.
33 వేల భిక్షతోనే సినిమా… ఇండియన్ ఇండీ ఫిల్మ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ప్రయత్నం… సినిమా అంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అనేది మనకు అలవాటైన ఆలోచన. భారీ సెట్లు, స్టార్ హీరోలు, భారీ టెక్నాలజీ… ఇవే సినిమా విజయానికి ప్రమాణాలు అనుకుంటాం. కొన్ని సినిమాలైతే వందల కోట్ల ఖర్చు, ఆ పేరుతో ప్రేక్షకుల జేబులు ఖాళీ, టికెట్ రేట్ల పెంపుతో…
కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ కేవలం 33 వేల రూపాయలతో ఒక సినిమా పూర్తయ్యింది. ఇది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
Ads
భిక్షతో కూడిన బడ్జెట్ … ఈ సినిమాను దర్శకుడు తుంబాద్ ఫేమ్ రవి అనిల్ బార్వే అత్యంత తక్కువ ఖర్చుతో తెరకెక్కించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… సినిమా నిర్మాణానికి వచ్చిన డబ్బులో చాలా భాగం భిక్షగా వచ్చిన డబ్బే అని చెబుతున్నాడు…
అంటే, నిజంగానే ప్రజల నుంచి సేకరించిన చిన్న చిన్న సహాయాలతో సినిమా రూపుదిద్దుకుంది. ఆయన కన్నడ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్. పెద్ద నిర్మాతల సహాయం లేకుండా, చిన్న టీమ్‌తో ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఆసక్తి ఉన్న దర్శకుడు…
‘మాయావి’ అనే ప్రయోగాత్మక చిత్రం … ఈ సినిమాకు “మన్ పిశాచ్” అనే పేరు పెట్టారు. సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా, ఇది ఒక ప్రయోగాత్మక (Experimental) చిత్రం. సినిమాలో పనిచేసిన నటులు ఇద్దరే… యానియా భరధ్వాజ్, దీపక్ దామ్లే… ఇది సైకలాజికల్ హారర్… ఫోటోషాప్, ఎఐ బేసిక్ డిజిటల్ టెక్నాలజీని ఫోన్‌లోనే వాడి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేశారుట. చాలా తక్కువ మంది టెక్నీషియన్లు, నో సెట్స్… దీంతో మొత్తం సినిమా బడ్జెట్ కేవలం 33 వేల రూపాయలకే పరిమితమైంది. అదీ ఐఫోన్‌తో చిత్రీకరించారట…
ఒక రోజు షూటింగ్‌తో పూర్తి … ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే… ఈ సినిమాను ఒకే రోజు షూటింగ్‌తో పూర్తి చేశారు. సాధారణంగా ఒక చిన్న సినిమా కూడా షూట్ చేయడానికి రోజులు పడుతుంది. కానీ ఈ సినిమా కోసం దర్శకుడు చాలా ముందుగానే ప్లాన్ చేసి, ఒకే రోజులో షూటింగ్ ముగించారు. శనివారం ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఈ పీరియాడికల్ హారర్ చిత్రానికి…
ఫిల్మ్ ఫెస్టివల్స్ దృష్టిలోకి … ఇంత తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసినా, దీనిని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఎంపికైతే ఇది మరింత పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
ఎందుకు ఇది విశేషం? … ఈ సినిమా ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
-
కేవలం ₹33,000 బడ్జెట్
-
ప్రజల సహాయంతో సేకరించిన డబ్బు
-
ఒకే రోజు షూటింగ్
-
ప్రయోగాత్మక కథనం
-
ఫిల్మ్ ఫెస్టివల్ లక్ష్యం
ఇవి అన్నీ కలిపి చూస్తే… సినిమా అంటే పెద్ద డబ్బు అవసరం అనే భావనను ఈ ప్రయత్నం సవాలు చేస్తోంది. దీన్ని 18న యూట్యూబ్‌లో రిలీజ్ చేయబోతున్నారు…
సినిమా అంటే కల… డబ్బు కాదు …. ఈ కథ ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: సినిమా తీసేందుకు కోట్ల రూపాయలు కాకుండా కల్పన, పట్టుదల, టీమ్ వర్క్ ఉంటే చాలు. అందుకే చాలా మంది సినీ ప్రియులు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారు — “ఇది కేవలం సినిమా కాదు… ఒక ప్యాషన్ కథ…”
Share this Article