Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె అసలే విజయశాంతి – సీఎంకే గండం ! ఈజీగా లేపేయగలదు !!

August 19, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నట విశ్వరూపం 1993 నవంబరులో వచ్చిన ఈ పోలీస్ లాకప్ సినిమా . 16 కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ సినిమా కధ క్రెడిట్ ని చిత్ర నిర్మాణ యూనిట్ కి ఇచ్చారు టైటిల్సులో . స్క్రీన్ ప్లే , దర్శకత్వం కోడి రామకృష్ణదే . అద్భుతంగా నిర్వహించారు .

రాజకీయ నాయకులు తలచుకుంటే ఏమయినా చేయగలరు అనే సందేశాన్ని ఇచ్చే political and action movie . అనగనగా ఓ రాష్ట్రం . ఆ రాష్ట్ర హోం మంత్రి ముఖ్యమంత్రిని లేపేసి ఆ సీట్లో కూర్చుంటాడు . ఆ కేసుని ఛేదిస్తానికి సిబిఐ ఆఫీసరుగా రంగప్రవేశం చేస్తుంది విజయ పాత్రలో విజయశాంతి .

Ads

ఆమెను పోలిన మరో విజయశాంతి శాంతి పాత్రలో పోలీస్ ఇనస్పెక్టర్ వినోద్ కుమార్ భార్య . సిబిఐ వాళ్ళను నోటీస్ ఇవ్వకుండా ఆపటం మన రాష్ట్రంలో చూసాం . ఈ సినిమాలో ఏకంగా ఆఫీసర్నే ఓ కేసులో ఇరికించి జైల్లో పడేస్తారు . ఇనస్పెక్టర్ భార్య శాంతి కర్ఫ్యూ టైంలో నిర్బంధించబడి విజయ ఉన్న సెల్ లోకే వస్తుంది .
ఇద్దరు ప్లేసులు మారుతారు .

బయటకొచ్చిన విజయ ముఖ్యమంత్రి పెంచలయ్య , అతను హైర్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్ కెప్టెన్ రాజు , వాళ్ళ ముఠాని అంతం అందించటమే క్లైమాక్స్ . ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర రాజకీయ చదరంగం సినిమాలో చరణ్ రాజ్ పాత్రను గుర్తుకు తెస్తుంది .

క్లైమాక్స్ సీనుని కాంచీపురం , శ్రీకాళహస్తి లలో షూట్ చేసారు . ఆరోజుల్లో కాబట్టి అనుమతి లభించింది . ఈరోజుల్లో అయితే పొరపాటున కూడా రాదు . సినిమాకు రాజ్ కోటి సంగీతాన్ని అందించారు . రెండు పాటలే ఉంటాయి . ఒకటి వినోద్ కుమార్ , విజయశాంతిల మీద డ్యూయెట్ . మరొకటి శ్రీమంతం పాట .ఏక్షన్ సినిమా కాబట్టి పాటలకు పెద్ద ప్రాముఖ్యత లేదు .

విజయశాంతి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర గిరిబాబుది . ఇరగదీసాడు . తేడా గాడిగా రకరకాల సామెతల్ని వదులుతూ భలే నటించాడు . ఈ సినిమాకు డైలాగులను ఎవరు వ్రాసారో తెలియదు . టైటిల్సులో కూడా వేయలేదు ఎందుకనో ! బాగా వ్రాసారు . ముఖ్యంగా గిరిబాబు డైలాగులను .

ఇతర ప్రధాన పాత్రల్లో ముఖ్యం అయినది కాస్ట్యూమ్స్ కృష్ణది . చాలా బాగా నటించాడు . ఇంకా ప్రముఖంగా చెప్పుకోవలసింది అతని PA పాత్ర . నటుడు పేరు తెలియదు నాకు . అద్భుతంగా నటించాడు . ఇతర పాత్రల్లో కనకాల లక్ష్మీ దేవి , కెప్టెన్ రాజు , రాజీవి , సుందర రామ శర్మ  తదితరులు నటించారు .

సినిమా యూట్యూబులో ఉంది . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తూ ఉంటుంది . నేను ఆరోజుల్లో థియేటర్లోనే చూసా . ఈమధ్య టివిలో కూడా చూసా . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ ఏక్షన్ ఓరియెంటెడ్ పొలిటికల్ మూవీ . ఇంక విజయశాంతి అభిమానులు అయితే చెప్పే అవసరం లేదు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions