.
ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు నేలకు దిగొస్తున్నాయి… ఆబగా అప్పులు చేసి, ప్లాట్లు అమ్మి మరీ కొన్న వినియోగదారులు బిక్కమొహాలు వేస్తున్నారు… ‘ముచ్చట’ ముందే హెచ్చరించింది… కృత్రిమ పెరుగుదల ఎప్పుడూ ప్రమాదకరమే అని…
మార్కెట్ భాషలో ప్రాఫిట్ బుకింగ్స్ అనీ, ఏవేవో సాంకేతిక ట్రేడ్ కారణాలు చెబుతారు కానీ… అసలు నిజాలు ఏ దళారీ చెప్పడు… ఈరోజు బంగారం ఏకంగా 13 వేలు పడిపోగా… వెండి ధర 20 వేల పడిపోయి… గరిష్ట ధరతో పోలిస్తే లక్ష రూపాయలు పడిపోయి, ప్రస్తుతం 3 లక్షలకు దిగువన కొట్టుమిట్టాడుతోంది…
Ads
ఈ పతనం ఇక్కడే ఆగదు, ఫ్యూచర్స్ స్థితి పరిశీలిస్తే మరో 40, 50 వేలు పడే సూచనలున్నాయి… ఇప్పటికిప్పుడు భయంతో మీరు అమ్మాలని అనుకున్నా మార్కెట్‌లో కొనేవాడు లేడు… ఇప్పుడు కొత్తగా కొనడమూ సరైన నిర్ణయం కాదు…
సామాన్యులకు, పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం చాలా అవసరం… తెలుగు రాష్ట్రాల్లో చాలామంది “ధరలు పెరుగుతున్నాయి కదా” అని భయం (FOMO – Fear Of Missing Out) తో లక్షల రూపాయలు వెచ్చించి వెండిని కొన్నారు… కానీ ఇప్పుడు జరుగుతున్న పతనం వారికి పెద్ద షాక్ ఇచ్చింది…
ప్రజలను అలర్ట్ చేయడానికి కొన్ని కీలక వార్తా అంశాలు….
1. వెండి “బబుల్” పేలిందా? గత ఏడాది కాలంలో వెండి ధరలు ఏకంగా 300% పైగా పెరిగాయి… ₹1.5 లక్షల నుండి ₹4 లక్షల వరకు వెళ్లడం అనేది సహజమైన పెరుగుదల కాదు, ఇది ఒక రకమైన ‘హైప్’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు… పారిశ్రామిక అవసరాలు (Industrial Demand) లేకపోయినా, కేవలం పెట్టుబడిదారులు ఎగబడటం వల్లే ఈ ధర పెరిగింది… ఇప్పుడు ఆ ‘బబుల్’ పేలడం మొదలైంది…
2. సోలార్ రంగంలో “సిల్వర్-ఫ్రీ” విప్లవం వెండి పతనానికి ఇదే అతిపెద్ద కారణం… ప్రపంచ సోలార్ మార్కెట్‌ను శాసించే చైనా కంపెనీలు (LONGi, Jinko Solar) వెండి వాడకాన్ని తగ్గించే Silver-coated copper paste సాంకేతికతను 2026 ప్రారంభం నుండి భారీ స్థాయిలో అమలు చేస్తున్నాయి…

ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యం…: వెండి ధర రికార్డు స్థాయికి చేరడంతో, సోలార్ ప్యానెల్ తయారీ ఖర్చులో వెండి వాటా 5% నుండి 22% కి పెరిగింది… దీనివల్ల కంపెనీలు నష్టపోతున్నాయి… అందుకే వారు రాగి (Copper) వైపు మళ్లారు… దీనివల్ల వెండికి ఉండే 30% పారిశ్రామిక డిమాండ్ ప్రమాదంలో పడింది… రాగి ధరలు పెరుగుతుంటాయి చూడండి…
3. బడ్జెట్ (Budget 2026) మరియు లాభాల స్వీకరణ కేంద్ర బడ్జెట్‌లో వెండిపై దిగుమతి సుంకం (Import Duty) పెంచుతారేమో అనే భయంతో చాలామంది ముందే కొని పెట్టారు… కానీ సుంకాలలో మార్పు లేకపోవడంతో, ఒక్కసారిగా అమ్మకాలు (Profit Booking) మొదలయ్యాయి…
క్రాష్ రేంజ్…: కేవలం 3- 4 రోజుల్లోనే వెండి ₹4.20 లక్షల నుండి ₹2.65 లక్షల వరకు (MCX Futures) పడిపోయింది… ఇది చరిత్రలోనే అతిపెద్ద పతనం…
మల్టీ కమాడిటీ ఎక్స్‌చేంజ్ (ఎంసీఎక్స్) సిల్వర్ కంట్రాక్టు రేటు మరీ 2.27 లక్షల దగ్గర ఉంది… అంటే 4 లక్షల గరిష్ట ధరతో పోలిస్తే సగం పడిపోయినట్టే దాదాపుగా… ఈ దెబ్బకు ఈటీఎఫ్ రేట్లు కూడా బాగా పతనం అయ్యాయి… ఇదీ రియాలిటీ…
4. ప్రజలు గమనించాల్సిన విషయాలు బంగారంలాగా వెండి కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక పారిశ్రామిక లోహం… పరిశ్రమల్లో వాడకం తగ్గితే దీని ధర విపరీతంగా పడిపోతుంది… వెండిని అమ్మడం బంగారం అంత సులభం కాదు (ముఖ్యంగా భారీ నిల్వలు ఉన్నప్పుడు)… ధరలు పడిపోతున్నప్పుడు కొనేవారు తక్కువగా ఉంటారు…
అంతర్జాతీయ ఒత్తిడి….: అమెరికాలో వడ్డీ రేట్లు, డాలర్ విలువ పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది…. “గతంలో వెండి ధరలు పెరిగాయి కదా అని ఇప్పుడు అప్పులు చేసి మరీ వెండి కొంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.ప.. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం ఉత్తమం…”
Share this Article