Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే, ఆమె నవ్వింది… కానీ ఆ నవ్వు నాణేనికి మరోకోణం ఇదుగో…

May 26, 2026 by M S R

.

Priyadarshini Krishna ….కోయంబత్తూర్ లో సుల్లూర్ ప్రాంతానికి చెందిన పదేళ్ళ బాలిక అత్యాచారం హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన తమిళనాడు పోలీసులు. కానీ ఆ విషయం వార్త అవ్వలేదు… పక్క దారిపట్టి మరొక అంశం వైరల్ అయింది …. IG రమ్య భారతి ఆధ్వర్యంలో May 23 pressmeet పెట్టి ఈ కేసును ఎలా పరిష్కరించారు, నిందితులు ఎవరు, ఎలా పట్టుకున్నారు వంటి అంశాలు వివరించారు.

ఐతే…. ఈ అంశానికి సంబంధించిన ఒక వీడియోలో IG రమ్య భారతి… తనతో పాటుగా తన సహచర పురుష ఆఫీసర్లు అయిన మరొక ఇద్దరితో కలిసి ఆమె కడుపుబ్బా నవ్వుతూ ఛలోక్తులు వేసుకుంటున్న వీడియో ఇప్పటికే నెట్లో చక్కర్లు కొట్టింది.

Ads

ఇంతే హృదయవిదారకమైన కేసు, సెన్సిటివ్ ఇష్యూ ని ప్రెస్ ద్వారా ప్రజలకు వివరించేప్పుడు ఉండాల్సిన భావోద్వేగాలకు బదులుగా ఆమె హ్యాపీగా జాలీగా విరగబడి నవ్వుతూ వుండటం దేశంలోని అనేక మంది నెటిజన్లకు మింగుడు పడలేదు. 23వ తేదీ రాత్రికల్లా ఆమె పగలబడి నవ్వుతున్న వీడియో క్లిప్ వైరల్ చేసి, empathy sympathy సానుభూతి ఏమాత్రం లేని మహిళ పోలీస్ ను విధుల నుండి తొలిగించండి అంటూ జనాలు నినదించారు ….

ఈ వార్త కాస్త కొత్తగా కుర్చీలో కూర్చున్న CM విజయ్ కి చేరిందట, వెనువెంటనే ఆ ముగ్గురు అధికారులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచెయ్యబడ్డాయి. ఇంతవరకు అందరికీ తెలిసిన కథే….!

ఐతే, ఆరోజు ప్రెస్మీట్ మొదలవ్వడానికి ముందు ఏం జరిగింది ….
నిజానికి ప్రెస్మీట్ జరగబోయే ముందు మైక్స్ , కెమెరాస్ సెట్ చేయడానికి ముందు కొంత సమయం ఉంటుంది, అందరూ రిపోర్టర్స్ రావడానికి వుండే gap లో ప్రెస్మీట్ పెట్టడానికి వచ్చిన అధికారులు గానీ hosts గానీ తమకి తెలిసిన రిపోర్టర్స్ తో పిచ్చాపాటి మాట్లాడటం పరిపాటి… కొన్నిసార్లు పోలీసులు off-the-record వేరే కేసుకి సంబంధించిన విషయాలు మాటాడటం కూడా పరిపాటి.

ఇక్కడ ఈ press-meet లో కూడా అలాంటిదే జరిగింది . మామూలుగా ఐతే అన్ని సెట్ అయ్యాక అందరూ వచ్చాక సదరు ఆఫీసర్స్ రావడం, ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. విజ్ఞత కలిగిన రిపోర్టర్స్ లేదా కెమెరాపర్సన్ అలాంటి టైంలో కెమెరా ON చెయ్యకుండా రికార్డ్ చెయ్యకుండా వుంటారు.

అఫీసియల్ ప్రెస్-మీట్ ని మాత్రమే కవరేజ్ చేస్తారు. దురదృష్టమో యాదృచ్ఛికమో గానీ కోయంబత్తూర్ ప్రెస్ మీట్ కంటే ముందుగానే అధికారులు రావడం, కెమెరాలు సెట్ అయ్యేలోపు వారు కూర్చోవడం, IG రమ్య ఇతర ఆఫీసర్లు పిచ్చాపాటి మాట్లాడుకోవడం, దానిని యూట్యూబ్ కెమెరామెన్ రికార్డ్ చెయ్యడం, దొరికింది రా కంటెంట్ అని రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి పోస్ట్ చెయ్యడం అదికాస్తా వైరల్ అయిపోవడం జరిగింది.

నిజానికి IG రమ్య ఆ ప్రెస్ మీట్ ని చాలా హూందాగా, ప్రొఫెషనల్ గా ప్రెజంట్ చేశారు… రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా నేర్పుగా సమాధానం చెప్పారు … ప్రెస్మీట్ లో ఎక్కడ కూడా విరగబడి కాదు కదా, మామూలుగా కూడా నవ్విన దాఖలాలు లేవు ….

నెటిజన్లు ప్రతిదానిలో నెగిటివిటీని చూసి రాద్ధాంతం చేస్తున్నారు… ఫోన్, డేటా, చేతిలో ఉండి, టైపింగ్ వచ్చేసరికి ప్రతివిషయాన్ని ఎలా వైరల్ చేసి అసలు విషయాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అని వెతుకుతున్నారు…

కింద original press-meet వీడియో లింక్ పోస్ట్ చేస్తున్నాను. ఓపికగా ఒకసారి చూసి మీ ఒపీనియన్ ఫార్మ్ చేసుకోండి. సెన్సిటివ్ ఇష్యూని అంతే సెన్సిటివ్ గా ప్రొఫెషనల్ గా రిపోర్టర్స్ తో రమ్య భారతి పంచుకున్నారు అని మీరు కూడా ఒప్పుకుంటారు…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే, ఆమె నవ్వింది… కానీ ఆ నవ్వు నాణేనికి మరోకోణం ఇదుగో…
  • Obsession … ఏమిటీ సెన్సేషన్..? అసలు ఏముంది ఈ మూవీలో..!!
  • రేవంత్‌రెడ్డి భలే పట్టేశాడు ఆ ఫైల్ మర్మాన్ని..! తిప్పికొట్టేశాడు..!!
  • తెలుగునాట జర్నలిజం స్వేచ్ఛ, నిష్పాక్షికత… ఓ పే-ద్ధ భ్రమ..!!
  • నేల విడిచి సాము..! పెద్ద హీరోకూ, చిన్న హీరోకూ నడుమ అదే తేడా..!
  • …. రవితేజను వాణివిశ్వనాథ్ ఈడ్చి చెంపలు వాయగొట్టింది..!
  • తెలంగాణ టాప్..! రేవంత్ రెడ్డి కాలరెగరేసుకునే ముఖచిత్రం ఇది..!
  • పుష్పరాజ్ ఎప్పుడూ విలనే… అంతిమంగా గెలిచేది సింగమే…
  • మొద్దుబారిన ఖాకీలు..! తమిళ ఐపీఎస్‌లపై నెటిజనం భగ్గు…!
  • “ఎవరెస్ట్” సాహసానికి ప్రతీకా? లేక ఎ‘వరస్ట్’ సెల్ఫీ టూరిజం శిఖరమా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions