.
మేడారం అంటేనే మహా ఉత్సవం కదా… ఆధ్యాత్మిక ఉత్సాహం కదా… జాతరలు, దేవతల ఆరాధనలు అంటేనే ఏనాటి కాలం నుంచో కల్లు, సారా, మాంసంతో పాటు డాన్స్ కూడా…
మంత్రి సీతక్క ఆదివాసీ… మేడారం ఏరియా ప్రజాప్రతినిధి… తనకు సమ్మక్క-సారలమ్మల మీద ఎనలేని భక్తి విశ్వాసం… సో, ఈసారి మొత్తం జాతర అంతా తానై పర్యవేక్షిస్తోంది… బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు, బలగాలతో కూడా డాన్స్ చేసింది…
Ads
(డెస్టినీ… ఏ పోలీసులయితే ఆమె నక్సలైట్లలో ఉన్నప్పుడు వేటాడారో, ఆ పోలీసులే ఆమెకు రక్ష ఇప్పుడు… వాళ్లతో కలిసి ఆమె సహృదయ నృత్యాలు)…
అదుగో, ఆమెతోపాటు డాన్స్ చేసిన ఓ ఖాకీ డ్రెస్ మహిళపై అందరి దృష్టీ నిలిచింది… ఎవరామె..? ఒక్కసారిగా వైరల్ అయిపోయింది… ఆమె వివరాల కోసం సెర్చింగు… హఠాత్తుగా తెలంగాణ జనానికి విభిన్నంగా పరిచయం అయిపోయింది… ప్రశంసలతోనే సుమా… సంప్రదాయాల్ని గౌరవిస్తూ, స్నేహపూర్వక వైఖరితో…
ముందు ఆ డాన్స్ చూడండి ఈ వీడియోలో…
ఆమె పేరు వసుంధర యాదవ్… ఐపీఎస్ అధికారిణి… ఖమ్మం జిల్లా, కల్లూరు ఏసీపీగా చేస్తోంది… బందోబస్తు కోసం మేడారం వచ్చింది… ఎప్పటిలా సీరియస్‌గా లేదు పోలీస్ యంత్రాంగం ఈసారి… సమ్మక్క ఆగమనానికి కాల్పులు జరిపి ఆహ్వానం పలికే దగ్గర నుంచి… ఆహ్లాదం, డాన్సులు… ఓ ఉత్సవం జరుపుకుంటోంది పోలీసు శాఖ కూడా…
వసుంధర యాదవ్ నిజానికి ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారిణి… ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది… ఉత్తరప్రదేశ్ మూలాలే కానీ, భద్రత కారణాల రీత్యా ఆమె స్వస్థలం, కెుటుంబ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు… 2023 లో సర్వీసులో జాయినైంది…

తరువాత ఉత్తరప్రదేశ్‌కే చెందిన అజయ్ యాదవ్‌తో పెళ్లయింది… తను ఐఏఎస్ అధికారి… తనదేమో తెలంగాణ కేడర్… పెళ్లికాగానే ఇంటర్ స్టేట్ కేడర్ ట్రాన్స్‌ఫర్ తీసుకుని తెలంగాణకు వచ్చేసింది… ఇదీ ఆమె నేపథ్యం… ఐఏఎస్, ఐపీఎస్ జంటలు సాధారణమే కదా…
తెలంగాణ కేడర్‌కు వచ్చాక ఆమె కొన్నాళ్లు యాంటీ నక్సల్ విభాగం గ్రేహౌండ్స్ ఏఎస్‌పిగా చేసింది… తరువాత లా అండ్ ఆర్డర్‌కు వచ్చి, కల్లూరు పోస్టింగు తీసుకుంది… భర్త కూడా సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు అదే ఖమ్మం జిల్లాలో…!!

Share this Article