.
Pardha Saradhi Potluri …. వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు – పార్ట్-1
ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగిసిపోతుంది.. ట్రంప్!
ఇరాన్ మీద దాడి చేయడానికి వచ్చిన 173 మంది పారా ట్రూపర్లు ఇరాన్ సైన్యానికి పట్టుబడ్డారు! ఇది మొన్న IRGC చేసిన ప్రకటన.
కానీ 173 మంది పారా ట్రూపర్లలో స్పెషల్ కమోండోలయిన డెల్టా ఫోర్స్ మెంబర్లు ఉన్నారని వార్త!
నిన్న ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసిపోతుంది అని అన్నాడు!
అంటే పుతిన్ ద్వారా బేరసారాలు చేసుకొని IRGC కి దొరికిన 173 మంది పారాట్రూపర్లని రహస్యంగా విడిపించుకొని బయటపడే ఆలోచనలో ఉన్నాడా ట్రంప్?
ఇరాన్ నెలకి 100 బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయగలిగే స్థితిలో ఉంది!
అమెరికా 30 పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ మాత్రమే తయారుచేయగలదు నెలకి!
Ads
ఏ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ తయారీకయినా రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం ఉంటుంది!
ప్రపంచ దేశాలకి 80% రేర్ ఎర్త్ అవసరాలని తీర్చేది చైనా! ముడి ఖనిజాలు చాలా దేశాలలో దొరుకుతాయి కానీ వాటిని ప్రాసెసింగ్ చేసి రెడీ to use కోసం చైనాకి ఇవ్వాల్సిందే!
చైనా ముందు చూపుతో 1980 నుండి రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టి ఇప్పుడు మాస్టర్ అయ్యింది!
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధంలో భాగంగా అమెరికా చైనాకి కీలకమైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల మీద నిషేధం విధిస్తే బదులుగా చైనా అమెరికాకి ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మినరల్స్ మీద నిషేధం విధించింది ఆరు నెలల కిందట!
అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కీలకమైన స్పేర్ పార్ట్స్ ని 6 నెలలకి సరిపడా స్టాక్ పెట్టుకుంటుంది! కానీ స్పేర్ పార్ట్స్ తయారీదార్లు వాళ్లకి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ ని మూడు నెలలకి సరిపడా స్టాక్ పెట్టుకుంటారు! చైనా అమెరికాకి చేసే రేర్ ఎర్త్ మినరల్స్ మీద నిషేధం విధించి ఆరు నెలలు అయ్యింది కాబట్టి మొత్తానికే కాదు కానీ కొన్ని విభాగాలలో షార్టెజ్ ఉంది.
ఇప్పటికే ఇజ్రాయేల్, అమెరికా దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోయాయి!
అమెరికాలో ఇంటర్సెప్టర్ మిసైల్స్ తయారయి అవి ఇజ్రాయేల్ తో పాటు గల్ఫ్ దేశాలకి సరఫరా అవడానికి రెండు నెలలు పడుతుంది, అదీ 100 లోపే ఉండవచ్చు!
మరి ఇరాన్ నుండి వచ్చే మిసైల్స్ ని ఎలా ఎదుర్కొగలవు గల్ఫ్ దేశాలు మరియు ఇజ్రాయేల్?
ప్రస్తుతానికి దక్షిణ కొరియా దగ్గర ఉన్న 132 ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని గల్ఫ్ కి తరలించింది అమెరికా! ఈ ఘటన రెండేళ్ల క్రితం రష్యా, ఉత్తర కొరియాల మధ్య జరిగిన డీల్ ని గుర్తుచేస్తున్నది. 2024 లో రష్యా దగ్గర 155 mm ప్రధాన యుద్ధ టాంక్ ( MBT )షెల్స్ అయిపోయాయి. పుతిన్ మరో మూడు కొత్త ప్లాంట్స్ ఏర్పాటు చేసి MBT షెల్స్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించాడు అప్పట్లో!
అప్పటి వరకూ STOP GAP కింద ఉత్తర కొరియా దగ్గర ఉన్న షెల్స్ ని వాడుకున్నాడు! ఇప్పుడు అదే పరిస్థితిని అమెరికాకి క్రియేట్ చేసాడు పుతిన్!
ఇప్పుడు అమెరికా, ఇజ్రాయేల్ లకి విరామం కావాలి ఇంటర్సెప్టర్ మిసైల్స్ కొత్తవి రావడానికి!
Well..! గత 20 ఏళ్లుగా ఇరాన్ మిసైల్ తయారీ మీద దృష్టి పెట్టి వేల కొద్దీ మిసైల్స్ ని భూగర్భ బంకర్స్ లో నిల్వ చేస్తూ వచ్చింది. ఇరాన్ కి రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేయడానికి చైనా ఉంది! మరి అమెరికాకి?
ఇజ్రాయేల్ వేసిన ప్లాన్ బెడిసికొట్టింది!
ఇజ్రాయేల్ ప్లాన్ ప్రకారం ఆయుతోల్లా అలీ ఖోమెనీని బాంబు దాడిలో చంపేస్తే ఇరాన్ లొంగిపోతుంది!
ఆయుతోల్లా అలీ ఖోమెనీ చనిపోతే ఏం చేయాలో ముందే ప్లాన్ సిద్ధం చేసుకుంది అక్కడి కౌన్సిల్.
ఇరాన్ లో గార్డియన్ కౌన్సిల్ అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు. సదరు కౌన్సిల్ కి సుప్రీం లీడర్ ఆయుతోల్లా అలీ ఖోమెనీ ఇంచార్జ్!
యుద్ధం అంటూ వచ్చి సుప్రీం లీడర్ మరణిస్తే ఏం చేయాలో ముందే సిద్ధం చేసుకున్నారు!
ఇరాన్ దేశాన్ని 7 జోన్ల కింద విభజించి ప్రతీ జోన్ కి ఒక ఇంచార్జ్ ని నియమించారు! యుద్ధం మొదలయ్యి సుప్రీం లీడర్ మరణించినా ప్రతీ జోన్ ఇంచార్జ్ యుద్దాన్ని కొనసాగిస్తారు!
ఇజ్రాయేల్ ప్లాన్ దెబ్బతిన్నది ఇక్కడే! అలీ ఖోమెనీ మరణించినా IRGC మీసైల్ దాడులని కొనసాగిస్తూనే ఉన్నది! ఆటో పైలట్ మోడ్..!
ఇజ్రాయేల్ మరో ప్లాన్….. ఇరాన్ లో మొత్తం 30,000 టార్గెట్స్ ని నాశనం చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయేల్!
రోజుకి 1,000 టార్గెట్స్ ని నాశనం చేస్తూ 30 రోజుల్లో 30,000 వేల టార్గెట్స్ పూర్తిచేయాలని ప్లాన్!
మెయిన్ టార్గెట్ ఆయుతోల్లా ఖోమెనీని హత్య చేయగలిగింది ఇజ్రాయేల్.
మొదటి మూడు రోజులు అంటే ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీలలో ఇజ్రాయేల్ కి చెందిన 200 ఫైటర్ జెట్స్ ఇరాన్ గగనతలం మీద ఎగురుతూ IRGC ని లక్ష్యం చేసుకొని దాడులు చేశాయి. మార్చ్ 4 వ తేదీ వరకూ ఇజ్రాయేల్ ప్లాన్ బాగానే అమలయ్యింది కానీ ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయేల్ లోని సైనిక, అణు, వాణిజ్య కేంద్రాలు ధ్వంసం అయ్యాయి!
ఇరాన్ మొదటి మూడు రోజులు క్రూయిజ్, బాలిస్టిక్ మిసయిల్స్ తో పాటు కామీకాజ్ డ్రోన్ల ని ప్రయోగించింది! వీటిని ఎదుర్కోవడానికి గల్ఫ్ లో ఉన్న అన్ని పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విచ్చలవిడిగా మిసైల్స్ ని ప్రయోగించాయి!
ఇజ్రాయేల్ కూడా తన స్వంత ఎయిర్ డిఫెన్స్ ని విచ్చల విడిగా వాడేసుకుంది!
ఎప్పుడైతే పేట్రియాట్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ స్టాక్ అయిపోయాయో F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్స్ తో దాడులు చేయడం మొదలు పెట్టాయి అమెరికా, ఇజ్రాయేల్ లు.
రష్యా విషయంలో కూడా ఉక్రెయిన్ ని అడ్డుపెట్టుకొని నాటో దేశాలు ఇదే వ్యూహన్ని అమలుచేసాయి! రష్యా కూడా ఇదే వ్యూహన్ని అమలు చేయించింది ఇరాన్ చేత!
ఇజ్రాయేల్ టెహ్రాన్ లోని IRGC హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా నేల మట్టం చేసింది ఫైటర్ జెట్స్ తో!
బదులుగా ఇరాన్ ఇజ్రాయేల్ లోని మోస్సాద్ హెడ్ క్వార్టర్స్ మీద హైపర్ సానిక్ బాలిస్టిక్ మిసైల్స్ తో దాడిచేసింది ప్రధాని నెతన్యాహు మరియు మోస్సాద్ చీఫ్ డేవిడ్ బర్నే ( David Barnea ) లు సమావేశం అయి ఉండగా!
ఇరాన్ తన మీసైల్ దాడిలో నెతన్యాహు చనిపోవడమో లేదా తీవ్రంగా గాయడడమో జరిగింది అని ఇరాన్ ప్రచారం చేస్తున్నది!
నెతన్యాహు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు అనడానికి కొన్ని సూచనలు కనపడుతున్నాయి అవి :
1. మార్చి 7 నుండి మార్చి 10 వరకూ నెతన్యాహు టీవీలలో కనపడడం కానీ ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ చేయలేదు అంటే పబ్లిక్ గా కనపడలేదు.
2. ఇదే సమయంలో ఆపరేషన్ రోరింగ్ లయన్ ( Operation Roaring Lion ) పేరుతో అమెరికా. ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ మీద చేసిన, చేస్తున్న దాడుల మీద ట్రంప్ తన సలహాదారులు, పెంటగన్ యుద్ధ వ్యూహకర్తలతో కూడిన బృందాన్ని ఇజ్రాయేల్ కి పంపడం, వాళ్ళు జాయింట్ మీటింగ్ లో పాల్గొనకుండా తిరిగి అమెరికా వెళ్లిపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటీ? నెతన్యాహు అందుబాటులో లేడు అన్న విషయాన్ని ట్రంప్ కి కూడా తెలియనివ్వడం లేదా? అందుకేనా ట్రంప్ తరుపున చర్చలు జరపడానికి వచ్చిన వాళ్ళు టెల్ అవీవ్ కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు?
3. నేతన్యాహు నిన్న ఇచ్చిన టీవీ ప్రకటనలో చేతికి అయిదు వేళ్ళు ఉన్నట్లుగా గుర్తిస్తూ నెటిజన్లు ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసి అది AI జెనరేటెడ్ వీడియో అని అంటున్నారు.
4.నెతన్యాహు సోదరుడు ఇద్దో నేతన్యాహు ( Iddo Netanyahu ) ఇరాన్ మీసైల్ దాడిలో చనిపోయాడు అదీ ఇంట్లో ఉండగానే! ఇది ధ్రువీకరించబడిన వార్త!
5. మోస్సాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నే ( David Barnea ) తో బెంజిమిన్ నేతన్యాహు సమావేశంలో ఉన్నప్పుడే ఇరాన్ దాడి చేసింది, ఆ దాడిలో డేవిడ్ బర్నే కూడా చనిపోయాడు అని ఇరాన్ అధికార వార్త సంస్థ ఇర్నా గత రెండురోజులు గా పదే పదే ప్రస్తవిస్తున్నది!
6. అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెట్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ట్రంప్ నుండి పిలుపు రావడంతో వెంటనే ఇంటర్వ్యూ ఆపేసి, ట్రంప్ తో మాట్లాడి వచ్చిన తరువాత, తిరిగి ఇంటర్వ్యూ కొనసాగించిన సమయంలో తడబడుతూ మాట్లాడడం కనిపించింది… బహుశా నేతన్యాహు తో పాటు మోస్సాద్ డైరెక్టర్ సమావేశం అవుతున్నప్పుడు ఇరాన్ దాడి జరిగిన విషయాన్ని ట్రంప్ స్కాట్ బెసెట్ తో చెప్పి ఉండవచ్చు!
7. అమెరికా కనుక అడ్డుపడకపోయి ఉంటే ఇరాన్ ఇజ్రాయేల్ ని స్మశానంగా మార్చి ఉండేది అని ట్రంప్ నిన్న అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటీ?
కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు……
నేతన్యాహు మోస్సాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నేతో సమావేశం అవుతున్న ప్రదేశం, సమయం ఇరాన్ ఎలా గుర్తించగలిగింది? ఎవరు సమాచారం ఇచ్చారు? ఎవరన్నా సమాచారం ఇచ్చినా అంత తొందరగా ఇరాన్ డ్రోన్ ని, హైపర్ సానిక్ మిసైల్ ని ఎలా ప్రయోగించగలిగింది? మిసైల్ కానీ, డ్రోన్ కానీ ఇరాన్ నుండి ప్రయోగిస్తే అవి ఇజ్రాయేల్ కి చేరుకోవడానికి సమయం పడుతుంది కదా?
ఇరాన్ షాహెద్ డ్రోన్ గంటకి 160 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణస్తుంది అంటే అది ఇజ్రాయేల్ చేరుకోవడానికి 9 గంటలు పడుతుంది! షహెద్ డ్రోన్ కాకుండా మరో డ్రోన్ ప్రయోగించినా అది ఇజ్రాయేల్ చేరుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది. అదే హైపర్ సానిక్ బాలిస్టిక్ మిసైల్ అయితే 9 నిముషాలలో చేరుకుంటుంది!
టెల్ అవీవ్ లోని మల్టీ స్టోర్ అపార్ట్మెంట్ మధ్య ఫ్లాట్ లో నేతన్యాహు, డేవిడ్ బర్నే సమావేశం అవుతున్న సమయం , లొకేషన్ ని ఎవరో ముందే ఇస్తే తప్ప ఇరాన్ అంత ఖచ్చితంగా డ్రోన్స్ ని, మిసైల్స్ ని ప్రయోగించలేదు!
ఇజ్రాయేల్ లో రెండు లక్షల మంది రష్యన్ భాష మాట్లాడే యూదులు ఉన్నారని పుతిన్ ఇటీవలే అన్నాడు! తమ స్వదేశం కి ద్రోహం చేసే యూదులు ఉంటారా? మరి CIA ఇచ్చివుంటుందా? మిగతా… తరువాయి భాగంలో..
Share this Article