Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!

July 10, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మన చుట్టూ కావలసినంత మంది పేకాట పాపారావులు ఉంటారు . వాళ్ళకు ఇదే వ్యాపకం , వ్యాపారం , every thing . Professional players . పొద్దున్నే తొమ్మిది గంటలకే క్లబ్బుల్లో చేరుతారు . కొంతమంది అయితే ఇళ్ళకు కూడా వెళ్ళరు . క్లబ్బుల్లోనే టేబుల్స్ మీద పడుకొని పొద్దున్నే మళ్ళా మొదలు . ఇలాంటి పేకాట పాపారావు కధే ఈ సినిమా .

It’s a romantic comedy entertainer . నటీనటుల నటనకన్నా కధను నేసిన M.S.నారాయణను , జనార్ధన్ మహర్షిలను ; డైలాగులను వ్రాసిన తనికెళ్ళ భరణిని ; స్క్రీన్ ప్లే –  దర్శకత్వం వహించిన వై నాగేశ్వరరావుని అభినందించాలి .

Ads

ఆ తర్వాత రాజ్ కోటి సంగీత దర్శకత్వాన్ని , పాటల్ని వ్రాసిన సిరివెన్నెల వారిని , జొన్నవిత్తుల వారిని , గూడూరు విశ్వనాధ శాస్త్రి గార్లను , చాలా శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , చిత్ర , రాధికలను మెచ్చుకోవాలి . పాటల్ని దర్శకుడు చక్కగా చిత్రీకరించారు . డాన్సుల్ని బాగా కంపోజ్ చేసిన సుచిత్ర , శివ సుబ్రమణ్యం , జాన్ బాబులను ప్రత్యేకంగా అభినందించాలి . సినిమా బాగా ఆడేందుకు వీరందరూ తలా ఒక చెయ్యి వేసారు .

టూకీగా కధ ఏంటంటే ఓ ఊళ్ళో ఓ పేకాట పాపారావు . ఆ ఊళ్ళోనే ఒక లేడీ యస్సై . ఓ కిలాడీ గాడిని పట్టుకునే క్రమంలో లేడీ యస్సై పాపారావు ఒకరికి ఒకరు తారసపడి ప్రేమలో పడతారు . ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ వృత్తులు తెలుసుకోకుండా పెళ్లి కూడా చేసుకుంటారు .

ఆ ఊళ్ళోనే పేకాట క్లబ్ నడిపే విలన్ లేడీ యస్సై మీద పగతో పాపారావుని శోభనం మొదటి రోజునే స్వంత భార్య చేతనే అరెస్ట్ చేయిస్తాడు . ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నిశ్చేష్టులు అవుతారు . కోపాలు తెచ్చుకుని సవాళ్లు విసురుకుంటారు .

ముప్పై రోజుల పాటు ప్రవరుడిలాగా నిగ్రహంతో ఉంటే యస్సై ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటుంది . ఓడిపోతే పేకాట మానేస్తానని పాపారావు శపధం పూనుతాడు . ఇంక అక్కడ నుంచి భార్యాభర్తలు ఎత్తుకు పైఎత్తులు , పాపారావుని రిపేర్ చేయటానికి ఇంటిల్లిపాది తిప్పలు , చివరకు విలన్ని చట్టానికి అప్పచెప్పటంతో సినిమా శుభాంతం అవుతుంది . కొసమెరుపు ఏంటంటే పేకాట పాపారావు కొడుకు అన్నప్రాసన నాడు జోకర్ ముక్కని పట్టుకోవడం . బ్లడ్డు మరి… 

సినిమాలో పేకాట పురాణం , పేకాట వేదాంతం , ఉచ్చ పెట్రోలు కావటం , జోకర్ ముక్కకు పాపారావు పూజ చేయటం  వగైరా బాగా జొప్పించారు . పేకాటతో జీవితం గురించి చెప్పటం బాగుంటుంది . సంవత్సరంలో 52 వారాలు ఉన్నట్లు పేకలో కూడా 52 ముక్కలే ఉంటాయని ఒక్కో ముక్కకు ఒక్కో వివరణ తనికెళ్ళ భరణి బాగా వ్రాసారు .

హీరో రాజేంద్రప్రసాదుకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . హుషారు హుషారుగా నటించాడు . యస్సైగా ఖుష్బూ , బామ్మగా నిర్మలమ్మ , చెల్లెలుగా శాంతి (హరిత) , బావ గారిగా తనికెళ్ల భరణి , విలన్లుగా శివాజీ రాజా , కొత్త నటుడు మీసాల భాస్కర్ నటించారు .

ఈ మీసాల భాస్కర్ బాగా నటించాడు . ఇతర పాత్రల్లో ఆలీ , ఐరన్ లెగ్ శాస్త్రి , బ్రహ్మానందం , గుండు హనుమంతరావు , కిరణ్ కాదంబరి తదితరులు నటించారు .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . కొయ్ కొయ్ కొయ్ పేకాట పాపారావు అంటూ సాగే పాట క్లబ్బులో పేకాట గాళ్ళ మీద సరదాగా సాగుతుంది . చెంతకు వస్తే చెరిసగమవుతా చెక్కిలి అందిస్తా డ్యూయెట్ చాలా చాలా మెలోడియస్ గా ఉంటుంది .

అలాగే మరో రెండు డ్యూయెట్లు ప్రేమ పుట్టిందోయ్ ఏం చేయమంటావ్ , పుకారే పుకారే ఊరంతా పుకారే కూడా బాగా చిత్రీకరించబడ్డాయి . మరో హుషారయిన పాట తాయిలమిస్తా .

రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూట్యూబులో ఉంది . పూర్తి వినోదాత్మక హాస్య చిత్రం . రాజేంద్రప్రసాద్ మార్క్ సినిమా . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సరదా సరదా సినిమాయే .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ది కాలధర్మం ! ఫలించని ఆధునిక వైద్యచికిత్స ! బీఆర్ఎస్ పార్టీకి లోటు !
  • తెలంగాణ ప్రభుత్వమా… బహుపరాక్! నీళ్లను జనరేట్ చేయలేం..!!
  • ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…
  • ‘‘ఇలా కేసులు పడితే, ఇక ఎవరూ దేవుళ్ల మీద సినిమాలు తీయలేరు’’
  • లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడితే… ఇదుగో ఇలాంటి ప్రమాదాలే !!
  • కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!
  • మరో వారసుడి నిరాశాపూరిత ఎంట్రీ – మోహన్‌ బాబునూ వాడుకోలేదు !!
  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions