Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారీ దాడులతో పాకిస్థాన్ విలవిల…! ఎందుకు బెలూచిస్థాన్ కీలకం..?

February 2, 2026 by M S R

.

పాకిస్థాన్ నెత్తురోడింది… సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పాకిస్థానీ శిక్షిత ఉగ్రవాదులే కదా నెత్తుటి ధారలు పారిస్తుంటారు… అలాంటిది తనే గాయపడి ఏడుస్తోంది… మొన్న బెలూచిస్థాన్ తీవ్రవాదులు దాదాపు 12 చోట్ల ‘ఆపరేషన్ హెరోఫ్’ పేరిట ఒకేసారి చేసిన దాడుల్లో కనీసం 200 మంది మరణించి ఉంటారని అంచనా… ఇంకా అయిపోలేదు కూడా…

బీఎల్ఏ (బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) ఏనాటి నుంచో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న సంగతి తెలుసు కదా… ఈసారి మిలిటరీ, పోలీస్, జైళ్లు, పారా మిలిటరీ, రైల్వే స్థావరాలపై ఆత్మాహుతి దాడులు, సాయుధదాడులు భీకరంగా జరిగాయి… జరిగిన నష్టం పూర్తి అంచనాలు తెలియడం లేదు గానీ మరణాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చునంటున్నారు… రెండు వైపులా…

Ads

మామూలుగా ప్రపంచ రాజకీయాల్లో చైనా, అమెరికా ప్రత్యర్థులు కదా… బెలూచిస్థాన్ మీద కూడా రెండు దేశాలకూ కన్నుంది… ఎందుకంటే..? ఇక్కడ దొరికే రేర్ మినరల్స్, బంగారం, రాగి, గ్యాస్… జనాభాపరంగా చిన్న ప్రావిన్స్ ఇది, కానీ ఖనిజకోణంలో అత్యంత విలువైన ప్రాంతం…

cpec

ఇరాన్ కేంద్రంగా బీఎల్ఏకు ఇండియా రహస్యంగా మద్దతు, సహకాారం ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపణ… చైనా కోణంలో చూద్దాం… చైనాకు బలూచిస్థాన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన CPEC (China-Pakistan Economic Corridor) ప్రాజెక్ట్‌లో గుండెకాయ వంటిది…

  • గ్వాదర్ పోర్ట్…: చైనా వందల కోట్ల డాలర్లు వెచ్చించి ఇక్కడ గ్వాదర్ ఓడరేవును నిర్మించింది… దీని ద్వారా అరబ్ సముద్రానికి చైనాకు నేరుగా దారి దొరుకుతుంది… రేర్ ఎర్త్ మినరల్స్ మీద కూడా చైనా కన్నుంది…

  • టార్గెట్…: చైనా తన ప్రాంతాన్ని దోచుకోవడానికి పాక్ ప్రభుత్వంతో చేతులు కలిపిందని BLA భావిస్తుంది… అందుకే చైనా ఇంజనీర్లు, ప్రాజెక్టులపై తరచుగా దాడులు చేస్తోంది… ఈ దాడుల వల్ల చైనా పెట్టుబడులకు భద్రత కరువైంది…

bla

అమెరికాకు కూడా ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం… BLAను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది… ఈ ప్రాంతంలో అస్థిరత ఏర్పడితే అది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల వరకు ప్రభావం చూపుతుందని, తద్వారా తీవ్రవాదం మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది…

ఇదంతా బయటికి చూపించేది… కానీ అక్కడి ఖనిజాల మీద అమెరికా కన్నుంది… ఇటీవల అమెరికా కంపెనీలు కూడా ఇక్కడి ఖనిజాల వెలికితీతపై ఆసక్తి చూపిస్తున్నాయి… అస్థిరత పెరిగితే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ఇబ్బంది కలుగుతుంది…

bla

పాకిస్థాన్ ఆర్మీ జనరల్‌తో ట్రంపు కుటుంబానికి క్రిప్టో వ్యాపార సంబంధాలున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా… పాకిస్థాన్‌తో ఇలాంటి సంబంధాలతోనే బెలూచిస్థాన్ నుంచి అవసరమైన విలువైన ఖనిజాలను తవ్వుకుందామని అమెరికా కంపెనీల ఆశ… బీఎల్ఏ విముక్తి పోరాటాలతో ఇటు చైనాకు అటు అమెరికాకు ఏకకాలంలో కలవరం…

pak army

పాకిస్థాన్ కూడా బీఎల్ఏను నిర్మూలించడానికి ఎంతోకాలంగా ప్రయత్నిస్తోంది… వందల మంది యువకులను మాయం చేసింది… అణిచివేసేకొద్దీ బీఎల్ఏ పెరుగుతోంది… ప్రపంచ రాజకీయాల్లో ఇది వ్యూహాత్మక కూడలి… స్ట్రాటజిక్ జంక్షన్… ఉగ్రవాదం, వ్యాపారం, జియో పాలిటిక్స్… సమాంతరంగా విముక్తి పోరాటం… అందుకే అంతర్జాతీయంగా మీడియా బెలూచిస్థాన్ వార్తలకు ప్రయారిటీ ఇస్తుంది…!

bla

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొలిటికల్ పంకిలంలోకి… కేంద్ర సర్వీసు అధికారులూ లాగబడుతున్నారు..!!
  • మృత్యువును ఎదిరిస్తూ… 11 రోజులు… ఓడ చుక్కానిపై వలస సాహసం..!!
  • భారీ దాడులతో పాకిస్థాన్ విలవిల…! ఎందుకు బెలూచిస్థాన్ కీలకం..?
  • ఆడ దెయ్యాలు వికృత రూపంతో, వికట ధోరణిలోనే ఉండిపోవాలా..?!
  • GaN … హైటెక్ సెమీ కండకర్ట్ రూపకల్పన… రక్షణరంగంలో మరో విజయం…
  • కమాన్, అంతరిక్షంలోనే తేల్చుకుందాం… అగ్రదేశాల ఎఐ హోరాహోరీ…
  • హనుమంతుడు నేర్పిన ‘కార్పొరేట్ కమ్యూనికేషన్స్’ పాఠాలు…
  • ఏం కష్టమొచ్చిందో గానీ… అందరితోనూ కన్నీరు పెట్టిస్తున్న ఫోటో…
  • విశ్వం విస్తరిస్తోంది సరే, కానీ ఏ ఖాళీలోకి..? అసలు గురుత్వాకర్షణ నిజమేనా..?
  • ఫోన్ కెమెరా లెన్సులకు ‘రెడ్ టేప్’… ట్యాపింగు నిరోధించగలదా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions