.
తెలంగాణలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం వార్డుల సంఖ్య 2996… నిన్నటి ఫలితాల్లో కొన్ని విశేషాలున్నాయి చెప్పుకుందాం, చెప్పుకోవాలి కూడా…
- 781 స్థానాలు సంపాదించామనీ, బలమైన రివైవల్ అనీ చెప్పుకుంటున్నది కదా బీఆర్ఎస్… తొమ్మిదిన్నరేళ్లు పాలించిన ఆ పార్టీకి అసలు నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కటంటే ఒక్క వార్డు కూడా రాలేదు… అవి ధర్మపురి, కొసిగి, మక్తల్, భైంసా… 14 స్థానాల్లో కేవలం ఒక్కొక్కటి మాత్రమే… (ఎన్నికల కమిషన్ అధికారిక సమాచారమే)…
1537 సీట్లు గెలిచి, స్వీప్ చేశామని సంబరపడుతున్నది కదా అధికార కాంగ్రెస్.,. అంటే దాదాపు సగానికి పైగా గెలిచింది కదా… కానీ కాంగ్రెస్ మరీ జీరో సీట్లు సాధించిన మున్సిపాలిటీలు ఏమీ లేవు కానీ… ఒక్కొక్క స్థానానికే పరిమితమైనవి మూడున్నాయి… అవి వడ్డేపల్లి, ఆమనగల్, భైంసా… (వడ్డేపల్లిని ఎఐఎఫ్‌బికి, భైంసాను మజ్లిస్‌కు వదిలేసిందో ఏమో…)
Ads
- 335 వార్డులు గెలుచుకున్న బీజేపీ అసలు 45 మున్సిపాలిటీల్లో సాధించిన వార్డుల సంఖ్య జీరో… 24 మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి మాత్రమే… చాలా నిరాశాపూరితం… నిజామాబాద్ (28), కరీంనగర్ (30) కార్పొరేషన్లలో సాధించినవి తీసేస్తే ఇంకా చాలా తక్కువే… అంటే 69 మున్సిపాలిటీల్లో, దాదాపు సగం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిల్ ఇంపాక్ట్… (ఆదిలాబాద్, నిర్మల్, మెట్‌పల్లి, కామారెడ్డి బెటర్)…
సీపీఎం కేవలం 13 వార్డులు గెలుచుకుంది… అసలు రాష్ట్రంలో పార్టీ ఉందాలేదా అన్నట్టుగా…! సీపీఐ చాలా నయం… దాని సంఖ్య ఎన్నికల కమిషన్ వెబ్ సైటులో ప్రత్యేకంగా పేర్కొనలేదు గానీ… సరిగ్గా డీల్ చేస్తే ఏకంగా కొత్తగూడెం కార్పొరేషన్‌ను చేజిక్కించుకునే రిజల్ట్ సాధించింది… (మొత్తం 40 సీట్లు… కొత్తగూడెం 23?…)
- ఇంతకుముందు పాతబస్తీకే పరిమితం అనుకున్న మజ్లిస్ ఈసారి ఇతర పట్టణాలకూ విస్తరించింది… ఆదిలాబాద్‌లో 6, భైంసాలో 12, నిజామాబాద్‌లో 14, బోధన్‌లో 12 సీట్లు సహా మొత్తం 70 వార్డులు గెలుచుకుంది… నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌తో కలిసి అధికారం పొందనుంది…
ప్యూర్ ఆంధ్రా పార్టీలలో… వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉండిపోగా… మధిరలో అధికారికం కాదు గానీ, ముగ్గురు టీడీపీ మద్దతుదారులు గెలిచినట్టు సమాచారం… 336 వార్డులకు పోటీచేసి, ఇక తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలనుకున్న జనసేనకు మంచిర్యాలలో ఒకటి, నేరేడుచర్లలో మరొకటి వచ్చినట్టు సమాచారం… 336 సీట్లలో 248 వోట్లు అని మరో వార్త కనిపించింది… నిజమే అయితే ఇలాంటి పార్టీ మరొకటి ఉండదు ఇక…
సోషల్ మీడియాలో మరోచోట కనిపించిన క్లిప్ చూడండి…

- ఏపీలోని కూటమినే తెలంగాణలోకి తీసుకురావాలని కలలుగంటున్న బీజేపీకి ఇది ఓ పే-ద్ద లెసన్… తెలంగాణ వ్యతిరేక టీడీపీని గానీ, దిష్టి వ్యాఖ్యల విద్వేష జనసేనను గానీ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదనీ, పైగా బీజేపీకి కౌంటర్ ప్రొడక్ట్ అవుతుందనేది ఆ పాఠం…
- కవిత… ఇంకా సొంత పార్టీయే లేదు… ఎఐఎఫ్‌బి పార్టీ గుర్తుతో పోటీచేస్తామని ప్రకటించింది… తీరా అది సరిగ్గా వర్కవుట్ కాలేదు… ఎఐఎఫ్‌బి సొంతంగానే వడ్డేపల్లి మున్సిపాలిటీనే కైవసం చేసుకుంది… ఇది విశేషమే… ఉన్నవే పది వార్డులు, అందులో 8 గెలిచింది… మిగతా చిన్న పార్టీలు ఓసారి దాన్ని పరిశీలించడం మేలు…
జాతీయ పార్టీ బీఎస్పీ రెండు వార్డులు గెలుచుకోగా… టీఆర్పీ వంటివి అసలు ఖాతా తెరవనేలేదు… నిజామాబాద్, కరీంనగర్‌లలో బీజేపీకి, కొత్తగూడెంలో సీపీఐకి కొంత దోబూచులాట ఉంది ఇంకా… హంగ్ వచ్చిన దాదాపు 20- 25 మున్సిపాలిటీల్లో కూడా కొంత అనిశ్చితి ఉన్నా… ఎక్స్ అఫిషియో, ఇండిపెండెంట్లు, రెబల్స్ సాయంతో కాంగ్రెస్ వాటిల్లో ఎక్కువ శాతం చేజిక్కించుకోవచ్చు బహుశా..!!
వెరసి పట్టణ వోటరు ఏం చెప్పాడు..? 1) నో బీఆర్ఎస్ అన్నాడు... 2) నాట్ బీజేపీ అన్నాడు... 3) నాటెటాల్ ఆంధ్రా పార్టీస్ అన్నాడు... 4) నెవర్ చోటా పార్టీస్ అన్నాడు... 5) జై పవర్ పార్టీ అన్నాడు... అంతే... చివరగా...

Share this Article