Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!

August 26, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. వారిజాక్షులందు వైవిహికములందు
ప్రాణ విత్త మానభంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందదధిపా!

అల్లాటప్పా వాళ్ళు చెప్పింది కాదు . బమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతంలో శుక్రుడు బలి చక్రవర్తికి బోధించిన శుక్ర నీతి . పైగా అల్లరి మొగుడు సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎండార్స్ చేసిన థియరీ .

Ads

అసలు సినిమా పేరే రెండిళ్ళ పూజారి . కధ చెప్పాలా !? అర్థం అయ్యే ఉంటుంది . ఓ ఊళ్ళో రాముడు వంటి మంచి బాలుడు ఉంటాడు . నిఖార్సయిన ఏకపత్నీవ్రతుడు . అనూహ్యంగా ఆఫీసు డబ్బుల్లో ఒక లక్ష రూపాయలు వాడేసుకుంటాడు . ఇంకో నాలుగు లక్షలు కాజేయబడతాయి .

తప్పని పరిస్థితులలో ఓ నెల రోజుల కాంట్రాక్ట్ పెళ్ళికి ఒప్పుకొని అయిదు లక్షల రూపాయలు ఆఫీసుకు తిరిగి ఇచ్చి బయటపడతాడు . అక్కడ నుంచి ఇద్దరి పెళ్ళాల మధ్య ఫుట్ బాల్ లాగా ఎడాపెడా వాయించబడుతూ ఉంటాడు . క్లైమాక్సులో ఇద్దరూ గర్భవతులం అని చెప్పడంతో అల్లరి మొగుడులాగా సుఖాంతం , శుభాంతం అవుతుంది .

సృజనా ఫిలింస్ బేనరుపై టి. రమేష్ బాబు నిర్మాతగా కధను రచయిత జి. వి. అమరేశ్వరరావు సమకూర్చగా మరొక ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు స్క్రీన్ ప్లేని అందించారు . మరో రచయిత కం నటుడు తనికెళ్ళ భరణి డైలాగులను వ్రాసారు . వెరశి టి. ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చక్కటి వినోదాత్మక సినిమా రూపు దిద్దుకుంది .

కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి , భువనచంద్ర వ్రాసిన పాటల్ని దర్శకుడు టి. ప్రభాకర్ చాలా రొమాంటిక్‌గా చిత్రీకరించారు . బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు . వీణల్లో తీగె ఏమంది , లెఫ్ట్ లెగ్గు లిఫ్టు చేసి , సందె మసకలో రాజా , పట్టింది పిచ్చిదో , హరిలో రంగ హరీ రెండిళ్ళ పూజారీ అంటూ సాగుతాయి పాటలు .

పాటలన్నీ సుమన్ , శోభన , నగ్మాల మీదే ఉంటాయి . పర్లేదు, చూడతగ్గ రొమాంటిక్ వీడియోలే . ప్రధాన పాత్రల్లో మల్లికార్జున రావు , నిర్మలమ్మ , గిరిబాబు , హేమ , తనికెళ్ళ భరణి , కోట శ్రీనివాసరావు , బాబూమోహన్  తదితరులు నటించారు .

సినిమాలో హైలైట్ కోట శ్రీనివాసరావు హిజ్రా పాత్ర . ఆయనకు ఆయనే సాటి . అద్భుతంగా నటించారు . డైలాగ్ డెలివరీలో కూడా చాలా వంపులు ఉంటాయి .‌మొత్తం మీద చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడతగ్గ రొమాంటిక్ ఎంటటర్టయినర్ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?
  • అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!
  • చో – ఎవడినీ లెక్కచేయలేదు- నమ్మిన ఏ మాటనూ దాచుకోలేదు…!!
  • SIR ప్రకంపనలు- న్యాయవ్యవస్థలోనూ చర్చ – భిన్నాభిప్రాయాలు !!
  • స్టీవ్ జాబ్స్ చివరి మాటలు “ఓహ్- వావ్!… ఏం చూశాడు తను..?!
  • పెళ్లి లేదు… పిల్లలు లేరు… అంతిమంగా మేనల్లుళ్లే వారసులు?
  • ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!
  • ఎంతకు తెగించావురా..? ఆ ‘యావ’తో జీవిత ఖైదీనే వదిలేశావు!!
  • తప్పే- కానీ ఆ తప్పు తీవ్రత ఎంత..? తప్పుచేశానా? ఓ రిపోర్టర్ స్వగతం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions