Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!

August 12, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta … ఢిల్లీ–ఢాకా మధ్య కీలక దౌత్య కదలికలు- దినేష్ త్రివేది పాత్రపై ఆసక్తి!
బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న దినేష్ త్రివేది తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహ్మాన్‌తో కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం సాధారణ మర్యాదపూర్వక భేటీగా మాత్రమే కాకుండా… ప్రస్తుతం భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉన్న సున్నితమైన సంబంధాల నేపథ్యంలో చాలా ప్రాధాన్యత కలిగిన దౌత్య చర్చగా కనిపిస్తోంది.
🔹 దినేష్ త్రివేది మాజీ కేంద్ర రైల్వే మంత్రి.
🔹 పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు.
🔹 బెంగాలీ భాష, బంగ్లాదేశ్ రాజకీయ–సామాజిక వాతావరణంపై ఆయనకు మంచి అవగాహన ఉంది.
🔹 2026లో ఆయనను కెరీర్ దౌత్యవేత్తకు బదులుగా భారత హైకమిషనర్‌గా నియమించడం కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

Ads

ఇలాంటి సమయంలో ఆయన నియామకం వెనుక ఢిల్లీ– ఢాకా మధ్య ఒక రాజకీయ– దౌత్య వారధిని నిర్మించే ప్రయత్నం ఉందనే విశ్లేషణకు బలం చేకూరుతోంది.

indo bangla

అత్యంత సున్నితమైన అంశం — షేక్ హసీనా మళ్ళీ బాంగ్లాదేశ్ వెళ్తాననటం …
బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహ్మాన్‌తో జరిగిన సమావేశంలో మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లే అంశాన్ని ప్రస్తావించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఢాకా ఈ విషయంలో భారత్ నుంచి అనుకూల స్పందన కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశం తరువాత దినేష్ త్రివేది ఢిల్లీకి తిరిగి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కలిసి ఈ సమావేశంపై బ్రీఫింగ్ ఇచ్చారట . దినేష్ త్రివేది ఢాకాలో వున్న సమయంలోనే , భారత రా చీఫ్ తన సిబ్బందితో ఢాకాలో పర్యటించారు ; వీరిద్దరి ఢాకా పర్యటన తప్పకుండా భారత్ – బాంగ్లాదేశ్ ల మధ్య దౌత్య వ్యవహారాల మీద ప్రభావం చూపుతుంది.

భారత్– బంగ్లాదేశ్ సంబంధాల రీసెట్‌లో దినేష్ త్రివేది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భద్రత, సరిహద్దు, వాణిజ్యం, వీసాలు, మైనారిటీల భద్రత, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు వీటన్నింటికీ తోడు షేక్ హసీనా అంశం కూడా ఢిల్లీ– ఢాకా సంబంధాల్లో అత్యంత సున్నితమైన కార్డుగా మారింది.

దౌత్యంలో కొన్నిసార్లు మాటలకంటే, సరైన వ్యక్తిని సరైన స్థానంలో ఉంచడమే పెద్ద సందేశం.
దినేష్ త్రివేది నియామకం అలాంటి వ్యూహాత్మక సందేశమేనా? కాలమే సమాధానం చెప్పాలి.
— ఉపద్రష్ట పార్ధసారధి

#PardhaTalks #DineshTrivedi #IndiaBangladesh #Bangladesh #Diplomacy #SheikhHasina #TariqueRahman #India #WestBengal #ForeignPolicy #Geopolitics #IndiaBangladeshRelations

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీ6వెలుగు Vs బీఆర్ఎస్ ! KCR కొండపోచమ్మ నీటిమళ్లింపు రాద్ధాంతం !!
  • అక్షరధామ్‌లో వికలమైన మనసు… ఇదుగో ఇక్కడ కుదుటపడింది…
  • web-fraud-lottery… ఈ యూరో లింకుల్ని నమ్మకండి – అంతా డ్రామా !!
  • ఒక రష్మిక, ఒక పీవీ సింధు – ఈ మట్టికి కొత్త కోడళ్లు – అవమానించకండి
  • ఆ ముళ్ళదారి తెలియకుండా- ఆమె పాదాల మచ్చలపై తీర్పులొద్దు!
  • నాడు అల్లు అర్జున్ అరెస్టు – మరి ఎంవీఎస్‌ఆర్ దుర్ఘటనపై ..?!
  • ఫ్రాన్స్ బొద్దింకలు తగులబెట్టేస్తున్నాయి… ఇండియా బహుపరాక్…
  • జియో ఐపీఓ పూర్తవగానే… మస్క్ ‘స్టార్‌లింక్’కు గ్రీన్ సిగ్నల్?
  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!
  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions