.
దెబ్బ తగిలితే గానీ, తత్వం బోధపడదు అంటారు ఎంతోకాలంగా పెద్దలు… మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అర్థమైంది… అనైతికుడు, ఈమాట అనడానికి ఏమాత్రం సందేహించడం లేదు, అసలు నరవాణే అనే జవాను ఈ అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఆర్మీ చీఫ్‌గా పనిచేయడమే మన వ్యవస్థ దౌర్భాగ్యం…
నరవాణే… ఈ దేశ వ్యవస్థల్ని కించపరుస్తూ… అవమానిస్తూ… ఏదో పుస్తకం రాశాడు… ఇలాంటి పుస్తకాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసే ఓ దేడ్ దిమాక్ పెంగ్విన్ సంస్థ ప్లస్ యాంటీ నేషనల్ ఫోర్సెస్… ఈ పుస్తకం ప్రచురణకు నీకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా అనడగలేదు… పబ్లిష్ చేసి పారేసింది…
Ads
దేశం, జాతి అనే ఏ సోయి లేని కేరక్టర్… ఏమన్నాడో ఏమో… ఏం పర్లేదు అనే అన్నాడో ఏమో… ఆ పెంగ్విన్ వాడు అచ్చేసేశాడు… ఇతర దేశాల్లో అమ్మకాలకు పెట్టేశాడు… ప్రిరిలీజ్ అనీ, రివ్యూ కాపీస్ అనీ దిక్కుమాలిన పేర్లతో దేశంలో అమెజాన్‌లో కూడా చెలామణీలోకి తీసుకొచ్చేశాడు మొదట…
దాన్ని పట్టుకుని, రాహుల్ గాంధీ ఏదో రచ్చ చేయబోయాడు… గల్వాన్ స్టాండ్ ఆఫ్ మాత్రమే కాదు, శతృదేశాలతో ఘర్షణ సమయంలో దేశ ఉన్నత వ్యవస్థల నడుమ ఏ సంభాషణ జరిగినా అది కాన్ఫిడెన్షియల్ మాత్రమే… అవి అధికారిక రహస్యాలు… (చైనాలో ఈ పని గనుక చేస్తే రెండుమూడు రోజుల్లో శాల్తీ గల్లంతు అయి ఉండేది)...

ఆ సోయి ఆ ‘వానరవాణే’కు లేదు, రాహుల్‌కూ ఎలాగూ ఉండదు… చివరకు ఈ శుష్క వివాదాన్ని ఏకంగా స్పీకర్ మీద అవిశ్వాసం దాకా తీసుకుపోయారు… అదేమంటే లోకసభలో తనను మాట్లాడనివ్వడం లేదట… బయట చెప్పిందే లోపల చెబుతాడు, అదెవడికీ అర్థం కాదు కూడా, చూశాం కదా…
బడ్జెట్ మీద మాట్లాడవయ్యా మగడా అంటే… బడ్జెట్‌లో జియో పాలిటిక్స్ అంటాడు, వెండి- బంగారం ధరల సంగతి లేదు అంటాడు… ట్రంపుకు దాసోహం, భరతమాతను అమ్మేశారూ అంటాడు… బడ్జెట్‌కూ దానికీ లింకేమిటో తనకు తెలిస్తే కదా…
తమ దాకా వస్తే కానీ చురుక్కుమని అనిపించదు కదా… మోడీ అనే కేరక్టర్‌కు ఎట్టకేలకు జ్ఞానోదయం అయ్యినట్టుంది… రిటైర్ అయ్యాక ఇరవై ఏళ్ళ దాకా మిలిటరీ ఆఫీసర్లు ఆటోబయోగ్రఫీలను రాయకుండా సర్వీస్ రూల్స్ మార్చాలని కేంద్రం ఆలోచిస్తుందట … శుభం …

- అంతే కాదు అయ్యలూ…! జడ్జీలు, IAS, IPS , IFS , IRS ఆఫీసర్లు , వైస్ చాన్సలర్లు , పెద్ద పెద్ద పదవులను వెలగబెట్టే వాళ్ళు ఎవరూ అనుమతి లేకుండా ఏదీ రాయొద్దని… కూలింగ్ పీరియడ్ పెట్టండి… కీలకస్థానాల్లో పనిచేసినవాళ్లు రిటైరయ్యాక రాజ్యసభ సభ్యులుగా , గవర్నర్లుగా , మరి ఏ ఇతర ప్రభుత్వ నియామకాలకు అర్హత లేకుండా బ్యాన్ పీరియడ్ పెట్టండి… దేశం బాగుపడుతుంది … ఆలోచించండి … ఈ దేశం దరిద్రం కాస్తయినా తగ్గుతుంది …

కటువుగా ఉంది కదా... మన దేశానికి అదే చిన్న పరిష్కారం... యాంటీ నేషన్ పార్టీలు, యాంటీ నేేషన్ సెక్షన్ల మీద విరుచుకుపడటం ఎలాగూ చేతకాదు... కనీసం విరుగుడు చట్టాలైనా చేయండి బాబూ..!!
కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు, కొన్ని సెక్షన్లకు యాంటీ బీజేపీకి, యాంటీ నేషన్‌కూ తేడా తెలియకపోవడంతోనే అసలు సమస్య... వీరిలో ప్రథముడు ది గ్రేట్ రాహుల్ గాంధీ... ఫస్టాఫ్ ఆల్ పెంగ్విన్ మీద నిషేధం పెట్టగలడా ది గ్రేట్ మోడీ...! అందరికీ ఓ కఠినమైన మెసేజ్ ఇచ్చినట్టవుతుంది...
చివరగా… రాజనీతి వేరు, యుద్ధనీతి వేరు… తేడా తెలియని నరవాణే వంటి వాళ్లు ఈ దేశానికి ఏకంగా ఆర్మీ చీఫ్‌లుగా పనిచేయాల్సి రావడం ఈ దేశం చేసుకున్న ఖర్మ..!! నరవాణే మీద యాక్షన్ తీసుకోగలదా సర్కారు..!!
Share this Article