.
కేసీయార్ పాలన ఫలితాల మీద ఈరోజుకూ అదే ఆహా ఓహో ప్రచారం… జాతీయ ఆర్థిక సర్వేలో కూడా భేష్ కేసీయార్ అని చప్పట్లు కొట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరో నివేదికలో మాత్రం మేడిగడ్డ బరాజ్ మీద ‘ప్రమాద హెచ్చరిక’ను జారీ చేసింది…
వివరాల్లోకి వెళ్తే… ఆయన కట్టిన కాళేశ్వరం, ఆయన చేపట్టిన మిషన్ కాకతీయ, ఇతర భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ఫలితంగా తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందట… ఇప్పుడేమంటార్రా బీజేపీ, కాంగ్రెస్ నాయకులూ అని నిన్నంతా సోషల్ మీడియాలో, పింక్ మీడియాలో ఒకటే ప్రచారం…
Ads
బీజేపీ ప్రభుత్వం పెట్టిన రిపోర్టును చూపించి, బీజేపీ వాళ్లనే వెక్కిరిస్తూ భుజాలు చరుచుకోవడం ఇది… అసలు సాగుకు కీలకమైన కౌలు రైతులకు అడుగడుగునా ద్రోహం చేస్తూ… రైతు బీమా, రైతు భరోసా, గిట్టుబాటు ధర ఏదీ ఇవ్వకుండా చేస్తే… ఈ సాగు విస్తీర్ణం ఇంతగా పెరిగిందా..?
అసలు కేసీయార్ పూర్తి చేసిన మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు ఏమిటట..? పూర్తయినట్టు ప్రకటించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా బోలెడు పనులు పెండింగ్, ఈలోపు స్పైన్ కార్డ్ విరిగినట్టు మేడిగడ్డ తస్కింది… పైగా ఆ ప్రాజెక్టుతో అదనపు ఆయకట్టే రాలేదు కదా… సో, ఏం సాధించినా రైతులు తమ సొంత రిస్కుతో సాధించిందే…
అది పక్కన పెడితే… ఇదే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో సమర్పించిన తాజా నివేదిక ఏమని చెబుతున్నదంటే..?
దేశంలోని వేలాది ఆనకట్టల మధ్య మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ అంశం అత్యంత కీలకంగా మారింది… వందేళ్ల పాత ప్రాజెక్టుల కంటే కూడా, కేవలం ఐదేళ్ల క్రితం కట్టిన మేడిగడ్డ పరిస్థితిపై కేంద్రం వ్యక్తం చేసిన ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది…

మేడిగడ్డ…: దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ‘కేటగిరీ-1’ ప్రాజెక్టుగా గుర్తింపు!
కేంద్ర జలశక్తి శాఖ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం… దేశంలోని ఆనకట్టల భద్రతను విశ్లేషించినప్పుడు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది….
1. ‘కేటగిరీ-1’ అంటే ఏమిటి?
ఆనకట్టల పరిస్థితిని బట్టి కేంద్రం వాటిని మూడు రకాలుగా విభజిస్తుంది…
-
కేటగిరీ-3….: చిన్న చిన్న మరమ్మతులు అవసరమైనవి….
-
కేటగిరీ-2….: వెంటనే పెద్ద ఎత్తున రిపేర్లు చేయాల్సినవి….
-
కేటగిరీ-1….: అత్యంత తీవ్రమైన లోపాలు ఉండి, కూలిపోయే ముప్పు (Risk of Failure) ఉన్నవి…. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాజెక్టులు మాత్రమే ఈ ‘అత్యంత ప్రమాదకర’ జాబితాలో ఉన్నాయి…. అందులో తెలంగాణలోని మేడిగడ్డ ఒకటి కాగా, మిగిలిన రెండు ఉత్తరప్రదేశ్ (లోయర్ ఖజూరీ), జార్ఖండ్ (బొకారో) రాష్ట్రాల్లో ఉన్నాయి….

2. కేంద్రం వ్యక్తం చేసిన ప్రధాన ఆందోళనలు….
-
పునాదుల వైఫల్యం…: మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడం అనేది కేవలం పైన కనిపించే సమస్య కాదని, పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి (Sand Piping) భారీ గ్యాప్‌లు ఏర్పడ్డాయని నివేదిక స్పష్టం చేసింది….
-
పునర్నిర్మాణమే మార్గం…: కుంగిన 7వ బ్లాక్‌ను బాగు చేయడం సాధ్యం కాకపోవచ్చని, దానిని పూర్తిగా తొలగించి మళ్లీ కట్టడమే (Reconstruction) సురక్షితమైన మార్గమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచించింది….
-
మొత్తం ప్రాజెక్టుకే ముప్పు…: కేవలం 7వ బ్లాక్ మాత్రమే కాదు, బ్యారేజీలోని మిగిలిన బ్లాకుల కింద కూడా ఇలాంటి లోపాలు ఉండవచ్చని కేంద్రం హెచ్చరించింది…. సమగ్రమైన పరీక్షలు నిర్వహించే వరకు ఇందులో నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది….

3. నిధుల విషయంలో స్పష్టత:
-
కేంద్రం అమలు చేస్తున్న ‘డ్రిప్’ (DRIP) పథకం కింద తెలంగాణలోని ఆనకట్టల మరమ్మతుల కోసం ₹100 కోట్లు కేటాయించారు… (ఇది మేడిగడ్డ రిపేర్లలో నాలుగు తట్టల మట్టికీ సరిపోదు…)
-
అయితే, 2025 డిసెంబర్ 31 నాటికి ఈ నిధులలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని (Zero Expenditure) నివేదిక వెల్లడించింది… దీనివల్ల భద్రతా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది….
4. ఇతర ప్రాజెక్టుల కంటే ఎందుకు భిన్నం?
మన దేశంలో 50 ఏళ్లు పైబడినవి 1,600 పైగా, 100 ఏళ్లు పైబడినవి 200 పైగా ఆనకట్టలు ఉన్నాయి… అవి వయస్సు రీత్యా బలహీనపడటం సహజం… కానీ మేడిగడ్డ వంటి ఆధునిక కాలంలో, భారీ నిధులతో కట్టిన ప్రాజెక్టు ఇంత త్వరగా 'ప్రమాదకర' జాబితాలోకి చేరడం పట్ల కేంద్రం తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తోంది...
Share this Article