Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ఆపదలో పడితే మళ్లీ వస్తా :: చిరంజీవి

July 5, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. చిరంజీవి , కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి సినిమా ఈ ముఠామేస్త్రి . వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 23 సినిమాలు వచ్చాయి . 1993 జనవరిలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది . చిరంజీవి , మీనా కాంబినేషన్లో మొదటి సినిమా . జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెడుతుంది . అలాగే కధంటూ ఉంటే దాని చుట్టూ బిర్రయిన స్క్రీన్ ప్లేని అమరిస్తే సినిమా దానంతట అదే హిట్టవుతుంది .

భూపతిరాజా కధకు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే , డైలాగులు బ్రహ్మాండంగా అమర్చారు . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎక్కడా బోరించకుండా స్పీడ్ స్పీడుగా సాగిపోతుంది . రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్ . కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు . చిరంజీవి సినిమా అనగానే ప్రేక్షకులు ఆశించే పాటలు , ఫైట్లను బ్రహ్మాండంగా ఆవిష్కరించారు .

Ads

ప్రముఖంగా చెప్పవలసింది పరుచూరి బ్రదర్స్ డైలాగులు . చిరంజీవి లెవెల్లో ఉంటాయి . ప్రేక్షకులను ఉత్తేజపరిచే విధంగా వ్రాసారు . చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే సీన్లలో డైలాగులు , చివర్లో తానొచ్చిన పని అయిపోయింది మరలా ప్రజాస్వామ్యం ఎప్పుడయినా ఆపదలో పడినప్పుడు మరలా వస్తా అనే డైలాగులు చిరంజీవి అభిమానుల చేత ఈలలు వేయిస్తాయి .

కూరగాయల మార్కెట్లో ముఠామేస్త్రి గాంధేయవాది అయిన అల్లు రామలింగయ్య శిష్యరికంలో అపర గాంధీలాగా సత్యాగ్రహం చేసి ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో పడి MLA అయి మంత్రి కూడా అయిపోతాడు .
మంత్రిగా నగరంలో మోతుబరి అయిన ఆత్మ పాత్రలో శరత్ సక్సేనా , ఆయన కొడుకు శ్రీహరి ఆగడాలను ఎదిరించి క్లైమాక్సులో వారిద్దరిని చంపేయటంతో సినిమా ముగుస్తుంది .

సినిమాలో కోర్ట్ సీన్ ఒకటి బాగా పేలింది . శ్రీహరిని రక్షిస్తానికి ఎలిబీ సృష్టిస్తాడు శరత్ సక్సేనా . అందులో టైంని నమాజ్ ద్వారా బయటపెట్టి ఉరిశిక్ష వేయించే సీన్ బాగా వచ్చింది . అలా చాలా సీన్లు బాగా పండాయి సినిమాలో .

చిరంజీవికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . అదరగొట్టేసాడు . ఆయన పక్కన హీరోయిన్లుగా మీనా , రోజా గ్లామర్ స్పేసుని అద్భుతంగా ఫిల్ చేయటమే కాకుండా పాటల్లో చిరంజీవికి ధీటుగా డాన్సులు వేసారు . డాన్సుల్ని బ్రహ్మాండంగా కంపోజ్ చేసిన ప్రభుదేవా , సుచిత్రలను ; అంతే గొప్పగా చిత్రీకరించిన కోదండరామిరెడ్డిని తప్పక అభినందించాలి .

సినిమా ఎత్తుకోవటం ఎత్తుకోవటమే సిల్క్ స్మిత , చిరంజీవిల డాన్స్ . ఆ ఊపు ఊపు అలా చివరిదాకా కొనసాగుతుంది . ఓయిరప్పా ఓయిరప్పా ఓయిరప్పా హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిట పెన్నిధి హాల్లో ప్రేక్షకుల్ని కూడా డాన్స్ చేపిస్తాయి . అలాంటిదే మరో పాట అంజనీ పుత్రుడా వీరాధివీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా . మీనా , చిరంజీవిల మీద సాగుతుంది . చిరంజీవి తల్లి పేరు అంజనాదేవి అనేది గమనార్హం .

వీరిద్దరి మీద మరో రెండు పాటలు ఉన్నాయి . ఒకటి చికి చికి చాం చిచాంకు చాం చికుచం పిల్లా పందెం కట్టో అనే పాట . ఇంకొకటి జోరుగున్నాది గులాబి గుంటిది చంటిది ఒంటరిగా అనే పాట . రోజా , చిరంజీవి మీద సాగే రెండు పాటల్లో ఒకటి batman dance . చాలా వెరైటీగా చిత్రీకరించారు కోదండరామిరెడ్డి . ప్రభుదేవాని మరోసారి మెచ్చుకోవాలి .

ఇంకో డ్యూయెట్ ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా . వేటూరి , భువనచంద్రలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర చాలా బాగా పాడారు . ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , అల్లు రామలింగయ్య , శ్రీహరి , శరత్ సక్సేనా , బ్రహ్మానందం , బాబూమోహన్ , జె వి సోమయాజులు , పరుచూరి గోపాలకృష్ణ , ఆలీ , నర్సింగ్ యాదవ్ , మన్సూర్ ఆలీ ఖాన్ , జయలలిత  తదితరులు నటించారు . మా నరసరావుపేట వారు అక్కిరాజు సుందర రామకృష్ణ గవర్నరుగా కాసేపు తళుక్కుమంటారు .

కె సి శేఖర్ రెడ్డి , డి శివప్రసాద్ రెడ్డి నిర్మాతలు . తెలుగులో హిట్టయిన ఈ సినిమా తమిళంలోకి కూడా డబ్ అయింది . చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలింపేర్ , Cinema Express అవార్డులు వచ్చాయి . బహుశా ఈ సినిమా చూడని సినీ ప్రేమికులు ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే చూసేయండి . యూట్యూబులో ఉంది .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!
  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions