Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!

June 2, 2026 by M S R

.

బాల్క సుమన్ బీఆర్ఎస్ కేడర్‌‌కు మిలిటెంట్ పోడకలతో విధ్వంసం క్రియేట్ చేద్దామని పిలుపు ఇచ్చిన వీడియోలు చూశారు, వార్తలు చదివారు… తరువాత తన మాటల్ని ఫ్యాబ్రికేట్ చేసి, సీఎంఓ కావాలనే జనంలోకి తప్పుడు బాటలో ప్రసారం చేయించిందని తను ఆరోపించాడు…

అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని చెబుతున్నప్పుడు… ఇక ఆ ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు, మరో నాయకుడి మీద ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నలు రాకూడదు… పైగా సింగరేణిలో లక్షల టన్నుల బొగ్గు మాయం, ఈ స్కామ్స్ మాట్లాడుతుంటే, డైవర్షన్ కోసం ఈ వీడియో బయటపెట్టారు అనీ అనకూడదు…

Ads

  • నిజంగానే వీడియోను ఎడిట్ చేసి, వక్రీకరించి ప్రచారం చేశారని భావిస్తే… ఆ వీడియోను తయారు చేసిన వారిపై లేదా ప్రచారం చేసిన వారిపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు..? ఫ్యాబ్రికేషన్ జరిగిందని చెబుతున్నప్పుడు, దానిని నిరూపించేందుకు ఫోరెన్సిక్ విచారణ కోరడం లేదా సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేయడం సహజమైన చర్య కాదా..?

వన్స్, ఫ్యాబ్రికేటెడ్ వీడియో అన్నప్పుడు ఇక దానికే కట్టుబడి ఉండాలి… సరే, తనది విధ్వంస భాష… మరి బీఆర్ఎస్ పెద్ద తలకాయలు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉండిపోయారు..? అంటే సుమన్ భాషను, ధోరణిని ఎండార్స్ చేస్తున్నారా..? నెత్తుటి చుక్క కిందపడకుండా తెలంగాణను సాధించాను అని ఘనంగా చెప్పుకునే కేసీయార్‌కు ఈ తాజా విధ్వంస రాజకీయం సిగ్గుచేటు… కానీ తను నోరిప్పడు…

పైగా కొందరు బీఆర్ఎస్ నాయకులు ‘సుమన్ మీద కక్షసాధింపు’ అని రాజకీయంగా ప్రతిదాడికి దిగారు… ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… ఓ తెలంగాణ నేత ‘తెలంగాణ డిక్షనరీలోనే లేని పదం’ అని ఏదో మాట్లాడితే… గతంలో తెలంగాణ అనే పదాన్నే ఎవరూ పలకకుండా నిషేధించిన సదరు చంద్రబాబు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించాడు.., మాటలు జాగ్రత్త అని హెచ్చరించాడు… కేసీయార్, వింటున్నావా..?

“రాజకీయ సంస్థ అగ్ర నాయకత్వం ఈ ప్రమాదకరమైన, సంఘ వ్యతిరేక ప్రకటనలను ఖండించకపోవడం లేదా వాటి నుండి తమను తాము దూరం చేసుకోకపోవడం, అలాగే నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడం, తన మాటలను ఉపసంహరించుకోకపోవడం, లేదా తన నేరపూరిత వైఖరిని మార్చుకోవడానికి ఎలాంటి వివరణను ప్రచురించకపోవడం దర్యాప్తుకు అత్యంత కీలకమైన అంశం” అని తన రిమాండ్ నివేదిక పేర్కొంది…

బాల్క సుమన్ వ్యాఖ్యల్ని, ధోరణిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది… ఈ ధోరణులు పెరగకుండా ఇక్కడే అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది… ఏకంగా దేశద్రోహం కేసు పెట్టేసింది… తన మీద పెట్టిన సెక్షన్ల తీవ్రత ఇలా ఉంటుంది…

బాల్క సుమన్

కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 , ప్రజా ఆస్తుల పరిరక్షణ చట్టం (PDPP Act) కింద నమోదు చేసిన సెక్షన్ల వివరాలు, వాటి తీవ్రత…

1. సెక్షన్ 152 BNS (దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించడం) – అత్యంత తీవ్రమైనది.
ఇది పాత ఐపిసి (IPC) లోని ‘రాజద్రోహం’ (Sedition – Sec 124A) స్థానంలో వచ్చిన కొత్త సెక్షన్.

దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ప్రసంగాలు చేయడం, సోషల్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, తిరుగుబాటును ప్రోత్సహించడం లేదా విచ్ఛిన్నకర శక్తులకు ఆర్థిక సహాయం అందించడం వంటి చర్యలకు ఇది వర్తిస్తుంది.

శిక్ష…: ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే జీవిత ఖైదు (Life Imprisonment) లేదా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.

2. సెక్షన్ 326(g) BNS (ఆగ్రాహ్యమైన ఆస్తి నష్టం / నిప్పు పెట్టడం) …  ఇళ్లను/ భవనాలను ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడం (Arson) లేదా పూర్తిగా ధ్వంసం చేయాలని చూడటం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది.

శిక్ష…: దీనికి కూడా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంది.

3. సెక్షన్ 353(1)(b) BNS (ప్రజా శాంతికి భంగం కలిగించే పుకార్లు / తప్పుడు ప్రచారం) … పాత IPC 505 స్థానంలో వచ్చిన సెక్షన్ ఇది. సమాజంలో భయాందోళనలు, అలజడి సృష్టించేలా, లేదా ప్రజలు ప్రభుత్వంపై లేదా ఇతర వర్గాలపై తిరగబడేలా తప్పుడు సమాచారాన్ని, పుకార్లను (ముఖ్యంగా డిజిటల్/సోషల్ మీడియా వేదికల ద్వారా) ప్రచారం చేసినప్పుడు ఇది వర్తిస్తుంది.

శిక్ష…: 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.

4. ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం (PDPP Act) – సెక్షన్ 4 … ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులను (బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైనవి) అగ్ని ప్రమాదాలు లేదా పేలుడు పదార్థాల ద్వారా ధ్వంసం చేసినప్పుడు ఈ చట్టం కింద కేసు పెడతారు.

శిక్ష…: కనీసం ఒక సంవత్సరం నుండి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

ఇతర సపోర్టింగ్ సెక్షన్లు: సెక్షన్ 61(2)(a) BNS: నేరపూరిత కుట్ర (Criminal Conspiracy). సెక్షన్ 351(3) BNS: తీవ్రమైన క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం… చట్టపరంగా ఇవి చాలా బలమైన సెక్షన్లు, నిందితులకు త్వరగా బెయిల్ రావడం కూడా చాలా కష్టం…



  • కేసుకు ప్రధాన ఆధారం వీడియో.
  • వీడియో ప్రామాణికతను ఫోరెన్సిక్ ఆధారాలు నిర్ధారించాలి.
  • ఆ వీడియోలోని మాటలు చట్టపరంగా ఆయా సెక్షన్లకు సరిపోతాయా అనే తుది నిర్ణయం కోర్టుదే.


అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది… బాల్క సుమన్‌పై మొత్తం 3 సెక్షన్లు నమోదు చేయగా… ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే సెక్షన్ వర్తించదని విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది… ఈ కేసులో 2 సెక్షన్లు మాత్రమే బాల్క సుమన్‌కు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది… ఈ క్రమంలోనే బాల్క సుమన్‌పై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను కోర్టు రద్దు చేసింది…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …
  • నో మ్యాచ్ పాయింట్..! ఈ పెళ్ళి సంబంధం మాకొద్దు..!
  • కోమల’మైన గళం… శాస్త్రీయ స్వరజ్ఞానం… ఇండస్ట్రీ గుర్తించలేదు…
  • రేవంత్ సవాల్‌కు ఒక్కసారిగా కేటీయార్, హరీష్ సైలెంట్..!!
  • మమత పార్టీలో ముసలం..! మొహం చాటేస్తున్న ఎమ్మెల్యేలు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions