.
మణిపురి సినిమా “బూంగ్” కోటి క్లబ్‌లోకి ఎలా వచ్చింది? అసలు కోటి రూపాయలు వర్తమాన ఇండియన్ సినిమా బడ్జెట్‌లో ఎంత..? మీడియా మీట్లు, వాటిల్లో పెట్టే పల్లీబఠానీలు, కవర్ల ఖర్చు… మరేమిటి చెప్పుకోవాల్సింది..?
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఎట్సెట్రా చాలా వుడ్డులున్నాయి… భోజ్‌పురి, గుజరాతీ, మరాఠీ ఎట్సెట్రా వుడ్డులు కూడా ఉన్నాయి… కానీ ఇది మణివుడ్… అనగా మణిపురి భాషలో తీసే సినిమాలు… ఇంట్రస్టింగ్ కదా… వివరాల్లోకి వెళ్దాం…
Ads
1️⃣ మణిపురి భాష మాట్లాడేవాళ్లు ఎంతమంది? Meitei language (మణిపురి) భాషను ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో మాట్లాడుతారు. భారత్‌లో సుమారు 17.6 లక్షల మంది ఈ భాషను మాతృభాషగా మాట్లాడుతున్నారు. వీరిలో 15 లక్షలకుపైగా మణిపూర్‌లోనే ఉంటారు. అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌లో కూడా కొంతమంది మాట్లాడుతారు. భారత్‌లో ఉన్న 22 షెడ్యూల్డ్ భాషల్లో ఇదీ ఒకటి...
➡️ అంటే 17 లక్షల మందికి మాత్రమే మాతృభాష అయిన భాషలో ఒక మణిపురి సినిమా కోటి వసూలు చేయడం పెద్ద విషయం…
మణిపురి సినిమా చరిత్ర … మణిపురి సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. మొదటి ఫీచర్ ఫిల్మ్: Matamgi Manipur – 1972 … అప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ నెమ్మదిగా పెరిగింది.
ఇప్పటి పరిస్థితి: ఒకప్పుడు ఏడాదికి 30 వరకు సినిమాలు వచ్చేవి. 2023లో మాత్రం కేవలం 8 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అంటే ఇది పెద్ద మార్కెట్ కాదు. చాలా చాలా చిన్న మార్కెట్…
ఈ సినిమాల బడ్జెట్ ఎంతుంటుంది? మణిపురి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్‌లో తీస్తారు. ఉదాహరణకు
Lallasi Pal (2002) అనే సినిమా బడ్జెట్: కేవలం ₹1 లక్ష మాత్రమే… ఇప్పటి సినిమాలు కొంచెం ఎక్కువైనా
సాధారణంగా: ₹20 లక్షల నుంచి ₹40 లక్షల మధ్యలోనే బడ్జెట్ ఉంటుంది…
ఇప్పుడు కోటి వసూలు చేసిన సినిమా … సినిమా పేరు Boong
-
దర్శకురాలు: Lakshmipriya Devi
-
నిర్మాత: Farhan Akhtar
-
భాష: మణిపురి
-
కథ: మణిపూర్‌లో సామాజిక ఉద్రిక్తతల మధ్య ఒక చిన్న బాలుడి జీవితం.
ఈ సినిమా: టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యింది … BAFTA అవార్డు కూడా గెలుచుకుంది … అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది….
కోటి వసూలు ఎందుకు పెద్ద వార్త? ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి.
1️⃣ మార్కెట్ చిన్నది …. 17 లక్షల మంది మాట్లాడే భాష.
2️⃣ థియేటర్లు కూడా తక్కువ …. మణిపూర్‌లో పెద్దగా థియేటర్ కల్చర్ లేదు.
3️⃣ సినిమాలు సాధారణంగా చిన్న బడ్జెట్ … చాలా సినిమాలు కొన్ని లక్షల్లోనే తీస్తారు.
➡️ అందుకే రూ. కోటి వసూలు చేయడం ఈ ఇండస్ట్రీకి పెద్ద మైలురాయి…
రావాలి, ప్రతి భాషలోనూ ఆ ప్రాంత, ఆ భాష జనాన్ని కనెక్టయ్యే కాన్సెప్ట్ సినిమాలు రావాలి… ఎదగాలి… దిక్కుమాలిన ఈ ఫార్ములా, ఎలివేషన్ల చెత్త కొట్టుకుపోవాలి… రావాలి..!!
Share this Article