.
Rochish Mon ….. తమిళ్ష్‌నాడు హిందువుల భవిష్యత్… 2026 తమిళ్ష్‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమిళ్ష్‌నాడుకు మాత్రమే కాదు దేశానికి కూడా కీలకం కానున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మరింత కీలకం.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే రెండు రాష్ట్రాల అభివృద్ధి రెండు రాష్ట్రలలోనూ హిందువులు దైనందిన జీవనం, మనుగడ అల్లకల్లోలం అవుతాయన్న భయం నెలకొంది.
Ads
ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే తమిళ్ష్‌నాడులో
క్రిస్టిఅన్, పశ్చిమ బెంగాలులో ఇస్లామ్ మత మాఫిఅలు పరోక్ష అధికారం చేస్తాయి అని, రెండు రాష్ట్రాలలోనూ శాంతి భద్రతల సమస్య విచ్చలవిడి కానుంది అని, హిందువులు విదేశీ మతోన్మాదానికి బలి కానున్నారు అని, అసలు పాలన అన్నదే స్తంభించిపోయే పెను అపాయం వాటిల్లుతుంది అని తెలుసుకోవడం తప్పు అవదు.
తమిళ్ష్‌నాడు ప్రజ ఓటింగ్ ఆలోచన పరంగా అందుతున్న సర్వే నివేదికలు ఇలా తెలియజేస్తున్నాయి … డీ.ఎమ్.కె. + 35.8%, ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. 33.8%, విజయ్ పార్టీ 19.2%, చెప్పలేం 4.7%, ఇతరుల 6.5%.

ఈ నివేదికను బట్టి డీ.ఎమ్.కె. వైపు దాదాపుగా 2% ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది… క్రిస్టిఅన్, ముస్లీమ్ మత ఓటు డీ.ఎమ్.కె. వైపు.., ఎస్.సీ., ఓ.బీ.సీ. ఓటు ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. వైపు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది… ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్న ఓటు శాతం ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యం కానుంది…
ఎన్నికల్లో 35.8% ఉన్న డీ.ఎమ్.కె.కు మెజారిటీ రాని పక్షంలో ఎన్నికల తరువాత 19.2% ఉన్న విజయ్ పార్టీ తోడ్పాటుతో డీ.ఎమ్.కె. & విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటవుతుంది అని, క్రిస్టిఅన్ మాఫియా ప్రణాళిక అదే అని మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రణాళిక ఒక అతి ముఖ్యమైన రహస్యమే అయినా ఫలితాల తరువాత ఆచరణలోకి వచ్చేసే ముప్పు అని గ్రహించడం అవసరం.
ఆ ముప్పు సంభవించకుండా ఉండాలంటే హిందూ – ఓటు ఏకీకృతం అయి ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె – బీ.జే.పీ. కూటమిని గెలిపించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిని, ఫలితాల్ని ఆదర్శంగా తీసుకుని తమిళ్ష్‌నాడు హిందువులు స్పృహతో ఓటు వెయ్యాలి. 40% ఓటు, విదేశీ మత వత్తాసు ఉన్న వై.సీ.పీ.ని హిందువులు ఎలా అయితే తప్పించారో లేదా వదిలించుకున్నారో అలా తమిళ్ష్‌నాడు హిందువులు కూడా విదేశీ మత వత్తాసును, ప్రాబల్యాన్ని ఓడించి ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె – బీ.జే.పీ. కూటమికి ప్రభుత్వాన్ని ఇవ్వాలి.
తమిళ్ష్‌నాడు భవిష్యత్ హిందూ ఓటు చేతిలోనే ఉంది! హిందువు మాత్రమే తమిళ్ష్‌నాడును ‘విదేశీ మతం మాఫిఅ నుంచి’ రక్షించుకో గలడు.
దేశ వ్యాప్తంగా సంచలనం, ఆదర్శం అయిన మద్రాస్ హై కోర్ట్ జడ్జ్; ద గ్రేట్ జడ్జ్ శ్రీమాన్ స్వామినాద(థ)న్ మాటలు…:
“మిగిలి ఉన్న నా వృత్తి కాలంలో సనాతన ధర్మాన్ని నా బుద్ధికి చేరువలో ఉంచుకుంటాను”… ఈ మాటల ప్రేరణతో తమిళ్ష్‌నాడులోని ప్రతి హిందూ ఓటరూ ఇకపైనైనా తన బుద్ధిని సనాతన ధర్మానికి చేరువలో ఉంచుకుని ధైర్యంతో, సత్సృహతో, కర్తవ్యజ్ఞానంతో, హిందూత్వంతో ఓటు వేసి రాష్ట్రాన్ని, తన భావి జీవితాన్ని విదేశీ మతం నుంచి రక్షించుకోవాలి; దక్కించుకోవాలి…. రోచిష్మాన్ 9444012279
Share this Article