.
పోచారం శ్రీనివాస రెడ్డి… ఆ డ్రెస్స్ ఏమిటో, ఆ మాటలు ఏమిటో, సారు గారు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారో… పాపం, ఇలాంటోళ్లను ఆ రేవంత్ రెడ్డి ఎందుకు నమ్మి కండువా కప్పాడో… అంతా మాయ… డబ్బు, కంట్రాక్టుల చుట్టే సోకాల్డ్ ప్రజాసేవ, పార్టీ విధేయత…
అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను! – అవును, ఎందుకు చేరావు..?
Ads
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు… – ఇష్టం లేకున్నా ఏ దేవుడు శాసించాడు పాపం..?
అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది… – అన్నం పెట్టినోడికీ సున్నం పెట్టడమే గుణమైతే రేప్పొద్దున రేవంత్‌కూ, కాంగ్రెస్‌కూ చేయివ్వడం పెద్ద పనేమీ కాదన్నట్టేనా..?
కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది… – అంత సీరియస్ రాజకీయ పరిణామాలేమున్నాయి, ఏం ముంచుకొచ్చాయి నాయకా..?
నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు… – అన్నం పెట్టినోడిని మరిచాను అంటావు, డెవలప్‌మెంట్ నిధులిస్తానని సీఎం చెబితేనే పార్టీ మారాను అంటావు, మళ్లీ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటావు, జస్ట్, జాతీయ జెండా కప్పుకున్నాను అంటావు… జనం మరీ అంత చీప్ అయిపోయారా స్వామీ..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు… – ఏమో ఎవరి కోరికల వెనుక ఏమున్నదో, పదే పదే ఈ అసమ్మతి వ్యాఖ్యలేమిటో వాళ్లకూ అర్థమైపోయి అందరూ అవాయిడ్ చేస్తున్నారా..?
మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు… – పాపం, పెద్ద సమస్యే, పుట్టు కాంగ్రెస్‌కూ మెట్టు కాంగ్రెస్‌కూ తేడా అర్థమైపోయింది సారు గారికి…
….. జాతీయ జెండా కప్పుకుంటే కాంగ్రెస్‌లో చేరినట్టా..? ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడం లేదు పాపం… అందుకే జీవన్‌రెడ్డిని రమ్మన్నాడు గానీ పోచారం మొహం చూడటం లేదేమో కేసీయార్… ఆమధ్య పోచారం గాచారం అని కూడా బీఆర్ఎస్ ముఖ్యులెవరో కామెంట్ చేసినట్టు గుర్తు…
ఒక దానం నాగేందర్, ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఒక మహిపాల్ రెడ్డి… కాంగ్రెస్ ఎవరికి ఏం తక్కువ చేసింది..? ఐనా కృతజ్ఙతా రాహిత్యమే… దశాబ్దాలుగా జగిత్యాలలో జీవన్ రెడ్డి చెప్పిందే శాసనం కదా, ఎమ్మెల్సీ కాకపోతే ఎమ్మెల్యే, లేకపోతే ఎంపీ… ప్రతిసారీ తనే కదా… కానీ ఏం జరిగింది..? బీఆర్ఎస్ చేతుల్లో పెట్టాడు చేజేతులా… మళ్లీ తన కుటుంబానికే టికెట్లు, పనులు, ప్రయారిటీ… ఇంకా ఎన్నేళ్లు మోయాలి తనను..?
పోనీ, కేసీయార్ గడీలోకి ప్రవేశించాడు… ఏం సాధించాడు..? చివరకు దాసోజు, ఆర్ఎస్పీల మాటలకున్న విలువ కూడా జీవన్‌రెడ్డికి ఉందా…? ఏమైంది ఒకనాటి పౌరుషం..? మధ్యలో కాషాయం కప్పుకుని మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్..? ఎందుకిలా పార్టీని పలుచన చేయడం..?
నాగేందర్ కథేమిటి..? ఎవరూ తక్కువ కాదు… ఎస్, కాంగ్రెస్ నిజంగా పార్టీకి కమిటెడ్ నాయకులెవరో తేల్చుకోవాలి… బీఆర్ఎస్‌ను తట్టుకోవడం అంత సులభం కాదు, సో, ఎవరు పార్టీకి అసలు బలమో, ఎవరిని మాత్రమే నిలబెట్టుకోవాలో తేల్చుకోవాల్సింది హైకమాండే..!!
Share this Article