Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరీ ఈ దరిద్రుడికి కాషాయం – యావత్ సాధుగణానికే అవమానం !!

August 2, 2026 by M S R

.

నిన్నో మొన్నో పార్లమెంటు ఎదుట ‘అయోధ్య చందా చోరీ’ అంశంపై ఓ ప్రదర్శన నిర్వహించింది ప్రతిపక్షం… ముందుగా కొన్ని నిజాలు, నైతికతల గురించి మాట్లాడుకుని మరో కీలకాంశం, ప్రతిపక్షం దిగజారుడుతనం గురించి చెప్పుకుందాం… ప్రత్యేకించి కాంగ్రెస్ ఇంకా ఇంకా తను ‘హిందూ వ్యతిరేకి’ అని ముద్ర వేసుకుంటూ, నిరూపించుకుంటూ పోతున్న తీరు కూడా…

ఫస్ట్, అయోధ్య మాత్రమే కదా, అనేక గుళ్లల్లో అక్రమాలు నిజం… గొంతు చించుకుని అరిచే ఇదే లెఫ్ట్ పాలనలో శబరిమలలో నెయ్యి అక్రమాలు, బంగారం చోరీ నిజం కాదా..? అయోధ్యకు వద్దాం, ఈ పార్టీలన్నీ అయోధ్య గుడి నిర్మాణాన్ని వ్యతిరేకించినవే, అడ్డుకున్నవే… 500 ఏళ్ల హిందూ ఆత్మాభిమాన పోరాటాన్ని అపహాస్యం చేసినవే…

Ads

ఆర్జేడీ, ఎస్పీ  అయితే అనేకమంది కరసేవకుల ప్రాణాలను బలిగొన్నవే… వీళ్లెవరికీ అయోధ్యకు సంబంధించిన ఏ అంశంపైనైనా విమర్శ చేసే నైతికత లేదు… కానీ రాజకీయం ఊరుకోనివ్వదు కదా… నిజానికి అయోధ్య గుడి ఓ ట్రస్టు ఆధీనంలో నిర్వహించబడేది… బీజేపీకి దానికీ సంబంధం లేదు, మద్దతునివ్వడం తప్ప!

ఐనా ఆరోపణలు రాగానే యోగీ ఇన్వాల్వ్ అయ్యాడు, ఏరివేత మొదలైంది… అదంతా వేరే కథ… దీన్ని పార్లమెంటులో చర్చకు పెట్టి, యాగీ చేసి, బీజేపీని బదనాం చేయాలని ప్రతిపక్షం ప్రయత్నం… బీజేపీని ఎన్నో అంశాల్లో కడిగేయవచ్చు, రాజకీయాల్లో సహజం, కానీ అయోధ్యను ముందుపెట్టి నాటకాలు ఆడటమే దుర్మార్గం…

ఇది సంఘ్ భక్త భాష కాదు, అంధ భక్త భాష కాదు, రామ భక్త భాష…! ఆ చర్చను పక్కన పెడితే, ఆ ప్రహసన ప్రదర్శనలో పప్పూయాదవ్‌కు కాషాయ వస్త్రాలు ధరింపజేసి కూర్చోబెట్టారు… ఇది మొత్తం హిందూ సాధుసంతు గణాన్ని అవమానించడమే… రాహుల్ గాంధీ ఆనందంగా పాల్గొన్నాడు అందులో… పైగా పప్పూ యాదవ్ అనే దరిద్రుడికి కాషాయం తొడగడం అంటేనే, అది కాషాయధారణనే కించపరచడం..!

ఎందుకో తెలుసా..? వీడు ప్రస్తుత రాజకీయాల్లో  మోస్ట్ అన్‌వాంటెడ్ ఎలిమెంట్… ఈమధ్యే (ఏప్రిల్ 22) తన గురించి ‘ముచ్చట’ ప్రచురించిన ఓ కథనం చదవండి… పాతదే మరోసారి ఇలా…

పప్పుయాదవ్



  • ‘‘నేతల గదుల్లోకి వెళ్లకుండా (అర్థమైంది కదా) 90 శాతం మంది మహిళలు రాజకీయాలు చేయలేరు, రాజకీయ నాయకుల సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అదే తెలుస్తుంది… ఇదొక సంస్కృతిగా మారింది… లోకసభ, విధానసభల్లో మహిళల్ని రాబందుల్లా మిటకరించి చూస్తారు, 75 శాతం మంది ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తారు, మొబైళ్లు చెక్ చేయండి, అన్నీ అవే కనిపిస్తాయి… నాపై అనర్హత వేటు అంటున్న మహిళ కమిషన్ సభ్యులు కూడా రాజకీయ నేతలతో ఏ ఫోజుల్లో ఉంటారో నా దగ్గర ఆధారాలున్నాయి’’

…. కాంగ్రెస్ పార్టీ మద్దతున్న బీహార్ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ రోత, వెగటు, గలీజు, విషపు వ్యాఖ్యానాలు ఇవి… ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రతి మహిళనూ కించపరిచేవి… ఒకవైపు మహిళ రిజర్వేషన్ల మీద రచ్చ జరుగుతుంటే… ఇదీ కొందరు మగ పురుష్ ఎంపీల పోకడ… దారుణం, రాజకీయాల్లో మరీ దిగజారుడుతనం…

బీజేపీ ఖండించింది… బీహార్ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది… జాతీయ మహిళ కమిషన్ ఖండించింది… లోకసభ స్పీకర్ తనపై అనర్హత వేటు వేయాలని చాలామంది నేతలు డిమాండ్ చేస్తున్నారు… నిజానికి ఎవడు ఈ పప్పూ యాదవ్..? ఓ గ్యాంగ్‌స్టర్…



2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తనపై 41 పెండింగ్ కేసులు ఉన్నాయి… వాటిలో కొన్ని ప్రధానమైనవి… 1998లో సీపీఎం (CPM) ఎమ్మెల్యే అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పు యాదవ్ ప్రధాన నిందితుడు… ఈ కేసులో 2008లో కింది కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది… దీనివల్ల ఆయన కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు… అయితే, 2013లో పాట్నా హైకోర్టు ఆధారాలు సరిగ్గా లేవని నిర్దోషిగా విడుదల (Acquitted) చేసింది…

1995లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పురూలియా ఆయుధాల కేసులో ప్రధాన నిందితుడు కిమ్ డేవీని, భారతదేశం నుంచి తప్పించుకోవడానికి పప్పు యాదవ్ సహాయం చేశాడు… ఈరోజుకూ ఆ కేసు మిస్టరీ వీడలేదు… చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక పాత కేసు (సుమారు 31 ఏళ్ల క్రితం నాటి ఫోర్జరీ కేసు) విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో, 2026 ఫిబ్రవరిలో పాట్నా పోలీసులు అరెస్ట్ చేశాడు ఇటీవల…

41 కేసుల్లో ఈ క్రింది సెక్షన్ల కింద ఆరోపణలు ఉన్నాయి… హత్యాయత్నం (Attempt to murder), కిడ్నాపింగ్ (Kidnapping), దోపిడీ, బెదిరింపులు (Extortion & Criminal Intimidation), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, రైటింగ్ (Rioting), చట్టవిరుద్ధమైన సమావేశాలు నిర్వహించడం… జైలులో ఉన్న సమయంలో కూడా సెల్ ఫోన్లు వాడటం, అక్కడే దర్బార్ నిర్వహించడం వంటివి అప్పట్లో పెద్ద వివాదాలకు దారితీశాయి….



1990లో బీహార్‌లోని సింగేశ్వర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీకి (ఎమ్మెల్యేగా) ఎన్నిక… 1991లో పూర్ణియా నియోజకవర్గం నుండి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలుపు… ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ (SP) నుంచి 1996లో తరపున ఎంపీ… రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నుంచి 2004, 2014లలో ఎంపీ… జన్ అధికార్ పార్టీ (JAP) పేరిట 2015లో తన సొంత పార్టీని స్థాపించుకుని, తరువాత దీన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పూర్ణియా నుండి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచాడు…

ఇవే, ఈ పార్టీలే మొదటి నుంచీ మహిళ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, అడ్డుకుంటూ వస్తున్నాయి… నేరగాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చి భ్రష్టుపట్టించినవి కూడా ఈ పార్టీలే… ప్రత్యేకించి ఆర్జేడీ, ఎస్పీ… ఇలాంటి గ్యాంగ్‌స్టర్లకు కాంగ్రెస్ కూడా మద్దతు… మహిళా రాజకీయ నాయకులపై వీడి చెత్త వ్యాఖ్యలను ఈ పార్టీలు ఖండించలేదు… ఇప్పుడు అత్యంత కీలక పదవుల్లో కూడా మహిళ నాయకులున్నారు, ఆ పదవులకే శోభ తీసుకొస్తున్నారు… అందరినీ కించపరిచినట్టే… సో, వీడిపై అనర్హత వేటు వేయడమే కరెక్టు…

  • చివరగా… వీడి భార్య రంజీత్ రంజన్ కూడా రాజకీయాల్లోనే ఉంది… రాజ్యసభ సభ్యురాలు… గతంలో లోకసభకు కూడా ఎన్నికైంది…
  • లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వీడిని టార్గెట్ చేశాక… నేను నా భర్తతో రెండేళ్లుగా దూరంగా, విడిగా ఉంటున్నాను అని ప్రకటించింది ఆమె…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరీ ఈ దరిద్రుడికి కాషాయం – యావత్ సాధుగణానికే అవమానం !!
  • ఇప్పుడు పిక్చర్ క్లియర్ ! కాళేశ్వరం మూడు బరాజులూ ప్రమాద స్థితిలోనే !!
  • ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక ! చప్పట్లు తిండి పెట్టవు !!
  • మీ పిల్లలు ప్రధానిని బూతులు తిడితే… మీరేం చేస్తారు?!
  • స్పెయిన్ చొరబాట్లు – భారతమా బహుపరాక్ – వలసల వెనుక కుట్ర !!
  • Sita – Warrior of Mithila – సీత అసూర్యంపశ్య కాదు – యోధురాలు !!
  • తలెగరేసిన తెలంగాణ ! ఏ దొరవారు లేరనో అభివృద్ధి ఆగదు !!
  • సోలో బతుకే సో బెటర్ ! పెళ్లి కాలేదని ఎంతమాత్రమూ చింతించవలదు !
  • సీతకన్నా బాగుంది! ఇది ఓ ట్రోల్ పోలిక! ఇంతకీ ఈమె ఎవరంటే?!
  • దొరతనం ! అవలక్షణులను తెలంగాణపై రుద్దిన క్షుద్రరాజకీయం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions