.
Veerendranath Yandamoori …. ఒక వ్యక్తి స్టేడియంలో నిమ్మకాయ విసరడం, అదే సమయంలో వికెట్ పడటం- అని ఎడిట్ చెసిన ఫేక్ వీడియోతో, “మ౦త్రించిన నిమ్మకాయ విసిరితే వికెట్లు పడిపోయాయి” అని సోషల్ మీడియాలో ఒకరు పెట్టారు. ఈ సందర్భంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ జరిగిందా లేదా అనే విషయం తెలీదు.
ఇలాంటి సంఘటన వెన్నెల్లో ఆడపిల్లలో ఉంది. ఈ సంఘటనలో మానసికంగా క్రుంగిపోయిన రేవంత్ కి, రమ్య ఇచ్చిన స్ప్పూర్తిలో ‘జెన్’ ఫిలాసఫీ ఉంటుంది.
Ads
… … …
“నాకెందుకో తల తిరుగుతూ ఉంది” అని ఓడిపోయిన ప్రత్యర్థి రేవంత్ వైపు చూసాడు. అతడి దృష్టి ఫాంటు ఫ్రంట్ జేబు మీద పడింది. ఎత్తుగా ఎర్రటి మరక. ”అదుగో అదేమిటి” అని అరిచాడు. ఎవరో రేవంత్ నుంచి నిమ్మకాయ తీసుకుని దాని లోపల నిక్షిప్తమై ఉన్న గుండుసూదిని బైటకు లాగేరు. ఒక మూల ఎర్రగా ఉంది. అనుమానం వచ్చి పిండితే ఎర్రటి రక్తపు చుక్కలు పడ్డాయి.
రెఫ్రీ కూడా అప్రతిభుడయ్యాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. జనంలో కలకలం బయల్దేరింది. రేవంత్‌ని ఒక వింతమృగంలా చూడసాగేరు.
“గ్రాండ్ మాస్టర్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం క్షుద్రశక్తుల సాయంతో గెలుస్తున్న గ్రాండ్ మాస్టర్” అన్ని పేపర్లలో అవే వార్తలు.
ఈ సంఘటన రేవంత్ నిర్జీవమైపోతాడు. ఆ రాత్రి ఫోన్లో రమ్యతో, “చదరంగాన్ని నేనెప్పుడూ ఒక ఆటలా భావించలేదు” అంటాడు. “…అర్ధరాత్రి మెలకువ వస్తే ఒక ఋషిలా కప్పుకేసి చూస్తూ నైట్సునీ, రూక్స్‌నీ ఊహించుకొనే వాడిని. కుర్రవాళ్ళు హాయిగా అనుభవించే ప్రతి ఆనందాన్ని నా పన్నెండో ఏటే వదులుకున్నాను. ఈ శిఖరం చేరుకున్న తరువాత… ఇప్పుడు… కనీసం నావైపు చూపుడు సూటిగా వేలైనా సారించ తాహతు లేని అనామకులందరూ అవాకులూ చవాకులూ పెలుతున్నారు”.
అతడి గొంతు గద్గదికమైంది. అతడి బాధని అర్థం చేసుకుంటున్నట్టు ఆమె అంటుంది: ”మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాను కానీ, నాకెందుకో జపనీయుల తత్వశాస్త్రం గుర్తొస్తుంది. ‘ఉద్యోగమూ’ ‘తండ్రి కావటమూ’ లాటి తాత్కాలికమైన గెలుపులు సామాన్యుడి జీవితంలో ఉచ్ఛనీచ స్థాయీస్థితుల్ని నిర్మిస్తే, మహానుభావుల జీవితాల్లో సెల్ఫ్-కన్‌స్ట్రక్షన్, సెల్ఫ్-డిస్ట్రక్షన్‌లతో ఈ పరిణామ చక్రం బ్రద్ధలై విభిన్నరూపాలు చెంది, రేఖగా మారి ఎత్తుపల్లాలతో అత్యున్నతస్థాయికి చేరుకొంటుంది. అందుకే వారు గెలుపుని మర్చిపోయి ఓటమి నుంచి నేర్చుకుంటూ ఉంటారు.”
”ఇప్పుడు నేనేం చెయ్యను?” నిస్సహాయంగా అడిగాడు.
”ఏం చెయ్యలేరు? మీరు ఏదైనా చెయ్యగలరు. కొప్పు అంటూ ఉండాలే గానీ ఎన్ని సిగలైనా వెయ్చొచ్చు. మీ చేతిలో ఆట ఉంది. దాంతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టటం అంత కష్టమేమీ కాదు.”
ఆ తరువాత రేవంత్ బ్లైండ్ ఫోల్డ్ (కళ్ళకి గంతలతో పదిమంది ప్రత్యర్థులతో ఒకేసారి ఆడటం) ప్రకటిస్తాడు. గెలుస్తాడు.
“మీదపడే రాళ్ళతో దుర్గం నిర్మించుకోవటం” గురించిన ప్రస్తావన అక్కడే వేస్తుంది. ప్రార్థన సీరియల్ ప్రారంభంలో కవర్ పేజీ మీద అదే ఉంటుంది…. నిమ్మకాయ గురించి చదివితే, ఇద౦తా గుర్తొచ్చింది.
Share this Article