.
మన సినిమాలు, మన సాహిత్యం, మన టీవీలు… పిల్లల్ని ప్రేమ అనే ఆకర్షణల్లోకి తోసేయడానికి, మరీ స్కూల్ పిల్లల్ని సైతం ఈ ధోరణి దెబ్బతీస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం కదా… టీన్స్‌లో అసలు మానసిక పరిణతి ఏముంటుందని..? జీవితం మీద స్పష్టమైన లక్ష్యం ఏముంటుందని..? నిర్ణయాల్లో వివేచన ఎక్కడ ఉంటుందని..?
తల్లిదండ్రులు చెడబుట్టిన సంతానమని ఏడుస్తూ వదిలేయడం… కొందరు ఆవేశపరులు ఏకంగా సొంత పిల్లల్నే హతమార్చాడం దాకా సొసైటీలో ఈ కాలుష్యం బాపతు నష్టం అంతా ఇంతా కాదు… మీకు కుంభమేళాల్లో పూసలమ్మి హఠాత్తుగా పాపులరైన మోనాలిసా అనబడే ఓ పిల్లి కళ్ల పిల్ల తెలుసు కదా… అసలు పేరు భాగ్యశ్రీ…
Ads
వివరాల్లోకి వెళ్తే…. మధ్యప్రదేశ్ రాష్ట్రం, మహేశ్వర్‌కు చెందిన మోనాలిసా, గత ఏడాది కుంభమేళాలో దిగిన ఒక ఫోటోతో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది,,. ఆ అందం, అమాయకత్వం నెటిజన్లను కట్టిపడేయడంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది… ఇదే క్రమంలో ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి…
కొంతకాలం క్రితం మోనాలిసా, ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది… అయితే, ఈ వివాహాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు… ఇది ‘లవ్ జిహాద్’ అంటూ వారు ఆరోపణలు చేశారు… ఈ వివాదం చివరకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) వరకు వెళ్ళింది…
వయస్సు నిర్ధారణ – అసలు ట్విస్ట్ ఇక్కడే! … ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆమె వయస్సుపై ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి…
-
మైనర్ అని తేలింది…: విచారణలో మోనాలిసా ఇంకా మైనర్ అని, పెళ్లి నాటికి ఆమె వయస్సు 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని తేలింది…
-
పోక్సో కేసు…: మైనర్‌ను పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త ఫర్హాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది…
కేరళ లింక్, పరిచయం వెనుక మాయ? …. అసలు మధ్యప్రదేశ్‌కు చెందిన ఈమెకు, కేరళకు చెందిన వ్యక్తితో పరిచయం ఎలా ఏర్పడింది అనేది ఆసక్తికరంగా మారింది…
-
సోషల్ మీడియా ప్రభావం…: సినిమా అవకాశాలు, సోషల్ మీడియాలో వచ్చే విపరీతమైన గుర్తింపు ఆమెను గ్లామర్ ప్రపంచం వైపు ఆకర్షించేలా చేశాయి…. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది…
-
పరిణతి లోపం…: అనుకోకుండా వచ్చిన పాపులారిటీ, డబ్బు, సినిమా ఛాన్సులు ఆమె ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయని, సరైన పరిణతి లేని వయస్సులో తీసుకున్న నిర్ణయాలే ఆమెను ఈ స్థితికి చేర్చాయని స్థానికులు, కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు…
ప్రస్తుతం ఈ కేసు పోలీసుల విచారణలో ఉంది…. ఆ పాపులారిటీ ఆమె జీవితానికి కొత్త వెలుగునిస్తుందని అందరూ భావిస్తే, అది ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేసింది… నిజానికి ఈ మొత్తం కథలో దోషి మోనాలిసాయే… ఆమె బరితెగింపు…
ఫర్హాన్ ఖాన్ వంటి వ్యక్తులు సమాజంలో కోకొల్లలు… కానీ స్కూల్ చదువు కూడా పూర్తిచేయని ఆమె… సోషల్ మీడియా ప్రభావంలో… అజ్ఞానంతో కుటుంబం చెబుతున్నా వినకుండా ‘లేచిపోవడం’ ఖచ్చితంగా ఆమెదే తప్పు… అతని మీద పోక్సో కేసు కరెక్టే… కానీ ఈమెకూ ఓ శిక్ష అవసరం యువరానర్..?!
Share this Article