్రియాటిక్ ఫీల్… ఎవడు ఎన్ని శుష్క వాదనలకు దిగినా సరే… ఆటను కూడా దేశం భిన్నంగా చూడలేదు… ఇదీ యుద్దంలో భాగమే… భాగం కాకపోతేనే ఆశ్చర్యపడాలి… ఇక్కడ ఇండియా- పాకిస్థాన్ స్కోర్లు, పోలిక, మన్నూమశానం ఏమీ చెప్పడం లేదు…

ఒక ఆనంద కెరటం ఇండియాను ముంచెత్తడాన్ని పాఠకులతో షేర్ చేసుకోవడమే ఈ కథన ఉద్దేశం... కంగ్రాట్స్ ఇండియన్ ప్లేయర్స్... వన్స్ అగెయిన్... ఎస్, ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్...

2003 March 1st మహాశివరాత్రి రోజున ఇండియా vs పాకిస్థాన్ ... (World Cup) .... అప్పుడు సచిన్ చెలరేగిపోయాడు... 98 (75B)... అప్పట్లో ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఇండియా వైడ్ వైరల్ అయ్యింది... "భారత్‌కి శివరాత్రి.. పాకిస్థాన్‌‌కి కాళరాత్రి" అని... మళ్ళీ ఇన్నాళ్ళకి సేమ్ మహా శివరాత్రి రోజున T20 world cup... 'భారత్‌కి మహా శివరాత్రి.. పాకిస్థాన్‌కి కాళరాత్రి '.... మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది.....

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా ఎలా గెలిచింది..? పాకిస్థాన్ ఎందుకు మట్టికరిచింది..?
  • ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్… ఇషాన్ కిషన్ బాంబింగ్‌తో పాకిస్థాన్ బెంబేలు…
  • నిజంగానే ఆ నరవాణేపై చర్య తీసుకునే దమ్ముందా ప్రభుత్వానికి..?
  • థర్మోబారిక్..! ఈ ఆయుధ ప్రయోగంతో మనుషులు ఆవిరైపోతారా..?!
  • వరల్డ్ కప్‌లో మరో వింత బౌలింగ్… నమీబియా ఎరాస్మస్ నయా వ్యూహం…
  • పిచ్చోళ్లు… 21 శతాబ్ధం ఇంకా బేవార్సుగా ఉంటుందని ఊహించలేదు…
  • జైలు – సానుభూతి… రేవంత్, లోకేష్‌ ‘సేమ్ టు సేమ్’ స్కెచ్…!
  • ఒక్కసారి బంధాలు గాడితప్పితే… కథలో ఇక అన్నీ రోత ట్విస్టులే…
  • నిర్దోషిత్వం బయటపడేలోపు… నింద మాన్పలేని మచ్చల్ని మిగిలిస్తుంది…
  • వింత విజ్ఞత..! 90 శాతం గెలవని గెలుపు అసలు గెలుపే కాదట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions