Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దోషి – నిర్దోషి… ఓ మంచి స్టోరీ లైన్… పైగా పకడ్బందీ స్క్రీన్‌ప్లే…

February 22, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఇంత చిక్కని కధను , అంతే బిర్రయిన స్క్రీన్ ప్లేని , వాటికి దీటుగా డైలాగులను వ్రాసిన పరుచూరి బ్రదర్సుని ముందుగా అభినందించాలి . తాము నేసే కధలకు భిన్నంగా చిక్కని కధను నేసారు ఈ సినిమాకు .

న్యాయపరిరక్షణే ధ్యేయంగా పనిచేసే న్యాయమూర్తి శోభన్ బాబు . తన తీర్పు వలన అనాధ అయిన సుమన్ని తమ కొడుకులతో సమానంగా పెంచుతారు శోభన్ బాబు , ఆయన భార్య సుమిత్ర . ఈ ముగ్గురితో పాటు ఓ మేనకోడలు కిన్నెర . సుమన్ క్రమశిక్షణతో పెరిగి పోలీస్ ఇనస్పెక్టర్ అవుతాడు . స్వంత రెండో కొడుకు సాయికుమార్ దారి తప్పి నేర మనస్తత్వం కలిగిన మనిషి అవుతాడు .

Ads

చెడు సావాసాలు కూడా తోడవటంతో బాంకు దోపిడీకి కూడా పాల్పడి అక్కడ ఒక మహిళా ఉద్యోగి షబ్నంను కిడ్నాప్ చేసి , తీరా ఆమె సాయికుమార్ని గుర్తించాక , మానభంగం చేసి గాయపరుస్తాడు . ఆమె చనిపోయే ముందు తనను ప్రేమించిన సాయికుమార్ అన్న శుభలేఖ సుధాకరికి అన్ని విషయాలు చెపుతుంది .

ఆ కోపంతో రెచ్చిపోయిన శుభలేఖ సుధాకర్ తమ్ముడితో ఘర్షణ పడి షూట్ చేయటంతో సాయికుమార్ చనిపోతాడు . చిన్న కొడుకుని పెద్ద కొడుకు చంపాడని తెలిసాక అతన్ని చట్టం నుండి రక్షిస్తానికి శోభన్ బాబు నానా తిప్పలు పడతాడు . క్లైమాక్సులో కొడుకుని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేసి తాను ఆత్మహత్య చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .

మొట్టమొదటగా అభినందించవలసింది శోభన్ బాబునే . జడ్జిగా చాలా హుందాగా నటించారు . సంఘర్షణకు లోనయిన ఎమోషనల్ సీన్లలో ఇంకా బాగా నటించారు . హీరో పాత్రలు అయిపోయాక తండ్రి పాత్రల్లో బ్రహ్మాండంగా నటిస్తూ నటన నుండి ఎందుకు మరుగయ్యారో అర్థం కాదు . తెర మరుగు కాకుండా ఉండి ఉంటే ఇలాంటి గొప్ప సినిమాలు చాలా వచ్చి ఉండేవి .

తర్వాత మెచ్చుకోవలసింది సుమన్నే . సిన్సియర్ పోలీస్ ఆఫీసరుగా , గ్లామర్ హీరోగా బాగా నటించారు . అతని సరసన లిజీ హుషారుగా , అల్లరిగా బాగా నటించింది . బట్టతల ఎక్కడ కనిపించినా కొట్టకుండా వదలిపెట్టని పాత్రలో బాగా నటించింది .‌ ఆ తర్వాత శోభన్ బాబు మేనకోడలిగా పొడుపు కధలు వదులుతూ కిన్నెర కూడా బాగా నటించింది .

దారితప్పిన కొడుకుగా సాయికుమార్ , పెద్ద కొడుకుగా శుభలేఖ సుధాకర్ , సాయికుమార్ స్నేహితుడిగా మహర్షి రాఘవ బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో చలపతిరావు , వంకాయల , బ్రహ్మానందం , సుబ్బరాయ శర్మ , జెన్నీ , బాబూ మోహన్ , తాతినేని రాజేశ్వరి  తదితరులు నటించారు .

పాటలన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . పేకాట క్లబ్బులో అమ్మ దీని తస్సాదియ్యా అంటూ పేకాట లోని డ్రాప్ , మిడిల్ డ్రాప్ , కార్డ్ షో కౌంట్ , షో , వగైరా వాటిని మిక్స్ చేసి బ్రహ్మాండంగా వ్రాసారు . తప్పక చూడాల్సిందే ఈ వీడియోని . ముఖ్యంగా పేకాట అలవాటు ఉన్నవారు .

క్లైమాక్సులో దోషి ఎవరు నిర్దోషి ఎవరు పాట బాగుంటుంది . ఇట్లాగే తెల్లార్లూ డ్యూయెట్లో లిజీ రివర్స్ లవ్వాడుతుంది . అన్ని డ్యూయెట్లలో హీరో హీరోయిన్ని లవ్వాడితే ఈ డ్యూయెట్లో రివర్స్ . మరో డ్యూయెట్ ఒకటికి ఒకటి కూడా బాగుంటుంది . విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , శైలజ , చిత్ర శ్రావ్యంగా పాడారు .

మంగమ్మ శపథం , జీవనజ్యోతి వంటి హిట్ సినిమాలను తీసిన D V S బేనరుపై వై నాగేశ్వరరావు చాలా సమర్ధవంతంగా దర్శకత్వం వహించారు . అభినందనీయులు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకు ముందు చూడనట్లయితే తప్పక చూడండి . శోభన్ బాబు , సుమన్ అభిమానులు ఎన్ని సార్లయినా చూడవచ్చు . An excellent sentimental , emotional , action movie

నేను పరిచయం చేస్తున్న 1244 వ సినిమా    #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… కేసీయార్‌ను కూడా ఇలా చూస్తామేమో… డెస్టినీ వదలదు…!!
  • BBB..! BJP- BRS Bhai Bhai..!! ఏమైనా డౌటా..? పదండి వివరాల్లోకి వెళ్దాం…!!
  • కవిత బాటలోనే కనిమొళి..? ఉదయనిధి వారసత్వంపై అసహనం..!!
  • మైండ్‌లెస్ ట్రోలింగ్..! సౌత్ టాప్ స్టార్ల ‘వేషాలు’ మరిచిపోయారా..?!
  • అప్పుడు ముత్తాత… 92 ఏళ్ల తరువాత ఇప్పుడు మునిమనమడు…
  • మళ్లీ అదే 1956 కథ..? అప్పట్లో బ్రిటన్… ఇప్పుడు అమెరికా..! సీన్ రివర్స్..!!
  • సౌందర్య గణితం..! జయప్రద మొహం కొలతలపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్..!!
  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!
  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions