Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీఆర్ఎస్, వైసీపీ… ఎక్కడేసిన గొంగళి అక్కడే… MOTN సర్వే…

January 30, 2026 by M S R

.

డిస్‌క్లెయిమర్… మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్థూలంగా జనం ఆదరణ స్థాయిని పట్టిచూపిస్తుంది… అంతేగానీ ఎన్నికలొచ్చినప్పుడు రకరకాల సమీకరణాలు, పరిణామాల నేపథ్యంలో ఇదే మూడ్ సరిగ్గా అంతే రిఫ్లెక్ట్ కాకపోవచ్చు…

ఇండియాటుడే ఎప్పటికప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ల (ఎంవోటీఎన్) సర్వే చేస్తుంటుంది… తాజాగా తన సర్వే వివరాలను వెల్లడించింది… సరే, జాతీయ స్థాయిలో మోడీ ఫ్యాక్టర్ (బ్రాండ్ మోడీ) ఇంకా బలంగా పనిచేస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని చెప్పింది… మోడీ విదేశాంగ విధానం, దేశభద్రతపై వోటర్ల నమ్మకం ప్రభావం…

Ads

గత ఎన్నికల్లో 400 సీట్లు అని పిలుపునిచ్చినా సరే… సొంతంగా మెజారిటీ సాధించలేక (240 సీట్లు) చివరకు నితిశ్, చంద్రబాబుల మీద ఆధారపడే స్థితికి కాస్త చతికిలపడింది… ఇప్పుడు ఎన్డీయే 352 సీట్లు గెలుస్తుందని అంచనా… బీజేపీ సొంతంగా 287 సీట్లు సాధిస్తుంది… ఇండి కూటమి మాత్రం 182 స్థానాలకు, మరీ కాంగ్రెస్ అయితే 80 స్థానాలకు పడిపోవచ్చు…

మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి..? అదే కదా ఆసక్తికరం.. 

ఆంధ్రప్రదేశ్: తిరుగులేని కూటమి.. నిలకడగా వైసీపీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల నాటి ‘ప్రభంజనం’ ఇంకా కొనసాగుతోందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి…

2024లో ఎన్డీయే వాస్తవ ఫలితం 16 టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ… మొత్తం 21… వైఎస్ఆర్సీపీ 4 సీట్లు… కానీ ఈ సర్వే ప్రకారం… ఎన్డీయే వోటు శాతం 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగి 22- 24 సీట్లు వస్తాయని అంచనా… వైసీపీ వోటు శాతం 40 నుంచి 39కు పడిపోయి, ఈమేరకు 1-3 సీట్లు పడిపోవచ్చు… షర్మిలక్క నేతృత్వంలో కాంగ్రెస్, ఇతరులు 6 శాతం దగ్గర అక్కడే ఆగిపోతారు…

  • కారణాలు…  టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు 100% సక్సెస్ కావడం కూటమికి అతిపెద్ద ప్లస్… సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల్లో ఉన్న ఆశలు, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సానుకూలతను పెంచుతున్నాయి… ఓటు బ్యాంకు ఇంకా బలంగానే ఉన్నా, కూటమిని విడివిడిగా ఢీకొనే స్థాయి బలం లేకపోవడంతో సీట్లు గెలవడం కష్టంగా మారుతోంది… కాంగ్రెస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు…

motn

తెలంగాణ: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రేసులో వెనుకబడ్డ బీఆర్ఎస్!

తెలంగాణలో రాజకీయం ఇప్పుడు జాతీయ పార్టీల మధ్యే నడుస్తోంది… గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ఇప్పుడు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి…

2024లో కాంగ్రెస్, బీజేపీ చెరి 8 సీట్లు గెలిచాయి… కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ వోట్ల శాతం రెండు శాతం వరకూ పెరిగి ఒకటీరెండు సీట్లు అదనంగా రావచ్చు… బీజేపీ వోటు శాతం అలాగే ఉండి, ఒకటో రెండో తగ్గొచ్చు లేదా సేమ్ ఫలితం రావచ్చు…

మరి బీఆర్ఎస్… ఈరోజుకూ గత ఎన్నికల స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది… వోట్ల శాతంలో పెద్ద మార్పు లేదు… వస్తే ఒక సీటు రావచ్చు… ఎప్పటిలాగే మజ్లిస్‌కు అదే హైదరాబాద్ సీటు…

ఓటు శాతాల విశ్లేషణ: 

  • కాంగ్రెస్…: 2024లో 40.1% ఉండగా, ఇప్పుడు 41% కి చేరింది… రాష్ట్రంలో అధికారంలో ఉండటం, రైతు భరోసా, ఫ్రీ పవర్, సిలిండర్ ధర తగ్గింపు, ధాన్యానికి బోనస్ ధర, సన్నబియ్యం, ఫ్రీ రవాణా వంటి పథకాలు దీనికి కారణం…

  • బిజెపి…: 2024లో 35% ఉండగా, ఇప్పుడు 33% కి తగ్గినా… సీట్ల పరంగా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది… మోడీ ఫ్యాక్టరే ఇక్కడ ప్రధాన బలం… వెరసి తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే…

  • BRS…: 2024లో 16.6% ఓట్లు వచ్చాయి… ఇప్పుడు 18% కి స్వల్పంగా పెరిగినా, సీటు గెలిచే స్థాయికి అది సరిపోవడం లేదు…

ప్రధాన కారణాలు: 

  • బైపోలార్ ఫైట్…: బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడంతో పోటీ కాంగ్రెస్ vs బీజేపీగా మారింది…

  • జాతీయ అంశాలు…: లోక్‌సభ ఎన్నికలు కాబట్టి ప్రజలు ప్రాంతీయ పార్టీ (BRS) కంటే జాతీయ పార్టీలకే (Cong/BJP) ప్రాధాన్యత ఇస్తున్నారు….


ముచ్చటగా ఒక మాట (విశ్లేషణ).... మొత్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 'కూటమి ఐక్యత' బిజెపికి లాభిస్తుంటే, తెలంగాణలో 'బిఆర్ఎస్ బలహీనత' కాంగ్రెస్, బీజేపీలకు వరంగా మారింది... జాతీయ స్థాయిలో మోడీకి ఉన్న క్రేజ్ ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పడిపోకుండా కాపాడుతోంది...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్ట్రాలు ఏమంటున్నాయి..?
  • బీఆర్ఎస్, వైసీపీ… ఎక్కడేసిన గొంగళి అక్కడే… MOTN సర్వే…
  • లడ్డూ నెయ్యిపై అంతా మాయ..! క్షుద్ర రాజకీయం ఆడించే ఆట..!
  • ‘కాపురానికి వెళ్తావా..? ఆరు నెలలు జైలుకు వెళ్తావా..? రెండే దారులు…’
  • ఆర్థిక సర్వే మెచ్చుకుంది సరే… మరి ఈ మేడిగడ్డ నివేదిక మాటేమిటి..?
  • పాకిస్థాన్‌లో రాముడి కొడుకు లవ కుమారుడి ఆలయ పునరుద్ధరణ..!!
  • సోషల్ మీడియా డర్టీ క్యాంపెయిన్‌లో రేవంత్ ఫెయిల్… కేసీయార్ డిస్టింక్షన్…
  • పక్కపక్కనే మూడు ప్రేమ కథలు… విషాద ముగింపులు వేర్వేరు…
  • ఎయిర్ బస్సా… ఎర్ర బస్సా…! ఓ ఇంట్రస్టింగ్ వార్త ఏదో తేడా కొడుతోంది..!!
  • ఒక పోలీసమ్మ… దాడులకు వెళ్లి… కాసేపు ఓ బిడ్డకు అమ్మయింది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions