Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కులవివక్ష..! యూజీసీకి సుప్రీంకోర్టు అక్షింతలు ఎందుకో తెలుసా..?

January 31, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. కొరివితో తల గోక్కోవడం అంటే ఏమిటీ? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( UGC ) చాలా చక్కగా చెప్పింది …విద్యార్థులతో, విద్యార్థుల కోసం, విద్యార్థుల చేత తన్నించుకోవడం అని!

UGC తెచ్చిన సంస్కరణలు ఎలా ఉన్నాయి అంటే మంటలని ఎలా ఆర్పాలి అని ప్రదర్శన ఏర్పాటు చేసి, మంట పెట్టి, దానిని ఆర్పేయడానికి చేసిన ప్రయత్నంలో అందరికి అంటించి, దానిని ఎలా ఆర్పాలో తెలియక దిక్కులు చూడడం!

Ads

UGC EQUITY REGULATIONS 2026… యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెచ్చిన సంస్కరణలు విశ్వవిద్యాలయాలలో ‘ కుల వివక్ష’ ని నిర్మూలించడానికి బదులు మరింత ప్రజ్వారింపచేసే విధంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు!
ఢిల్లీలో అయితే ఏకంగా UGC హెడ్ ఆఫీస్ ముందు నిరసనలకి దిగారు!

నిరసనలకి దిగిన విద్యార్థులు ABVP కి చెందిన వారిలా కాషాయ కండువాలు మెడలో వేసుకొని మోడీ, అమిత్ షా బ్యానర్ల మీద నల్ల రంగు వేసి నినాదాలు చేశారు!
అసలు హఠాత్తుగా ఎందుకు ఈ సమస్య పుట్టుకొిచ్చింది?
ఇది హఠాత్తుగా పుట్టుకొచ్చిన సమస్య కాదు!

2016 లో రోహిత్ వేముల, 2019లో పాయల్ తద్వి ( Payal Tadvi) అనే ఇద్దరు విద్యార్థుల మరణాలు కుల వివక్ష వల్లనే సంభవించాయి అని కోర్టులో పిటిషన్లు వేశారు.
ఆగస్ట్ 2019 లో రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, పాయల్ తద్వి తల్లి అబేదా సలీమ్ తద్వి లు కలిసి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( Public Interest Petition – PIL ) ని వేశారు. ఇద్దరి ఆరోపణ ఒకటే…విశ్వవిద్యాలయాలలో ‘ కుల వివక్ష ‘ వల్లనే రోహిత్, పాయల్ అనే విద్యార్థులు మరణించారు అని.

ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ పిటిషన్లు వేసింది సీనియర్ అడ్వకెట్ అయిన ఇందిరా జై సింగ్, దిశా వాడేకర్, ప్రసన్న…
అఫ్కోర్స్! రోహిత్ వేముల దళితుడు (?) కాబట్టి వివక్షని ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నాడని ఆఘమేఘాల మీద ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి షో చేసాడు రాహుల్ !

  • రాధిక వేముల, అబేదా సలీమ్ తద్వి తమ PIL లో సుప్రీమ్ కోర్టుని అభ్యర్థించింది కేవలం అప్పటికే అమలులో ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( ప్రమోషన్ అఫ్ ఈక్విటి ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ) రెగ్యులేషన్స్ 2012 కి సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేసేట్లుగా UGC ని, కేంద్ర విద్యాశాఖ కి ఆదేశాలు ఇవ్వమని మాత్రమే!

పిటిషనర్లు 2012 రెగ్యులేషన్స్ ని ఉన్నది ఉన్నట్లుగా కఠినంగా అమలు అయేట్లుగా ఆదేశాలు ఇవ్వమని మాత్రమే అభ్యర్థించారు!
2019 లో సుప్రీం కోర్టు నేరుగా UGC కి కుల వివక్షని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తూ విశ్వవిద్యాలయాలలో కుల వివక్షని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపమని కేంద్ర విద్యాశాఖకి నోటీసులు ఇచ్చింది!
అసలుకే UGC 2012 రెగ్యులేషన్స్ ని మార్చమని కాదు! ఆలా మార్చమని పిటిషనర్లు కోర్టుని అడగలేదు కూడా…!

******************
ఫిబ్రవరి, 2025 న కేంద్ర విద్యాశాఖ కుల వివక్షని అంతమందించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో తెలియచేస్తూ ఒక డ్రాఫ్ట్ సుప్రీం కోర్టు ముందుంచింది. అదే సమయంలో డ్రాఫ్ట్ లోని అంశాలు లేదా రెగ్యులేషన్స్ విషయంలో అభ్యంతరాలు తెలపమని విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉంచింది! కావాలనుకుంటే డ్రాఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకునే సదుపాయం కల్పించింది!

కేంద్ర విద్యా శాఖ ఇచ్చిన డ్రాఫ్ట్ ని సుప్రీం కోర్టు పిల్ వేసిన అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ముందు ఉంచి ఆమోద యోగ్యమేనా అని అడిగింది!
2025 ప్రమోషన్ అఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (HEIs) లో ఏముంది?
2012 లో రూపొందించిన రెగ్యులేషన్స్ ని సమూలంగా మార్పులు చేసి కొత్తగా రూల్స్ ని రూపొందించారు!
మార్పులు చేస్తే చేశారు కానీ సమానత్వాన్ని విస్మరిస్తున్నది కొత్త డ్రాఫ్ట్ అని విద్యార్థి సంఘాల ఆరోపణ!

ప్రజల దగ్గర నుండి వచ్చిన సూచనలు సలహాలని పరిగణనలోకి తీసుకొని యూజీసీ కొత్త డ్రాఫ్ట్ రూపొందించి సుప్రీం కోర్టు ముందు ఉంచింది ఆగస్టు 2025 లో!
అయితే పిల్ వేసిన సీనియర్ అడ్వకెట్ ఇందిరా జైసింగ్ కొత్త డ్రాఫ్ట్ లో మొత్తం 10 రూల్స్ కి మార్పులు చేయాలని పట్టుపట్టింది!

చివరికి జనవరి 13, 2026 న కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( ప్రమోషన్ అఫ్ ఈక్విటి ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్) రెగ్యులేషన్స్ 2026 ని నోటిఫై చేసింది!
నోటిఫై అయిన తరువాత విద్యార్థులు ఆందోళనకి దిగారు!

జనరల్ కేటగిరి లేదా రిజర్వేషన్ సౌకర్యం లేని కులాల వాళ్ళు ఆందోళనకి దిగారు!
కేవలం SC/ST, OBC, అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే రక్షణ కల్పిస్తూ, జనరల్ కేటగిరి కిందకి వచ్చే కులాలకి రక్షణ కల్పించని విధంగా రెగ్యులేషన్స్ లో మార్పులు చేశారని ఆరోపిస్తున్నారు!

పిల్ వేసిన ఇందిరా జైసింగ్ సూచించిన 10 సవరణలు కుల వివక్ష లేకుండా చేయడం అటుంచి విద్యార్థులని కులాల వారీగా విభజించే విధంగా కొత్త రెగ్యులేషన్స్ ఉన్నాయని వాటిని కేంద్ర విద్య శాఖ ఆమోదించి నోటిఫై చేయడం అనేది అన్యాయం అని వాదిస్తున్నారు!

యూజీసీ

2026 కొత్త రెగ్యులేషన్స్ లో ఏమున్నాయి? అది ఎలా పనిచేస్తుంది?
పలు అంచెలుగా కులదూషణ నిర్మూలన చేయడానికి మెకానిజం ఉంటుంది.
1.వివక్ష అనేది మతం, కులం, జాతి, పుట్టిన ప్రాంతం, లింగ భేదం, అంగవైకల్యం ఆధారంగా ఉండకూడదు.
2.యూజీసీ పరిధిలోకి వచ్చే అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు రెగ్యులేషన్స్ విధిగా అమలు చేయాలి. ఒక వేళ రెగ్యులేషన్స్ అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే యూజీసీ గుర్తింపు రద్దు చేస్తుంది!

3. ప్రతి ఉన్నత విద్యాసంస్థ ఈక్విటి కమిటీలని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో విద్యార్థులు SC/ ST, OBC, అధ్యాపకులు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది నుండి ఒకరు, ఆ సంస్థకి అధిపతి అయిన ప్రిన్సిపాల్, మేనేజింగ్ కమిటీ నుండి ఒకరు కలిపి మొత్తం 10 మంది సభ్యులతో ఈక్విటి కమిటీ ఏర్పాటు చేయాలి. జెనరల్ కేటగిరి నుండి ఎవరూ ఉండనక్కరలేదు.

4. కులవివక్ష లేకుండా చూడడానికి ఈక్వల్ కమిటీ రెగ్యులర్ విద్యార్థులతో పాటు డిస్టెన్స్ లర్నింగ్ విద్యార్థులకి కూడా రక్షణ కల్పించాలి.
5.ఈక్వల్ కమిటీ విద్యార్థులు ఏ కులానికి చెందినవారో గోప్యంగా ఉంచాలి! ఇది రెగ్యులర్, డిస్టెన్స్ లర్నింగ్ విద్యార్థులకి వర్తిస్తుంది.

6. ఈక్వల్ అపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేసి దానికి ఒక కో- ఆర్డినేటర్ ని నియమించాలి. కో- ఆర్డినేటర్ విద్యార్థులతో పాటు ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారి, జిల్లా యంత్రాంగం, ఆ ప్రాంతంలో కుల వివక్ష నిర్మూలించే పనిలో ఉండే NGO లు ఉంటే వాటితో నిత్యం సంబంధాలని కలిగి ఉండాలి.

6. కో- ఆర్డినేటర్ నిత్యం కళాశాల లేదా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులు ఎవరైనా కులవివక్షకి గురైనట్లు తెలుసుకుంటే ఆ విషయం ఈక్వల్ కమిటీకి తెలియచేయాలి. ఒకవేళ కులం పేరుతో దూషించినట్లుగా సాక్ష్యాధారాలు దొరికితే ఆ ప్రాంత పోలీసు అధికారికి తెలియచేయాలి. SC/ ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంలో ఈక్వల్ కమిటీ సహకరిస్తుంది!

7. ఇవి కాకుండా ప్రతి HEI లో ఒక ఈక్వల్ స్క్వాడ్, అంబాసిడర్ ని నియమించాలి. వీళ్ళు నోడల్ ఆఫీసర్ పాత్రని పోషిస్తారు. ఈక్వల్ స్క్వాడ్ లైబ్రరీ, కాంటీన్,హాస్టల్స్, ఖాళీ సమయాలలో విద్యార్థులు ఎక్కడైతే గుమికూడుతారో అక్కడ తిరుగుతూ గమనిస్తూ ఉండాలి!

8. ఈక్విటి హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ అందరికి కనపడేలా ఉంచాలి. ఒకవేళ ఎవరైనా కుల వివక్షకి గురైతే వెంటనే హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
9. కుల వివక్షకి గురయిన వ్యక్తి ఫిర్యాదు చేసిన 15 రోజులలోపు యాజమాన్యం తగిన చర్య తీసుకోవాలి. ఒకవేళ రెగ్యులేషన్స్ లో పేర్కొన్న ఏ ఒక్క నిబంధనని పాటించకపోయినా యూజీసీ గుర్తింపుని రద్దు చేస్తుంది.
10. ఫిర్యాదు కాపీని నిందితుడికి ఇవ్వాలి, అలాగే ఫిర్యాదు చేసిన విద్యార్థికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే!

*************
ఇవేకాక ఇంకా పలు నిబంధనలని పొందుపరిచింది యూజీసీ!
విద్యార్థుల ఆందోళనకి కారణం ఏమిటంటే….

  • 2012 యూజీసీ రెగ్యులేషన్స్ లో ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే ఆ విద్యార్థి మీద చర్యలు తీసుకోవాలి అనే క్లాజ్ ఉంది 2026 రెగ్యులేషన్స్ లో ఆ క్లాజ్ ని తీసివేశారు!
  • 2012 రెగ్యులేషన్స్ లో కేవలం SC/ ST ల మీద ఎవరైనా కుల వివక్ష చూపిస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి. 2026 రెగ్యులేషన్స్ లో SC/ST లతో పాటు OBC లని కూడా చేర్చారు.
  • 2012 రెగ్యులేషన్స్ లో విద్యార్థి కుల వివక్షకి గురైతే కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి అని ఉంది! 2026 రెగ్యులేషన్స్ లో విద్యా సంస్థకి యూజీసీ నిధులు నిలిపివేయడమో లేదా ఏకంగా గుర్తింపు రద్దు చేయడమో జరుగుతుంది!

 

  • జనరల్ కేటగిరి కిందకి వచ్చే సో కాల్డ్ అగ్రకులాలకి ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు!
    విద్యాలయాలు మత పరంగా, జాతి పరంగా, కులపరంగా సమానత్వాన్ని చూపించాలి అనడంలో అభ్యంతరాలు ఉండవు!
    సమానత్వం పేరుతో SC/ ST, OBC లని ఒకవైపు జనరల్ కేటగిరి కిందకు వచ్చే అగ్రకులాలని మరొక వైపు ఉంచి నిబంధనలని రూపొందించడం అవివేకం!



భారత దేశ విద్యా వ్యవస్థని నడిపించే విద్యా శాఖ మేధావులకి నిబంధనలు రూపొందించే సమయంలో చట్టాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తెలియదా?
SC/ST అట్రాసిటీ కేసుల విషయంలో చట్టం దుర్వినియోగం అవుతున్నది అనే కదా సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలని నిర్దేశించింది?
SC/ST అట్రాసిటీ కేసుల విషయంలో ఫిర్యాదులు వస్తే అవి క్లోజ్‌డ్ డోర్స్ అంటే ఆఫీస్ లేదా ఇళ్లల్లో కులం పేరుతో దూషించినట్లు కనుక ఫిర్యాదు చేస్తే వాటి మీద సమగ్ర దర్యాప్తు చేసిన తరువాతే కేసు రిజిస్టర్ చేయాలి తప్పితే వెంటనే చేయవద్దని చెప్పింది సుప్రీం కోర్టు!

బహిరంగ ప్రదేశాలలో కనుక కుల దూషణకి పాల్పడితే అక్కడ ప్రాధమిక సాక్ష్యాలు దొరుకుతాయి కాబట్టి కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది!
గృహ హింస, వరకట్న వేధింపుల కేసుల విషయంలో కూడా 498A సెక్షన్ దుర్వినియోగం అయ్యింది!
498A కేసుల విషయంలో కూడా చట్టాన్నివ దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలని విడుదల చేసింది.

గతంలో ఎవరైనా కోడలు అదనపు కట్నం కోసం తనని భర్త, అత్త మామలు, ఆడపడుచులు, మరుదుల మీద ఫిర్యాదు చేస్తే ముందు భర్తని అరెస్ట్ చేసి, తరువాత సదరు భర్త తల్లితండ్రులని అరెస్ట్ చేయకుండా ఉండడానికి బేరసారాలు జరిగి లక్షల్లో డబ్బు చేతులు మారేవి!

498A కేసుల విషయంలో సుప్రీం కోర్ట్ మార్గదర్శక సూత్రాలని జారీ చేసింది…భార్య 498A సెక్షన్ కింద ఫిర్యాదు చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కి పంపడానికి వీలులేదు. సదరు ఇన్వెస్టిగెషన్ అధికారి విచారణ చేసి ప్రాధమిక ఆధారాలు లభించిన తరువాతే అరెస్ట్ చేయాలి. సుప్రీం కోర్ట్ మార్గదర్శక సూత్రాలు ఇచ్చిన తరువాత 498A కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి!

So! ఎంత కఠినమమైన చట్టాలు చేసినా వాటిని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు!
యూజీసీ రూపొందించిన 2026 రెగ్యులేషన్స్ అనేవి అతి జాగ్రత్తకి పోయి రూపొందించారు తప్పితే అవి తూచా తప్పక పాటించే పరిస్థితులు ఏ ఉన్నత విద్యా సంస్థలో కూడా ఉండవు.



ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ఈక్విటి కమిటీలు, కో ఆర్డినేటర్స్, స్క్వాడ్స్ ని ఏర్పాటు చేయాలంటే అదనపు నిధులు అవసరం! నిధులు సమకూర్చుకోవాలంటే విద్యార్థుల దగ్గర వసూలు చేయాలి, కానీ అది మరో వివాదానికి దారి తీస్తుంది!

లైబ్రరీలో పని చేసేవాళ్ళని, నాన్ టీచింగ్ స్టాఫ్ లో కొంతమందిని, ఒకరిద్దరు లెక్చరర్స్ ని ఈక్విటి కమిటీ, స్క్వాడ్స్, కో ఆర్డినేటర్స్ గా నియమిస్తారు. వెరసి యూజీసీ రెగ్యులేషన్స్ అమలు అయినట్లుగా మమ అనిపిస్తారు!

ఇక్కడ మరో కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది… అది ఈక్విటి కమిటీలో ఉండేవాళ్ళు, కో ఆర్డినేటర్స్, స్క్వాడ్స్ లో ఉండే వాళ్ళు ఒక కొత్త పవర్ సెంటర్ గా తయారవుతారు. కుల వివక్ష ఫిర్యాదులకంటే వీళ్ళ మీదనే ఫిర్యాదులు వచ్చే అవకాశమ్ ఉంది.


కేంద్ర విద్యాశాఖ కప్పదాటు వైఖరి!
ఒకటికి రెండుసార్లు రెగ్యులేషన్స్ రూపొందించడం వాటిని సుప్రీం కోర్టు ముందు ఉంచడం, సుప్రీం కోర్టు లెఫ్టిస్ట్ అడ్వకెట్ ఇందిరా జైసింగ్ ముందు ఉంచి ఈ రెగ్యులేషన్స్ మీకు సమ్మతమేనా అని అడగడం, ఆవిడ సవరణలు చెప్పడం…. ఇలా జరుగుతూ వచ్చింది 2019 నుండి 2025 వరకూ!

ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అని ‘ కాళిదాసు కవిత్వం కొంత, కవి గారి పైత్యం కొంత’ అన్న చందాన ఇందిరా జైసింగ్ అడిగిన 10 సవరణలని యధాతథంగా తీసుకొని, మరి కొంచెం విద్యాశాఖ పైత్యాన్ని జోడించి 2026 యూజీసీ రెగ్యులేషన్స్ పేరుతో నోటిఫై చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వివరణ ఇస్తూ గత అయిదేళ్లలో కుల వివక్ష కేసులు గణనీయంగా పెరగడంతో తాము కఠిన నిబంధనలని రూపొందించాల్సి వచ్చిందన్నారు!
Well…. కఠిన నిబంధనలు రూపొందించారు అభినందనలు!

మరి ఈక్వటి కమిటీలలో SC/ST, OBC, EWS వారికీ ప్రాతినిధ్యం ఇచ్చి జనరల్ కేటగిరిలకి చోటు లేకుండా చేయడం సమానత్వం ఎలా అవుతుంది?
తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కనీస జరిమానా కూడా వేయకుండా వదిలేయడం సమానత్వం ఎలా అవుతుంది?

ఒరేయ్ బాపనోడా అంటే వివక్ష కాదా?
నీ కోమటి….. అంటూ తిట్టడం వివక్ష కాదా?
రెడ్డి, కమ్మ, కులాలని తిట్టడం వివక్ష కాదా?
ఇలా తిడతారా అని సందేహం వద్దు. తిడతారు!
అందుకే విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు!
చివరికి సుప్రీం కోర్టు తలుపు తట్టారు!

సుప్రీం కోర్టు కేంద్ర విద్యాశాఖ, యూజీసీ రెగ్యులేషన్స్ 2026 లో వివక్ష ఉందని గుర్తించి 2026 రెగ్యులేషన్స్  అమలు కాకుండా స్టే ఇచ్చింది.
అసలు SC/ST అట్రాసిటీ కేసుల్లో శిక్ష పడ్డవి 1% కంటే తక్కువే! మిగతావన్నీ ఫాల్స్ కేసులే!
2019 లో ఇందిరా జైసింగ్ ప్రజా ప్రయోజన పిటిషన్ వేసినప్పుడే అనుకున్నాను…. ఎప్పుడో ఒకప్పుడు దేశంలోని విద్యాసంస్థలలో చదివే విద్యార్థుల మధ్య విభజన సృష్టించి ఆరాచకం సృష్టిస్తుంది అని! అది నిజమయ్యింది!

మన దేశంలో న్యాయవిద్య అభ్యసించకుండా హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలకి వెళ్లి న్యాయవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి భారత్ కి వచ్చి విచిత్రమైన వాదనలు చేసేది విభజించడానికే!
“పాకిస్థాన్ మా నాన్నని హత్య చేయలేదు, బుల్లెట్ మా నాన్నని హత్యచేసింది”
“ ఆడవాళ్ళే పిల్లలని ఎందుకు కనాలి? మగవాళ్ళు ఎందుకు కనకూడదు ”
“ అసలు ఆడపిల్లకి స్వంత ఇల్లే ఉండదు తెలుసా ” అంటూ ఒక విచిత్రమైన ఎక్సప్రెషన్ ఇస్తూ మాట్లాడడం ఒక కళ!

ఇలాంటి పద సంపద హార్వర్డ్ నుండి దిగుమతి అయ్యి భాష మార్చుకుని చిచ్చు పెడుతున్నాయి!
హార్వార్డ్ యూనివర్సిటీ లాంటి వాటికి 45% కి పైగా విరాళాల రూపంలో నిధులు ఇస్తున్నది గల్ఫ్ దేశాలు అన్న సంగతిని మరువవద్దు!

***************
సంజయ్ దీక్షత్, విష్ణు జైన్, రాహుల్ దివాన్ యూజీసీ రెగ్యులేషన్స్ 2026 ని తమ వాదనల ద్వారా ఈక్వటి కాదు, వివక్ష పెంచేదిలా ఉన్నాయి నిబంధనలు అంటూ ప్రాధమిక సాక్ష్యాలు చూపించిన తరువాతే సుప్రీం కోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది.

బీజేపీకి ఎప్పుడూ పార్టీకి సంబంధం లేనివాళ్ళ వల్లనే లబ్ది చేకూరుతున్నది! సంజయ్ దీక్షిత్, విష్ణు జైన్, రాహుల్ దివాన్ గార్లకి అభినందనలు! షరా మామూలుగా బీజేపీ IT విభాగం మొద్దు నిద్రలో ఉండిపోయింది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బహుపరాక్..! అత్యంత చంచలంగా వెండి- బంగారం ధరలు…!!
  • టేబుల్ టాప్ రన్ వే..! అజిత్ పవార్ ప్రమాదంతో మళ్లీ చర్చల్లోకి..!!
  • గాంధీ టాక్స్..! మాటల్లేనితనానికి రెహమాన్ సంగీతంతో భర్తీ…!
  • కులవివక్ష..! యూజీసీకి సుప్రీంకోర్టు అక్షింతలు ఎందుకో తెలుసా..?
  • ఓం శాంతి శాంతి శాంతి – మలయాళం రీమేక్‌కు దర్శకుడి తడబాటు..!
  • ఓ శాపగ్రస్త… ఆమె బతుకంతా బాధలే… గాయాలే… మళ్లీ తాజాగా మరో చేదు…
  • తిరుమలలో ఆ రోజులే వేరు… ఆశీస్సులు, బుట్టల నిండా ప్రసాదాలు…
  • త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్ట్రాలు ఏమంటున్నాయి..?
  • బీఆర్ఎస్, వైసీపీ… ఎక్కడేసిన గొంగళి అక్కడే… MOTN సర్వే…
  • లడ్డూ నెయ్యిపై అంతా మాయ..! క్షుద్ర రాజకీయం ఆడించే ఆట..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions