Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

షావుకారు జానకి ! ఆ అన్నపూర్ణ ఎందుకు గుర్తొస్తున్నదీఅంటే !!

August 22, 2026 by M S R

.

Director Devi Prasad.C. … ఆప్యాయంగా తన చేతులతో స్వయంగా వంట చేసి పెట్టిన భోజనాన్ని ఆరగించినవాడిని.
ఆ మహాతల్లి షావుకారు జానకి గారి నిష్క్రమణ బాధే అయినా జీవితకాలం స్వాభిమానంతో బ్రతికిన ఆమె బ్రతుకు ధన్యం.

(ఆమె గురించి 2025 జనవరి లో నేను రాసిన పోస్ట్ మళ్ళీ షేర్ చేస్తున్నాను…)

Ads



కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో 1998 లో”దేవి” సినిమా షూటింగ్ హొగెనికల్ వాటర్‌ఫాల్స్ వద్ద జరుగుతుంది. నేను కో డైరెక్టర్.

వాటర్‌ఫాల్స్ నుండి అప్పటికప్పుడే చేపలుపట్టి ఫ్రై చేసిస్తుంటే టూరిస్టులు తింటుంటారక్కడ. అవెంత రుచిగా వున్నాయో తిన్న మా యూనిట్ సభ్యులు చెబుతుంటే విన్న సీనియర్ నటీమణి “షావుకార్ జానకి” గారు “అవేంటయ్యా నేను వండిన చేపలు తింటే తెలుస్తుంది మీకు అసలు టేస్ట్ “అన్నారు.

వెంటనే గురువు గారు చేయబోయే సీన్‌లో ఆమె చేపలు వొండుతున్నట్లుగా ఎట్మాస్ఫియర్ క్రియేట్‌చేసి షూట్ చేశారు. ఆమె నటిస్తూనే నిజంగానే అద్భుతంగా చేపల ఫ్రై చేసి అందరికీ పెట్టారు.

లొట్టలు వేసుకుని తిన్న అందరూ పని వొత్తిడిలో పడి రుచి ఎలావుందో చెప్పకపోవటంతో ఆమె “కష్టపడి చేసి పెడితే ఎలావుందో కూడా చెప్పరా” అని చిరుకోపం వ్యక్తం చేస్తూ “తల్లికైనా భార్యకైనా సరే నువ్వు చేసిన వంట బాగుంది అని చెబితే ఆవిడ ఎంత సంతోషిస్తుందో తెలుసా… అందులో మగాడికి పోయేదేముంది” అన్నారు.
తరువాత అందరూ చెప్పారనుకోండి.

అప్పుడు మేమంతా బాచ్‌లర్స్ కనుక మాకేమేమి ఇష్టమో అడిగి మరీ, ఓరోజు వారి ఇంటికి పిలిచి స్వయంగా వండి వడ్డించారు. నాటి గొప్ప నటులు దర్శకుల గురించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారు.

ఆమె నటీమణి అయిన తొలినాళ్ళలో ఆర్ధికపరిస్థితి వల్ల ఓరోజు ఆమెకు భోజనం లేక, షూటింగ్‌లో ఆత్మగౌరవంతో ఆ విషయాన్ని ఎవ్వరితోనూ పంచుకోక, కళ్ళుతిరుగుతున్నా అలాగే నటించిన సందర్భం చెప్పినప్పుడు మాకు కళ్ళుచెమ్మగిల్లాయి. అందుకే ఎవరికైనా కడుపునింపటం తనకు సంతృప్తినిస్తుందని చెప్పేవారు.

మహా అయితే నేనింకో నాలుగయిదేళ్ళు వుంటానేమో అప్పటివరకూ నేనే వండిపెడతాను అని ఆనాడు అన్న ఆ మహాతల్లి ఇప్పటికీ 93 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా వున్నారంటే ఆమె స్వచ్ఛమైన మనసు, పదిమందికీ ఆప్యాయతతో కడుపునింపే ప్రేమ తత్వమే కారణం అనుకుంటాను. ప్రతిభలోనూ, మనుషులుగానూ ఆ తరంవారెంత గొప్పవారో అనిపిస్తుంది. _____ దేవీప్రసాద్.



నువ్వే చెప్పిన ఆ నాలుగైదేళ్లూ ఉండకపోయావా అమ్మా, నూరేళ్ల నిండు జీవితం పరిపూర్ణమయ్యేది…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions