Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘పొంతన’ కుదరని ‘గుణాలు ! అన్నీ బాగున్నా ఇన్ని విడాకులేమిటి మరి !?

August 3, 2026 by M S R

.

నిన్నటి ఆంధ్రజ్యోతి స్టోరీ… సారాంశం ఏమిటయ్యా అంటే..? పెళ్లి కుదరాలంటే కుండలి కలవాల్సిందే, 70 శాతం వివాహాలు జాతకాల ఆధారంగానే… మ్యాట్రిమోనీలో కూడా 36 గణాల పంచాయతీ, 18 పాయింట్లు దాటకపోతే మ్యాచ్ రిజెక్టే…

సాంకేతికత పెరిగినా వీడని విశ్వాసం- జన్ జీ యువతదీ అదే బాట… ప్రేమ పెళ్లిళ్లకూ జాతక పరిహారాలే ముఖ్యం… నమ్మకమో భవిష్యత్తుపై భయమో తెలియని వైనం, జాతకాలతో సంబంధం లేకుండా జరిగే పెళ్లిళ్లు 15-20 శాతమే… దేశంలో జాతకాల మార్కెట్ లక్ష కోట్ల పైనే… 2030 నాటికి 1.8 లక్షల కోట్లు దాటే చాన్స్…

Ads

విదేశాల్లో తక్కువే, అమెరికాలో 27 శాతం మంది జాతకాల బాట…. ఇదీ వాళ్లు రాసుకున్న ముఖ్యాంశాలే… వాళ్ల సొంత సర్వే అట… సరే, తీసుకున్న శాంపిల్స్, వేసిన ప్రశ్నలు గట్రా శాస్త్రీయతను పక్కన పెడితే… స్థూలంగా ఒకటి మాత్రం నిజం… పెళ్లిళ్లకు సంబంధించి ఈ ‘గుణాల’ పరిశీలన మాత్రం బాగా పెరిగింది…

గతంలో ఎవరైనా పంతులు గుణాలు ఎక్కువ లేవు అనుకుంటే, ఏదో కూటమిలో లెక్కలు సరిపోవడం లేదు అంటే, అమ్మాయి పేరును మార్చేసేవాళ్లు… యుక్త వయస్సులో పునఃనామకరణం… అంతేతప్ప, అన్నిరకాలుగా కుదిరిన సంబంధాన్ని వదులుకునేవారు కాదు, వివాహ పొంతనకు అప్పట్లో ఇదే చిట్కా…

గోత్రాలు చూసేవాళ్లు, అంతే… అంటే, సగోత్రం గాకుండా చూసేవాళ్లు… ఇప్పుడు మూడు గోత్రాల్ని చూడటం లేదు, జస్ట్, మొదటి రెండు గోత్రాలు విడిగా ఉంటే చాలు, ఆ గోత్రాల లెక్క కూడా వేరే… సరే, అదంతా వేరే చర్చ… బ్రాహ్మలలో చూసే లెక్కలు మరీ సంక్లిష్టంగా ఉంటాయి… (అఫ్ కోర్స్, ఆడ పిల్లలే దొరకడం లేదు, పెళ్లిళ్లే కావడం లేదు, అది మరో చర్చ…)

ఈమధ్య, అంటే ఐదూపదేళ్లుగా కుండలి, గుణాలు, జాతకాల పరిశీలన మరీ ఎక్కువైపోయింది… మరీ కొందరు ఎలా తయారయ్యారంటే పంచాంగం వాళ్లే చూసేసుకుని… వర్ణ, వశ్య, దిన, యోని, రాశి, నాడి, గ్రహమైత్రి, గణకూటం కూడా లెక్కలేసుకుని, అన్నీ పక్కాగా ఉంటేనే ఓకే అంటున్నారు…

నిజానికి ఇదంతా పెద్ద చర్చ… వివాహ పొంతన చూడాలంటే వధూవరుల నక్షత్రాలను బట్టి గుణాలు లెక్కించడంకన్నా ఇరు కుటుంబాల ‘గుణాల’ పరిశీలన ముఖ్యమనీ అంటారు… అంతేకాదు, నిజంగానే బలంగా నమ్మితే, గుణాలకు బదులు చూడాల్సినవి లగ్నపొంతన, లగ్నాధిపతుల సఖ్యత, కళత్ర స్థానం (ఏడో స్థానం), 2, 8 స్థానాలు, అంటే కుటుంబ స్థానం, మాంగల్య స్థానం, గురు, శుక్ర, శని స్థితులు, దోషసామ్యం వంటి చాలా అంశాలు చూడాలి… నిజానికి పంతుళ్లలోనే చాలామందికి వీటి పరిశీలన తెలియదు…

మేట్రిమోనీ సైట్లు మరీ దారుణం… మనం వధూవరుల జన్మసమయం, స్థలం, తేదీ గట్రా చెప్పేస్తే, వంద కోణాల్లో జాతకాల్ని, వివాహ పొంతనల్ని సెకండ్లలో పరిచేస్తున్నాయి… కుండలితోసహా చూపించేస్తున్నాయి… వాటి శాస్త్రీయత అతి పెద్ద ప్రశ్నార్థకం…

జాతకం

నిజానికి ఈ సర్వే, ఈ స్టోరీ చాలా పెరిఫెరల్, నాణేనికి ఒకవైపే… ఒకవైపు మరింత మూఢంగా వీటిల్లో కూరుకుపోవడం ఒకవంతు, మరోవైపు అదే స్థాయిలో ఇవేవీ నమ్మని కొత్తతరం మరోవైపు… సహజీవనాలు, కోలివింగులు, లవ్వులు, బ్రేకప్పులు, విడాకులు ఎట్సెట్రా విపరీతంగా పెరిగిపోయాయి… ఫ్యామిలీ కోర్టుల్లో పేరుకుపోతున్న విడాకుల కేసుల సంఖ్యే పెద్ద నిదర్శనం…

సాంకేతికత పెరిగేకొద్దీ ఈ నమ్మకాలు తగ్గుతాయనేదీ భ్రమే… పైగా జాతకాల మార్కెట్ విలువ కూడా ఏదో పైపైన వేసుకుని, రాసేసుకున్న అంకె మాత్రమే… దాన్ని లెక్కించడం, అంచనా వేయడం అసాధ్యం… నిజానికి అన్నీ లెక్కలేసుకుని, పక్కాగా చూసుకుని పెళ్లి చేస్తే… ఎన్ని నిలబడుతున్నాయి? అన్నీ బాగుండీ పెటాకులు ఎందుకవుతున్నాయి..? ఇదీ అసలు ప్రశ్న…

రెండు వైపులా కుటుంబాల ఆర్థిక స్థితి, బంధుగణం గట్రా చూసుకుని, విద్య, కొలువులు గట్రా చూసుకున్నాక… సంబంధం కుదుర్చుకుంటే, జాతకాలదేముంది, ప్రతి దోషానికీ పరిహారం ఉంటుంది… సో, పొంతన గుణ లెక్కింపు కాదు… కుటుంబాల ‘గుణ పరిశీలనే’ ముఖ్యం… ఆ తరువాత దంపతుల నడుమ ‘సఖ్యత- సర్దుబాటు వంటి సరైన ‘పొంతన’ సరిగ్గా ఉంటేనే సుఖం… లేకపోతే ఏ జాతకమూ, ఏ కుండలీ ఏ పెళ్లినీ రక్షించదు !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions