.
అంతుచిక్కని అనంత విశ్వం – ఒక చిన్న ప్రయాణం…. పరిచయం…: మనం రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు, అన్నీ నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తాయి… కానీ, నిజానికి అక్కడ నిమిష నిమిషానికి, క్షణక్షణానికి ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి…
నిన్న మీడియాలో రెండు డిఫరెంట్ సైన్స్ స్టోరీలు కనిపించాయి… సైన్స్ ఇప్పుడు మనకు రెండు కొత్త విషయాలను చెబుతోంది… ఒకటి ఈ విశ్వం ఎలా సాగుతోంది, అంటే విస్తరిస్తోంది… రెండు.. అసలు ఈ విశ్వాన్ని పట్టి ఉంచుతున్న ఆ అదృశ్య శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి ఏమిటి..?
Ads
1. విశ్వం అనే బెలూన్…: రాము అనే కుర్రాడు తన తండ్రిని అడిగాడు, “నాన్నా! విశ్వం విస్తరిస్తోంది అంటున్నారు కదా, అది దేనిలోకి వెళ్తోంది..? దాని బయట ఖాళీ ఉందా… ఖాళీ ఉంటేనే కదా, అందులోకి విస్తరించేది…’’
తండ్రి ఒక రబ్బరు షీట్ తీసుకుని దానిపై రెండు చుక్కలు పెట్టాడు… “రాము, ఈ చుక్కలు గెలాక్సీలు అనుకో… ఇప్పుడు ఈ షీట్‌ను సాగదీస్తే ఏమవుతుంది…?” అన్నాడు…
షీట్ సాగుతున్న కొద్దీ ఆ చుక్కల మధ్య దూరం పెరిగింది… తండ్రి నవ్వి ఇలా అన్నాడు… “ఇక్కడ చుక్కలు పరుగెత్తడం లేదు, అవి ఉన్న షీట్ (స్థలం) సాగుతోంది, అంటే విస్తరణ… విశ్వానికి ‘బయట’ అనేది ఏదీ లేదు… విశ్వమే సాగుతూ తనలో తాను కొత్త ఖాళీని సృష్టించుకుంటోంది”…

2. గ్రావిటీ అనే అదృశ్య బంధం…: మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘గురుత్వాకర్షణ’… మనం ఇప్పటివరకు భూమి మనల్ని తన గురుత్వాకర్షణ శక్తితో కిందకు లాగుతుంది అనుకుంటున్నాం… ప్రతి గ్రహానికీ ఈ శక్తి ఉంటుందని కదా అనుకుంటున్నాం… గ్రహాల సంచారానికీ, పరిభ్రమణాలకూ అదే కారణం అంటుంటారు కదా…
కానీ కొత్త సిద్ధాంతం ప్రకారం, ఇది కేవలం ‘లాగడం’ ఆకర్షించడం కాదుట.., ఇదొక ‘బంధం’… విశ్వంలోని ప్రతి వస్తువు మరొక వస్తువుతో ఒక అదృశ్యమైన ఆకర్షణ నెట్‌వర్క్ ద్వారా కలిసి ఉంది…
ఉదాహరణకు, సముద్రంలో ఒకచోట అల వస్తే దాని ప్రభావం తీరం వరకు ఎలా కనిపిస్తుందో, విశ్వంలో ఒక గ్రహం కదిలినా ఆ ప్రభావం మరొక దానిపై పడుతుంది… వస్తువుల కంటే, వాటి మధ్య ఉన్న ఈ ‘అనుసంధానమే’ అసలైన శక్తి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు…
ముగింపు…: విశ్వం అనేది మనం ఊహించిన దానికంటే చాలా చాలా చాలా లోతైనది… అది కేవలం నక్షత్రాల సమూహం కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక గొప్ప స్పేస్ నెట్‌వర్క్… మనం చూస్తున్నది కేవలం పైపైన కనిపించే రూపం మాత్రమే, లోపల ఇంకా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి…
Share this Article