తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళాడు… పెట్టుబడుల కోసం… తెలంగాణ బ్రాండ్ ప్రమోషన్ కోసం… అందరికీ తెలిసిందే…
అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు… అదేమీ సిటీ నుంచి ఫాం హౌస్ కి వెళ్లినంత ఈజీ కాదు కదా… అబ్రకదబ్ర అంటూ అక్కడ మాయమై అమెరికాలో వెంటనే ప్రత్యక్షం కాలేడు కదా…
కానీ బీఆరెస్ క్యాంప్ ఏదో తొర్రలు వెతికే పనిలో పడింది ఇందులో కూడా… ఫాం హౌజ్ లో రోజుల తరబడి ఎవరికీ కనిపించని అజ్ఞాతం కాదు కదా ఇది… కానీ దావొస్ నుంచి మూడు నాలుగు రోజులు ఎక్కడికి పోయాడు అని విమర్శ మొదలు… అదేదో నేరం, పాపం అయినట్టు..!
Ads
అమెరికాలో స్వాగతాలు ఏవి? హడావిడి ఏది? ఏదో ఉందిలే అని ప్రచారం… ఒక రకం ఛాందస రాజకీయాలు చూసీ చూసీ … ఒక సీఎం కొత్త తరం రాజకీయ విద్య కోసం వెళ్తే… జీర్ణం చేసుకోలేక పోవడమా ఇది..? ఏదో ఒక బురద చల్లడమా ఇది…!
కెన్నెడీ స్కూల్ లో తోటి స్టూడెంట్స్ తో మెట్లు దిగుతున్న వీడియోస్ చూసి కూడా విమర్శలు ఏమిటో తెలియదు… పటాటోపం లేకుండా వెళ్ళినా తప్పేనా? విమర్శలు రాజకీయాల్లో సహజం కానీ అసందర్భ, అనవసర, అసంగత విమర్శలు కువిమర్శలు అనిపించుకుంటాయి… తను అమెరికా వెళ్ళగానే అక్కడ అనూహ్యంగా వింటర్ స్టార్మ్ , ఎటూ కదల్లేని స్థితి…

రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో ఒకసారి ఆ చదువు విశిష్టత ఏమిటో చెప్పుకుందాం… తను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లడం కేవలం ఒక విదేశీ పర్యటన మాత్రమే కాదు, అది భారత రాజకీయాల్లో ఒక సరికొత్త ఒరవడి…
రేవంత్ రెడ్డి ‘హార్వర్డ్’ పాఠం ఏమిటంటే… సాధారణంగా భారతీయ రాజకీయ నాయకులు ఎన్నికలు ముగియగానే గెలుపు ఉత్సవాల్లోనో లేదా ప్రత్యర్థులను విమర్శించడంలోనో నిమగ్నమై ఉంటారు… పరస్పర విమర్శల హోరులో మునిగి తేలుతూ ఉంటారు…
కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక విద్యార్థిలా మారి, ప్రపంచంలోనే అత్యున్నతమైన హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (Harvard Kennedy School) లో అడుగుపెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు…
దేనిపై ఈ విద్య? (The Focus)…. రేవంత్ రెడ్డి హార్వర్డ్‌లో అభ్యసిస్తున్న కోర్సు పేరు “Leadership for the 21st Century… Chaos, Conflict, and Courage” (21వ శతాబ్దపు నాయకత్వం… అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)…
- అంశం… క్లిష్ట పరిస్థితుల్లో, అంటే సమాజంలో గందరగోళం (Chaos) నెలకొన్నప్పుడు లేదా రాజకీయ సంఘర్షణలు (Conflict) తలెత్తినప్పుడు ఒక నాయకుడు ఎంత ధైర్యంగా (Courage) నిర్ణయాలు తీసుకోవాలి అనేదే ఈ కోర్స్ సారాంశం…
- విధానం…. ఇందులో కేవలం ప్రసంగాలు ఉండవు… ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన పాలనాపరమైన వైఫల్యాలు, విజయాలపై ‘కేస్ స్టడీస్’ (Case Studies) చేస్తారు…. 20 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి రేవంత్ రెడ్డి ‘హోం వర్క్’ చేయడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం విశేషం…
ఎందుకు ఇంపార్టెంట్? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వేల కోట్ల బడ్జెట్, లక్షల మంది ఉద్యోగులపై అధికారం ఉంటుంది… కానీ ఆ అధికారాన్ని ‘technical fixes’ (తాత్కాలిక పరిష్కారాలు) కోసం కాకుండా, ‘adaptive leadership’ (పరిస్థితులకు అనుగుణంగా మారే నాయకత్వం) కోసం వాడటం ఈ కోర్సు నేర్పిస్తుంది…- ప్రజా సమస్యలకు గ్లోబల్ సొల్యూషన్… తెలంగాణ వంటి రాష్ట్రంలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను (నిరుద్యోగం, నీటి వనరులు, ఆర్థిక క్రమశిక్షణ) ప్రపంచ స్థాయి కోణంలో ఎలా చూడాలి అనే అవగాహన దీనివల్ల కలుగుతుంది…
- నమ్మకం… పాలకులు చదువుకు, విజ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తే, అది రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది.
ఛాందస భావజాలం వర్సెస్ కొత్త తరం రాజకీయాలు….
మన దేశంలో చాలా మంది నాయకులు “మేము అంతా చూశాం, మాకు ఎవరూ చెప్పక్కర్లేదు” అనే అహంభావంలో ఉంటారు…. ఇలాంటి ఛాందస భావజాలం (Orthodox Mindset) ఉన్న నాయకులకు, పార్టీకి ఒక సిట్టింగ్ సీఎం మళ్ళీ విద్యార్థిగా మారడం విడ్డూరంగా అనిపించవచ్చు…- లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్… నాయకత్వం అంటే కేవలం మైకుల ముందు ప్రసంగాలు కాదు, మారుతున్న కాలంతో పాటు తనను తాను అప్‌డేట్ చేసుకోవడం అని రేవంత్ నిరూపిస్తున్నారుడు…
- విమర్శలకు సమాధానం…: “చదువుకుని ఏం చేస్తారు?” అనే పాతకాలపు ఆలోచనలకు, “చదువుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలం” అనే ఆధునిక సంకేతాన్ని ఆయన పంపిస్తాడు…
ముగింపు…. ఒక విశేషమైన అడుగు
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ (Ivy League) యూనివర్సిటీలో కోర్సు చేస్తున్న తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు… ఇది కేవలం ఆయన వ్యక్తిగత ఎదుగుదలే కాదు, తెలంగాణ పాలనలో రాబోయే గుణాత్మక మార్పుకు సంకేతం…. రాజకీయం అంటే కేవలం ఓట్ల వేట మాత్రమే కాదు, అది ఒక నిరంతర అభ్యాస ప్రక్రియ అని ఈ తరం నాయకులకు ఆయన చెప్పే కొత్త పాఠం…

Share this Article