Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంస్కారం తప్పిన సాయి మాధవుడు… రైట్ రాయల్ వరలక్ష్మి వివరణ…

March 8, 2026 by M S R

.

సరస్వతి అని రీసెంటుగా ఓ సినిమా వచ్చింది… వరలక్ష్మి కథానాయిక కమ్ దర్శకురాలు, దోస డైరీస్ పేరిట నిర్మాత కూడా..! ఆ సినిమా నాణ్యతపై ఇదేమీ సమీక్ష కాదు… అంత పెద్ద ఇంప్రెసివ్ సినిమా కూడా ఏమీ కాదు…

కాకపోతే వరలక్ష్మి గురించి చెప్పడం… సినిమా కుటుంబనేపథ్యం ఉన్నా సరే, ఎప్పుడూ ప్రధాన పాత్రలు, లీడ్ రోల్స్ కావాలని ఏమీ అడగదు… ఏ పాత్ర ఇచ్చినా చేస్తుంది, ఇమిడిపోతుంది, పాత్రకు న్యాయం చేస్తుంది… ఇప్పుడు ఏకంగా నిర్మాత, దర్శకురాలు అయిపోయింది… ఓ వుమెన్ సెంట్రిక్ కథ తీసుకుంది, తన వరకూ బాగా నటించింది… దర్శకురాలిగా సక్సెసా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్…

Ads

వివాదం ఏమిటంటే..? డైలాగుల రచయితగా ప్రసిద్ధుడు బుర్రా సాయి మాధవ్… దీనికి కథను అందించాడట… వరలక్ష్మి కూడా టైటిల్స్‌లో ఆ క్రెడిట్స్ ఇచ్చింది… ఆమె ఏమీ ఆ కథను దొంగిలించలేదు… సరైన పారితోషికం ఇచ్చి మరీ రైట్ రాయల్‌గా తీసుకుంది…

అందులోని కొంత భాగమే తీసుకుంది, తన క్రియేటివ్ ఫ్రీడమ్ వాడుకుంది, మార్పులు చేసుకుంది, సీన్లు కొత్తగా యాడ్ చేసుకుంది.., అది ఆమె హక్కు… కథారచయిత ఇచ్చిన కథనే యథాతథంగా తీయాలని ఏముంది..? అక్కరలేదు… ఏదో పెద్ద సినిమాకు పనిచేస్తూ వరలక్ష్మి టీమ్‌కు అందుబాటులో కూడా లేడు తను… సో, డబ్బులు తనవి, షీరో తను, దర్శకురాలు తను… అవసరమైన మార్పుల్ని చేసుకుంది…

ఇక్కడివరకూ వరలక్ష్మి ఫెయిర్… కానీ సినిమా రిలీజయ్యాక హఠాత్తుగా సదరు సాయిమాధవుడు మెలకువ వచ్చింది… నా కథను మానభంగం చేశారు, నా కథ సోల్ వేరు, నా కథ రివెంజ్ డ్రామా కాదు, చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేశారు అని ఆరోపించాడు… చాలా దుర్మార్గమైన వ్యాఖ్య… కథను మానభంగం చేయడం ఏమిటి..? తన డైలాగుల కెరీర్‌లో అతి చెత్త డైలాగ్ ఇదేనేమో బహుశా…

కథను అమ్ముకున్నావు, ఆ కథను ఏం చేసుకోవాలో నిర్మాతల ఇష్టం… మరీ నచ్చకపోతే ఆ కథ నాది కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పుకో, అంతేతప్ప ఈ మానభంగం విమర్శలు ఏమిటి..? అదీ ఎవరిని ఉద్దేశించి… ఓ ఫేమస్ సినిమా లేడీ పర్సనాలిటీ గురించి… పక్కా కుసంస్కారం..!! నువ్వు అందుబాటులో లేకపోతే మరేం చేయాలి..?

ఈ విమర్శ చదివాక ఆమె స్పందించింది… చాలా హుందాగా, సంస్కారంతో బదులిచ్చింది… ఎక్కడా పరుషమైన పదాలు వాడలేదు… ‘‘నేనేమీ దొంగిలించలేదు ఆ కథను, డబ్బులిచ్చాను, క్రెడిట్స్ ఇచ్చాను… ఆ కథ ఆయన దగ్గర ఆరేళ్లుగా ఉంది, నాకు ఆడియో నోట్‌లాగా ఆ కథను పంపించాడు… నాకు ఎంత అవసరమో అంతే తీసుకున్నాను… ఆ కథ లైన్ మాత్రమే తీసుకున్నాను అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను కూడా…

ఆయన ఫోన్‌లో కూడా దొరకలేదు, ఓసారి దొరికాక బిజీగా ఉన్నారు, నేనే డీల్ చేస్తానులెండి అని చెబితే వోకే అన్నాడు… ఇక ఇందులో నేను చేసిన తప్పేముంది..? దీనికి మానభంగం అనే పదాలు వాడటం ఏమిటి..? ఐనా సరే, నేను ఇంతకు మించి తగ్గిపోయి మాట్లాడలేను.,..’’ ఇదీ ఆమె వివరణ… సూపర్, వరలక్ష్మి చాలా కరెక్టు…

ఎటొచ్చీ, బయటపడిపోయి, తన గుణం బయటపెట్టుకుని బదనాం అయిపోయింది, పైగా ఓ లేడీ పర్సనాలిటీతో ఇలా మాట్లాడి పరువు పోగొట్టుకున్నది మాత్రం బుర్రా… అవును, ‘‘బుర్ర’’ సాయిమాధవే..!! ప్రతిభకూ, గుణానికీ సంబంధం లేదు… ఒక ఇళయరాజా, ఒక రెహమాన్, ఒక సాయిమాధవ్… ఎందరెందరో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీన్ కట్ చేస్తే… ఆ పోలీస్ భార్య ఏకంగా కలెక్టర్ అయిపోతుంది…
  • సంస్కారం తప్పిన సాయి మాధవుడు… రైట్ రాయల్ వరలక్ష్మి వివరణ…
  • ప్లీజ్ నమ్మండయ్యా… నాకస్సలు సంబంధం లేదు… నాకేమీ తెలియదు…
  • ఈ వెలుగుమట్ల విధ్వంసం వెనుక చీకటి కథలెన్నో… చెప్పుకోవల్సిందే…
  • మమత నా చెల్లెలు- ఎందుకిలా చేసింది..? హర్టయిన రాష్ట్రపతి ముర్ము..!!
  • రై రై రా రా… పెద్ది శ్రీరామ్‌కు యుద్ధ విధ్వంసాభివందనాలు…
  • టాప్ వన్ బౌలర్ అండ్ టాప్ వన్ బ్యాటర్… తీసేస్తారా, ఉంచేస్తారా…
  • శృతి మించిన శృంగారం… నారీ నారీ నడుమ ‘లైన్’ తప్పిన మురారి…
  • మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం, నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…
  • “హే గూగుల్… గతం మరవనివ్వవా..! కర్ణాటక హైకోర్టుకు శ్రీలంక సుప్రీం జడ్జి”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions