Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“లండన్ బాబు & ది హనీ బీ… ఆర్జీవీ ఓ షార్ట్ ఫిలిమ్ తీస్తే…!!

April 29, 2026 by M S R

.

అదుర్స్ సినిమాలో బ్రహ్మానందాన్ని నయనతారలాగా… ఇక్కడా సాంతం నాకేసింది కదా… ఇప్పుడు ఆ లండన్ ధర్మేంద్రుడు లబోదిబో మొత్తుకుంటుంటే… కోటిన్నర ఇస్తా, మిగతా కుదిరినప్పుడు ఇస్తా, కాదంటే కేసులు పెడతా అని ఆషు రెడ్డి బెదిరిస్తోంది కదా… ఆ ఫీల్డే అలాంటిది… నిజానికి ఆమెపై అంత పిచ్చి తనకు ఎందుకు ప్రకోపించిందో, అదీ ఎనిమిదేళ్లుగా ఎలా పెరిగిపోయిందో అర్థం కాదు… ఆమె గురించి అన్నీ వింటూ, చదువుతూ, చూస్తూ… చివరకు ఆర్జీవీ వేళ్ల చీకుడు వీడియోలు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగే ఫోటోలు చూస్తూ కూడా అలా వందల ట్రాన్సాక్షన్లతో కోట్లకుకోట్లు ఎలా ఇచ్చాడు..?

అందరూ రాస్తున్నట్టు ఆ అబ్బాయి బాధితుడు కాడు… మూర్ఖుడు..! ఆషురెడ్డికి, ఆమె చెల్లెకు, ఆమె తండ్రికి ధారబోసిన సొమ్ము సింపుల్‌గా చెప్పాలంటే గోడకు కొట్టిన సున్నం… విచిత్రంగా ఆమె వేణుస్వామి, నటి ప్రవీణ మధ్యవర్తులుగా సెటిల్ చేసుకుందాం అని ఏవో కొత్త కథలు చెబుతోంది గానీ, ఆమె వీర ధీర శూర పైత్య ప్రేమికుడు వర్మ పేరు మాత్రం ప్రస్తావించడం లేదు…

Ads

అసలు ఆషురెడ్డి – ధర్మేంద్ర కేసును అదే వర్మ ఓ షార్ట్ ఫిలిమ్ తీస్తే ఎలా ఉండొచ్చు..? సరదాగా…  ఊహించుకుంటేనే ఒక రకమైన ‘వైబ్’ వస్తుంది కదా! (తను తీసిన ఐస్‌క్రీమ్ వంటి కొన్ని రోత సినిమాల్ని ఓసారి గుర్తుతెచ్చుకొండి…)



 సినిమా పేరు: “లండన్ బాబు & ది హనీ బీ”

ట్యాగ్‌లైన్: ఇంగిత జ్ఞానం లేని చోట… ఇన్వెస్ట్‌మెంట్ వృధా!

సీన్ 1: ఇంట్రడక్షన్ (RGV వాయిస్ ఓవర్)

కెమెరా ఫ్లోర్ మీద పడి ఉంటుంది… అటు ఇటు ఊగుతూ హీరో షూస్ దగ్గర ఆగుతుంది… బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వింతైన శబ్దంతో కూడిన మ్యూజిక్… RGV వాయిస్…: “ఈ ప్రపంచంలో రెండు రకాల మూర్ఖులు ఉంటారు… ఒకటి… ఏమీ లేకపోయినా అంతా ఉందని నమ్మేవాళ్లు… రెండు… అంతా ఉండి కూడా ఏమీ లేదని నమ్మేవాళ్లు… మా వాడు రెండో రకం…. లండన్‌లో కోట్లు సంపాదిస్తున్నాడు కానీ, తన గుండెలో పడే చిన్నపాటి చిల్లును గుర్తుపట్టలేకపోయాడు….” (బ్యాక్ గ్రౌండ్‌లో వింత బీజీఎం)…

సీన్ 2: ఆస్తుల బదలాయింపు (ది అగ్రిమెంట్)

హీరో  కోట్ల ఆస్తి కాగితాల మీద సంతకం పెడుతుంటాడు… పక్కన 5 కిలోల బంగారు ఇటుకలు… హీరోయిన్ మొహం క్లోజప్‌లో కనిపిస్తుంది… ఆమె కళ్లలో విలనీ షేడ్ కనిపిస్తుంటే, హీరో కళ్లలో మాత్రం ‘దేవదాసు’ రేంజ్ ప్రేమ కనిపిస్తుంది… హీరో…: “అషు.. నీ మీద ప్రేమే నా ఆస్తి….” హీరోయిన్ (మనసులో)…: “నీ ఆస్తే నా ప్రేమరా బుజ్జీ!” (కెమెరా ఒక్కసారిగా ఆమె మూతి, చెంపల దగ్గరికి జూమ్ అవుతుంది – Typical RGV Style!)

సీన్ 3 : వర్మ మార్క్ టేకింగుల్లో లండన్ బాబు తను సదరు హీరోయిన్‌తో బీచుల్లో, కేండిల్ లైట్ డిన్నర్లలో, బెడ్‌రూం బ్లూ లైట్‌లో ఏవేవో ఊహించుకుంటూ ఉంటాడు…

సీన్ 4: ది రివర్స్ గేర్ (బెదిరింపు) 

ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి డియర్, పెళ్లి చేసుకుందాం, నా దగ్గర కూడా నయాపైసా మిగల్లేదు అని ప్రాథేయపడుతుంటాడు హీరో…  ఎహెపోరా, నీతో పెళ్లేమిటి, ఇంకా ఏముంది నీ దగ్గర, నీ మొహం నాకు చూపించకు అని కటువుగా చెబుతుంటుంది హీరోయిన్… 

హీరోయిన్..: “చూడు బాబు… నువ్వు ఇచ్చింది ప్రేమతో. నేను తీసుకుంది అదే హక్కుతో. ఇప్పుడు అరిచావో… లండన్ వెళ్లడం కాదు కదా, లోకల్ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా దిగలేవు. హరాజ్‌మెంట్ కేసు అంటే ఏంటో తెలుసా?” హీరో..: ” మరి నా 9 కోట్లు?” హీరోయిన్..: “నెలకి ఒక లక్ష ఇస్తా. మిగతావి నా మనవడికి పెళ్లి అయ్యాక ఇస్తా. ఇప్పుడు వెళ్లు!”

సీన్ 5: సాంగ్ (RGV స్పెషల్)

ఆకాశం వైపు చూస్తూ హీరో ఏడుస్తుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాట వినిపిస్తుంది… “లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్.. ఫాలింగ్ డౌన్.. నీ తెలివి తేటలు బర్నింగ్ డౌన్.. బర్నింగ్ డౌన్..” 

సీన్ 6 … నన్ను మోసం చేసింది అని హీరో పోలీసు స్టేషన్ మెట్లెక్కుతాడు… సైబర్ క్రైమ్ కేసు నమోదు చేస్తారు పోలీసులు…

సీన్ 7… హీరోయిన్ అది సైబర్ కేసేమిటి, డబ్బు తీసుకున్నాను అని నేనే చెబుతున్నాను కదా, నేరం ఏముంది, కేసు కొట్టేయండి అని కోర్టు మెట్లెక్కుతూ ఉంటుంది…


చివరకు అదే ఆర్జీవీ వాయిస్ ఓవర్… పిల్లలకి ర్యాంకులు మాత్రమే కాదు, మనుషుల్ని గుర్తుపట్టే ‘మ్యానర్స్’ కూడా నేర్పాలి… ఇంగితం నేర్పాలి… లేదంటే ఇలాగే “లవ్’’ పేరుతో ఆస్తులు ఆవిరైపోతాయి! (ఆమెకు సరే, ఆమె చెల్లికి డబ్బులు ఎందుకు ఇచ్చాడు, మరో షార్ట్ ఫిలిమ్‌లో మళ్లీ కలుద్దాం అని స్క్రోలింగ్‌తో… శుభం కార్డు…)


Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!
  • Telangana’s Spiritual Renaissance – Revanth Vision for Grandeur

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions