Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హవ్వ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!

March 17, 2026 by M S R

.

తెలుగు మాత్రమే కాదు, భారతీయ భాషల్లో సినిమా బూతు పాటలు, ద్వంద్వార్థాల పాటలు, ఐటమ్ సాంగ్స్ అని పిలిచే ఆ రోత పాటలు కొత్తేమీ కాదు… అప్పట్లో ఎన్టీయార్ పాటలు ఎన్ని వినలేదు మనం..? కానీ ప్రేక్షకుడి స్థాయి పెరిగింది…

పిచ్చి కూతలు, బూతులు వినిపిస్తే… ఇట్టే పట్టుకుని, సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు… ఆధ్యాత్మిక పాటలు పాడే మంగ్లి ప్రస్తుతం ఓ వివాదంలో ఇరుక్కుంది… అఫ్‌కోర్స్, ఆమెకు కొత్తేమీ కాదు… తాజాగా ఏమిటంటే..?

Ads

ధృవ సర్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘KD: ది డెవిల్‘‌లోని ఓ పాట చుట్టూ, పాడిన మంగ్లి చుట్టూ ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది… ఈ సినిమాలోని ఆ పాట (సాధారణంగా ‘అమ్మ’ లేదా ‘మదర్’ సెంటిమెంట్‌తో కూడిన పాటగా చెప్పారు కానీ..?) ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది…

వివాదానికి కారణాలు …. అభ్యంతరకర సాహిత్యం… ఈ పాటలోని పదజాలం, చిత్రీకరించిన విధానం అత్యంత అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్నాయని ముంబైకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు…

  • ఫిర్యాదు…: సెన్సార్ బోర్డ్ (CBFC) తో పాటు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఆయన ఫిర్యాదు చేయడంతో విషయం సీరియస్ అయ్యింది…యూట్యూబ్ నుండి తొలగింపు: ఫిర్యాదులు మరియు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా, చిత్ర యూనిట్ ఆ పాటను యూట్యూబ్ నుండి ప్రస్తుతానికి తొలగించింది.

మంగ్లీపై నెటిజన్ల ఆగ్రహం … సాధారణంగా జానపద పాటలు, భక్తి గీతాలు, బాధ్యతాయుతమైన పాటలు పాడుతుందని జనం చెప్పుకునే మంగ్లీ, ఇలాంటి “అశ్లీల” సాహిత్యం ఉన్న పాటను పాడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు…

“కెరీర్ లో మంచి గుర్తింపు ఉన్న సమయంలో, కనీసం సాహిత్యం ఏంటో చూసుకోకుండా ఇలాంటి పాటలకు ఎలా ఓకే చెబుతావు?” అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి…

చిత్ర బృందం స్పందన …. దర్శకుడు ప్రేమ్, సంగీత దర్శకుడు అర్జున్ జన్య, గీత రచయితలపై కూడా విమర్శలు వస్తుండటంతో, చిత్ర యూనిట్ ఈ వివాదంపై అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి… కేవలం కన్నడంలోనే కాకుండా తెలుగు, హిందీ వెర్షన్లలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది…

‘KD: ది డెవిల్’ సినిమాలోని “సర్కే చునార్ తేరి సర్కే“ (తెలుగులో ‘జరిపెయ్, నాతో పండుగ జరిపయ్’ అని ప్రచారం పొందింది) పాటపై వస్తున్న ప్రధాన అభ్యంతరం అది “డబుల్ మీనింగ్” (ద్వందార్థం) తో ఉందనేది… నెటిజన్లు, లాయర్ వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్న కొన్ని ప్రధాన అంశాలు ఏంటంటే..?

ఈ పాటలోని హిందీ లిరిక్స్ (ప్లస్ ఇతర భాషల అనువాదాలు) నేరుగా ఒక శృంగార ప్రక్రియను వర్ణించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి… ముఖ్యంగా ఈ క్రింది అర్థం వచ్చేలా సాహిత్యం ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు…

  • “ముందు దాన్ని ఎత్తు… లోపల పెట్టు… ఒక్క బొట్టు కూడా కింద పడనీయకు…. ఖాళీ అయ్యాక బయటకు లాగు….” (పహ్లే ఉఠాలే.. అందర్ వో డాలే.. నీచే ఏక్ బుంద్ నా గిరాయే..)…

  • లిరిక్ రైటర్లు ఇది ఒక “మద్యం బాటిల్” గురించి అని సమర్థించుకున్నా, వినేవారికి అది స్పష్టమైన అశ్లీల అర్థాన్ని ఇస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు… నిజంగానో ఓ రోత, ఓ వెగటు, ఓ వెకిలి వ్యక్తీకరణ…

దృశ్యాల్లో అసభ్యత….

  • Hook Step…: నోరా ఫతేహి తన డ్యాన్స్‌లో పైటను పదే పదే జారుస్తూ చేసే స్టెప్పులు అత్యంత అశ్లీలంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు…

  • విజువల్స్..: బార్ సెట్టింగ్‌లో సంజయ్ దత్, నోరా ఫతేహి మధ్య వచ్చే కొన్ని క్లోజప్ షాట్స్, కొరియోగ్రఫీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందికరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి…

సెలబ్రిటీల స్పందన… 

సంజయ్ దత్‌కు, నోరా ఫతేహికి… సంగీత దర్శకుడికి, నృత్య దర్శకుడికి, నిర్మాతకు, దర్శకుడికి సిగ్గూశరం లేవు సరే… పాడినవాళ్లు అంత సిగ్గు చంపుకుని ఎందుకు పాడినట్టు అనే విమర్శ వినిపిస్తోంది ప్రధానంగా… డబ్బులిస్తే చాలు, ఏదైనా పాడతాం అంటే కుదురుతుందా..?

ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ కూడా ఈ పాటపై స్పందిస్తూ.. “కమర్షియల్ పాటల స్థాయి ఇంతలా దిగజారిపోవడం బాధాకరం” అని ట్వీట్ చేశాడు… ఈ తీవ్ర వ్యతిరేకత వల్లే చిత్ర బృందం యూట్యూబ్ నుండి అన్ని భాషల వెర్షన్లను ప్రస్తుతం తొలగించింది (Private చేసింది)… ఫాఫం మంగ్లి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హవ్వ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…
  • ఆస్కార్ జ్యూరీని ఎందుకు ఈ సినిమా అంతగా ఇంప్రెస్ చేసింది..?!
  • పాత కేసీయార్ ఫ్యాన్… ధాటిగా ఆ పొలిటికల్ అనైతికతపై ప్రశ్నలు…
  • దిష్టి వ్యాఖ్యలు, వెక్కిరింపుల్ని తొక్కిపడేస్తూ… తెలంగాణ పరుగులు…
  • పేరుకే BRS- TDP వైరం… *యవ్వారాల్లో* జాన్‌జిగ్రీలే… ఏమంటావ్ బాపూ..?!
  • గుండమ్మ కథ రీమేక్..! అసాధ్యం… ఎస్వీఆర్, సూర్యకాంతం కావాలి కదా..!!
  • నేను ఎందుకు రాసుకుంటున్నాను ఇవన్నీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions