Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వామికా గబ్బి ! డీసీ సినిమాకు ప్రధాన బలం ఈమె నటనే !

August 8, 2026 by M S R

.

మంచి పాత్ర దొరకాలే గానీ, హీరోయిన్లు ఎందుకు మెరిసిపోరు ? మొన్నటికిమొన్న శ్రీగౌరీప్రియ చెన్నై లవ్ స్టోరీలో అదరగొట్టేసింది… అది ఆ పాత్ర ఆమెకు దక్కిన ఫలితం… ఇప్పుడు డీసీ అనే సినిమాలో అలాగే మెరిసిన తార పేరు వామికా గబ్బి… నిజం చెప్పాలంటే ఆ సినిమాలో ఆమె నటనే హైలైట్…

ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఏమీ కాదు, దశాబ్దం క్రితమే (2015) లో భలే మంచిరోజు అనే సినిమా చేసింది… ఇప్పుడు అడివి శేష్ నటించే జీ2 సినిమాలో చేస్తోంది… అన్ని భాషల్లోనూ సినిమాలు చేసినా, సీరియల్స్, వెబ్ సీరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్ చేసినా మంచి గుర్తింపు దొరికినట్టు లేదు… కానీ ఈ డీసీ సినిమాలోని పాత్రతో తళుక్కున మెరిసింది…

Ads

ఈమె తండ్రి పంజాబీ, హిందీ రచయిత… ఈమె కూడా కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా… 2007లో జబ్ వుయ్ మెట్ సినిమాతో మొదలుపెట్టి ఇప్పటిదాకా, ఇక్కడి దాకా తన జర్నీలో అనేక ఆటుపోట్లు… సరే, ఈ డీసీ (DC – Guns & Roses) మాటేమిటి అంటారా..?

ఈ సినిమాకు అసలు సిసలు బలం ఆమే… నిస్సహాయ స్థితిలో ఉండే ఒక సాధారణ అమ్మాయిగా ఆమె కన్నీళ్లు, భయం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి… ఆ తర్వాత అదే పాత్ర తిరుగుబాటు బావుటా ఎగరవేసే క్రమంలో ఆమె చూపించే హావభావాలు, బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో చప్పట్లు కొట్టించాయి…

వామికా

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఇలాంటి ఇంటెన్స్, రా (Raw) క్యారెక్టర్స్‌లోనూ వామికా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది… ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా స్థాయిని పెంచింది…

సినిమా ఎలా ఉంది? 
👍 సానుకూలాలు (Positives)
అనిరుధ్ మ్యూజిక్ & BGM…: సినిమాకి నిజంగానే అనిరుధ్ బ్యాక్‌బోన్… యాక్షన్ సీన్లలో ఆయన ఇచ్చిన గోడ్-లెవెల్ బీజీఎం థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది…

రా అండ్ రస్టిక్ మేకింగ్…: అరుణ్ మాదేశ్వరన్ టెడ్డి బేర్ మేకింగ్ స్టైల్, ఆ రక్తం, మట్టి వాసన కొట్టే విజువల్స్ సినిమాను ఒక డిఫరెంట్ జోనర్‌లోకి తీసుకెళ్తాయి. కలర్ టోన్ చాలా రిచ్‌గా ఉంది.

లోకేష్ కనగరాజ్ నటన…: దర్శకుడిగా పరిచయమైన లోకేష్, ఇక్కడ నటుడిగానూ ఆశ్చర్యపరిచాడు. పెద్దగా డైలాగ్స్ లేకుండా కేవలం కళ్లతోనే ఎమోషన్ పండించడంలో సఫలమయ్యాడు.

సెకండాఫ్ యాక్షన్…: చంద్ర ఎంట్రీ తర్వాత కథ వేగం పుంజుకోవడం, ఆ తర్వాత వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి.

👎 ప్రతికూలాలు (Negatives)
రొటీన్ కథ…: పేదవాడిపై జరిగే అన్యాయం, గ్యాంగ్ స్టర్ రివెంజ్ డ్రామా అనే పాయింట్ తెలుగు, తమిళ తెరపై చాలాసార్లు చూసేసాం. కథాపరంగా కొత్తదనం ఏమీ ఉండదు.

ల్యాగ్ & స్లో నేరేషన్…: ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడానికి కాస్త సమయం పడుతుంది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగి ప్రేక్షకులకు సహనానికి పరీక్ష పెడతాయి. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది.

హింస మరియు రక్తపాతం (Violence)…: ఈ సినిమా అందరికోసం కాదు. విపరీతమైన వైలెన్స్, రక్తం ఏవగింపు కలిగించేలా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను భరించడం కాస్త కష్టమే.

‘డీసీ’ అనేది పర్‌ఫెక్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ కాదు. ఇది ఒక రా అండ్ రస్టిక్ వయొలెంట్ డ్రామా. పాత దేవదాసు కథను కొత్తగా చెప్పబోయి, సరిగ్గా చెప్పలేక చేతులెత్తేనట్టు ఉంది…

ఎవరికి నచ్చుతుంది…: అనిరుధ్ మ్యూజిక్, హై-ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్స్, వామికా గబ్బి నటన, లోకేష్ కనగరాజ్ ప్రెజెన్స్ కోరుకునే మాస్ ఆడియన్స్‌కి ఇది చక్కటి అనుభూతిని ఇస్తుంది…

ఎవరికి నచ్చదు…: కొత్తదనం కోరుకునేవారు, వయొలెన్స్ భరించలేనివారు, లాజిక్స్ వెతికే సాధారణ ప్రేక్షకులకు ఇది బోర్ కొట్టించవచ్చు….

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డూప్లికేట్ ‘ఆధార్’లతో డబుల్ జీతాలు… దోషులపై క్రిమినల్ కేసులు !
  • వామికా గబ్బి ! డీసీ సినిమాకు ప్రధాన బలం ఈమె నటనే !
  • నిజంగానే ‘కొరియన్ కనకరాజు’ ఎన్టీఆర్‌ను అవమానించాడా !?
  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • ‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!
  • శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!
  • Algorithmocracy – అల్గారిథం రాజ్యం ! రిథమ్ తప్పిన బానిస మనిషి !
  • అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!
  • శకునాలు చెప్పిన తెహల్కా బల్లి కుడితి తొట్టెలో పడింది !!
  • ఇక గుడ్డివాళ్లే ఉండరు ! ఎలన్‌మస్క్ కంపెనీ అద్భుత ఆవిష్కరణ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions