.
వేదాంత దేశికులు ….. రామానుజుల సిద్ధాంతాన్ని రక్షించుకున్న వారు వేదాంత దేశికులు! శ్రీవైష్ణవాన్ని దక్కించుకున్న వారు వేదాంత దేశికులు!! ఇది నిర్వివాదం… వేదాంత దేశికులు (1268-1369)… శ్రీ వైష్ణవంలో రామానుజాచార్యుల తరువాత మహోన్నత మూర్తి వేదాంత దేశికులు…
భారతదేశంలో ఆదిశంకరాచార్యుల వారి తరువాత విద్వత్ పరంగా అత్యంత మహోన్నతులు వేదాంత దేశికులు…
Ads
ఆదిశంకరుల సంస్కృతం గొప్పదా? వేదాంత దేశికుల సంస్కృతం గొప్పదా? సమాధానం అంత తేలికగా చెప్పలేం. (కొన్నేళ్ల క్రితం నా మిత్రులు, కొందరు పెద్దలతో కలిసి నేను ఈ ప్రశ్నకు సరైన సమాధానం కనుక్కోవాలని ప్రయత్నించి నా అపరిపక్వతను ఆరబోసుకున్నాను)
దేశంలో సంస్కృతాన్ని అత్యంత ఉన్నతంగా సంధించిన అత్యున్నతమైన మహనీయుల్లో అత్యుదాత్తమైన వారు వేదాంత దేశికులు. వేదాంత దేశికులు విరచించిన ‘రఘువీర గద్యమ్’ మనలో పలువురుకి పరిచయమైనదే. ఆ రఘువీర గద్యమ్ సంస్కృతం విస్మయానందాన్నిస్తుంది; వైదగ్ధ్య వైశేష్యావిష్కారం అది.
నిత్య ప్రత్యగ్ర ప్రభావకరమైనది ఆ రఘువీర గద్య!
ఎలా అయితే ఆదిశంకరులు సనాతనాన్ని రక్షించారో అలా వేదాంత దేశికులు శ్రీవైష్ణవాన్ని కాపాడారు. వేదాంత దేశికులే లేకపోయుంటే శ్రీ వైష్ణవం ఉండేదా? సందేహమే. తమిళ్ష్, మణిప్రవాళం, సంస్కృతం భాషల్లో వేదాంత దేశికులు పలు కృతులు సృజించి సమర్పించారు.
- వేదాంత దేశికులు ఒక మానవాద్భుతం; వేదాంత దేశికులు శ్రీవైష్ణవాభ్యుదయం. ఎలా అయితే మహావిష్ణువు ఖడ్గం మన అన్నమయ్య అయిందని చెప్పబడుతోందో అలా వేంకటేశ్వరుడి గుడిగంట వేదాంత దేశికులు అయిందని చెప్పబడుతోంది.
పదేపదే అదేపనిగా ఏవో పేలాపనలు చేస్తున్న ఏ సాంప్రదాయికత లేని ఒక పీఠం పీఠాధిపతి చిన్న జీయర్‌కు
శ్రీలశ్రీ వేదాంత దేశికులపై ఆలోచన, అవగాహన ఉన్నాయా? తన జీవనంలో వేదాంత దేశికుల నామస్మరణనైనా చిన్న జీయర్ చేశారా?

వేదాంత దేశికుల గురించి చిన్న జీయర్ చెప్పినదేమిటి? ఎప్పుడైనా వేదాంత దేశికుల గురించి చిన్న జీయర్ ఏమైనా చెప్పారా? చిన్న జీయర్ ఇకనైనా వేదాంత దేశికులను ఆపోసన పట్టాలి. వేదాంత దేశికుల వారిని 5, 10 శాతం చదివి ఉన్నా, ఇకపైన చదివినా ఇంకెప్పుడూ చిన్న జీయర్ ఇంత వరకూ చేసిన పేలాపనలు చెయ్యరు. చిన్న జీయర్ వేదాంత దేశికుల అనుయాయి కావాలి; చిన్న జీయర్ వల్ల శ్రీ వైష్ణవం పరువు పోకుండా ఉండాలి.
రామానుజులకే ‘తప్పుడు నామం’ దిద్దిన చిన్న జీయర్ వేదాంత దేశికుల స్ఫూర్తితో ఇకనైనా ఒప్పులోకి నడవాలి. శ్రీవైష్ణవం ఆత్మ రామానుజులు అయితే ఆచరణ వేదాంత దేశికులు. చిన్న జీయర్ మాత్రమే కాదు తెలుగు నాట ఉన్న తెన్‌గలై వైష్ణవులందరూ తమ జీవితాల్లో ఒక్కసారైనా వేదాంత దేశికుల వారిని ఆవాహన చేసుకోవాలి.
వేదాంత దేశికుల నిజ నామం ‘వేంకటనాథ’. ఇవాళ ఏ తెన్‌గలై వైష్ణవుడికైనా వెంకట్, వెంకటేశ్ వంటి పేర్లున్నాయి అంటే వాటికి మూలం ఇదిగో ఈ వేదాంత దేశికులే! వేదాంత దేశికులది వడగలై! కృతక వైష్ణవులు, వక్ర వైష్ణవులు వేదాంత దేశికుల వారిని ఆకళింపు చేసుకుని అధమ పక్షం మామూలు మనుషులుగా అయినా మారాలి… రోచిష్మాన్ 9444012279
Share this Article