.
రాహుల్ గాంధీకి సొంత విచక్షణ, వివేచన గట్రా ఏమీ ఉండవని తెలుసు కదా… కుట్ర, 100 సీట్లు నాకు రాకుండా చేశారు, అమిత్ షా దుర్మార్గం, నన్ను కొట్టారు, జుట్టు పట్టి ఈడ్చారు అని మమత మొసలి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇప్పటికీ… సరే, ఆమె ధోరణి తెలుసు కదా, మరి రాహుల్ గాంధీ కూడా దాన్ని సమర్థిస్తూ పోస్ట్ పెట్టడం ఏమిటి..?
బెంగాల్‌లో పాతాళంలోకి తొెక్కింది మమత… రేప్పొద్దున నిజంగానే ఇండి కూటమికి మెజారిటీ వస్తే ప్రధాని పోస్టుకు ప్రధాన పోటీదారు, రాహుల్‌కు ప్రత్యర్థి మమతే… యాంటీ ఇండియన్ ఎలిమెంట్స్ ఎప్పటిలాగే శోకాలు పెడుతున్నారు…
Ads
సర్ అన్నారు, వోట్లు తీసేశారు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుట్రదారు, ఈవీఎంలు హ్యాక్ చేశారు ఎట్సెట్రా పాటలు మళ్లీ మొదలు పెట్టారు… కానీ నిజమేమిటో తెలుసా..? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వోట్లు తీసేయబడ్డాయో అక్కడ ఫలితాలు ఇవీ… మచ్చుకు ఐడియల్ శాంపిల్స్…
బెంగాల్ లో అత్యధికంగా ఓట్లు తొలగించిన టాప్ 10 నియోజక వర్గాలు, గెలిచిన పార్టీ … (తొలగించిన వోట్లు, గెలిచిన పార్టీ)…
1. షంషేర్ గంజ్ : 74775… (తృణమూల్)
2. లంగోల : 55420 ( తృణమూల్ )
3. భాగా బంగోల : 47493 ( తృణమూల్ )
4. రఘనాథ్ గంజ్ : 46100 ( తృణమూల్ )
5. మేటియా బుర్జ్ : 39579 ( తృణమూల్ )
6. ఫరక్కా : 38222 ( కాంగ్రెస్ )
7. సుతి : 37965 ( తృణమూల్ )
8. మొతబారి : 36255 ( తృణమూల్ )
9. జంగిపూర్ : 36581 ( బీజేపీ )
10. రథువా : 35573 ( బీజేపీ )
మొదటి ఐదు నియోజకవర్గాల్లోనూ గెలిచింది టీఎంసీయే… తరువాత కాంగ్రెస్, ఆ తరువాత మళ్లీ రెండు టీఎంసీ… మరి వోట్ల తొలగింపుతో మమతకు జరిగిన నష్టం ఏమిటి..? ఇది రియాలిటీ… కాకపోతే ఇండియాలోనే ఉంటూ యాంటీ ఇండియన్లుగా బతికే వాళ్ల నెరేటివ్స్ ఇవన్నీ… సర్ కాదు, కేంద్ర బలగాలు, ఈవీఎం ట్యాంపరింగు కాదు… ఏదీ లేదు, మమత నిజస్వరూపం జనానికి అర్థమై ఛీకొట్టారు, అది రియాలిటీ…
అవునూ, రాహుల్ భాయ్… నీ కోర్ టీం గుప్పిట్లో నుంచి నువ్వు బయటపడవు గానీ… వాళ్లను ఏ ప్రశ్న అడుగు… బీజేపీకి నిజంగానే అంత చేతనైతే మరి తమిళనాడు, కేరళలో ఎందుకు ఏమీ చేయలేకపోయింది..?
Share this Article