Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్… నటి రాధిక చెప్పిన ఓ సిగ్గు కథ… ఎంత మురిపెంగా ఉందో…

March 16, 2026 by M S R

.

రాధిక… అవును, రాధిక శరత్ కుమార్… పరిచయం అక్కర్లేని పేరు… యూరేకా తకమికా దగ్గర నుంచి మనసు పలికే మౌనగీతం దాకా… అభిలాష నుంచి స్వాతికిరణం దాకా… ఎన్ని పాత్రలు, ఎన్ని మంచి సినిమాలు… ఆమే ఎక్కడో చెప్పినట్టు SHE IS BLESSED…

రీసెంటుగా ఓ ముసలమ్మ పాత్రలో ప్రోస్థటిక్ మేకప్ కోసం రోజూ గంటల తరబడీ కష్టపడిన తాయ్ కిళవి పాత్ర గురించి చెప్పుకున్నాం కదా… సూపర్ హిట్ మూవీ… జస్ట్, రాధికే దానికి కారణం… పవునుతాయ్ అని ఓ ముసలి లేడీ వడ్డీ వ్యాపారి పాత్రలో అదరగొట్టింది కదా… (యురేకా పాటలో చిరంజీవి ఎగురుతాడు, దుంకుతాడు, కానీ రాధిక రొమాంటిక్ నవ్వుతో అలరిస్తుంది, ఇక స్వాతిముత్యం, స్వాతికిరణం అల్టిమేట్ నటన… రాధిక కెరీర్‌లో అన్‌ఫర్‌గెటబుల్…)

Ads

ఈమధ్య జీతెలుగులో ఆట అని ఓ డాన్స్ షో వస్తోంది కదా, దానికి ఆమె జడ్జి.. నిజానికి ఆ పాపులర్ తమిళ టీవీ ప్రొడ్యూసర్ తెలుగు టీవీ షోలో జడ్జిగా రావడమే విశేషం… తన పాత సినిమా అనుభవాల్ని షేర్ చేసుకుంటోంది… ఆసక్తికరంగా ఉంటున్నాయి కూడా… రీసెంటు ఎపిసోడ్‌లో ఆమె చెప్పుకున్న ముచ్చట్లు బాగున్నాయి… ఏ హిపోక్రసీ లేకుండా…

https://www.facebook.com/reel/1335049905096266

‘‘భారతీరాజా గారు, హీరోయిన్ల ఎంట్రీయో, పాటలోనో ఓ స్టాండర్డ్ ఎక్స్‌‌ప్రెషన్ షూట్ చేస్తారు… ( చేసి చూపించింది)… అది సిగ్గును అభినయించాలి, నాకేమో సిగ్గు తెలియదు… ఏమిటమ్మా అంటే, ఐ డోన్ట్ నో సిగ్గు అన్నాను… చాలాకష్టపడ్డాను, కుదరలేదు, చివరకు ఓ పెద్ద కర్ర తీసుకుని నా నడుములో కుచ్చితే నేను ఉఊ అని ఏదో సిగ్గుపడ్డట్టు కనిపించాను, దాంతో సర్దుకున్నాడు ఆయన…

అదే కాదు, నాకు తెలియని మరో ఉద్వేగం ఉంది… కంటిరెప్పలు టపటపా కొట్టుకోవడం, కళ్ల ఎదుట పావురం రెక్కలు, కవితాత్మకంగా షూట్ చేయాలి, తప్పకుండా చేయాలి, కానీ నావల్ల కాలేదు.., వద్దులే, రిస్క్ వద్దు అని ఎలాగోలా వాళ్లే కష్టపడ్డారు… మరొకటి, నేను శవంలా చేయలేను, పడుకోగానే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది… అది కుదరదు, దర్శకులే వాళ్ల తిప్పలు వాళ్లు పడ్డారు…’’ ఇలా సాగింది ఆ లెజెండరీ నటి వెర్షన్…

రాధిక

గ్రేట్… ఏమీ దాచుకోలేదు, గొప్పలు చెప్పుకోలేదు, క్వయిట్, గ్రేస్… అసలు ఆమెకు వేరే సర్టిఫికెట్లు అవసరమా..? నిజానికి శ్రీదేవి, జయప్రదలు కూడా సిగ్గును సరిగ్గా అభినయించకపోతే మేమే నానా తిప్పలు పడి, ఎలాగోలా ఆ ఫీల్ చూపించేవాళ్లమని పలువురు దర్శకులు చెప్పడం కూడా చూశాం కదా…

సిగ్గు… ప్రపంచంలోకెల్లా సిగ్గు అనేది భారతీయ మహిళకు ఓ ఆభరణం… సిగ్గు అంటే ఏదో తప్పు చేసిన ఉద్వేగం కాదు… రొమాన్స్, చిన్నతనం, గారాబం, మురిపెం వంటివి ఎన్నో… రాస్తూ పోతే అది ఓ ఉద్గ్రంథం… ఐనా సరే, సమగ్రంగా చెప్పగలమా అంటే అదీ డౌటే… (ఇది సిగ్గూశరం బాపతు తప్పుడు సిగ్గు కాదు)… అది ఒక ఇండియన్ లేడీకే తెలిసిన ‘విశిష్ట ఉద్వేగ ప్రదర్శన’.,..

‘సిగ్గు’ (Shyness/Coyness) అనేది కేవలం ఒక ఎక్స్‌ప్రెషన్ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి… పాశ్చాత్య దేశాల్లో రొమాన్స్ అంటే నేరుగా వ్యక్తపరచడం ఉంటుంది, కానీ మన దగ్గర ఆ ‘ముసిముసి నవ్వులు’, ‘కాలి వేలితో నేలపై రాతలు’, ‘చూపులు పక్కకు తిప్పుకోవడం’—వీటిలోనే అసలైన శృంగారం, మురిపెం దాగుంటాయి… అఫ్ కోర్స్, ఇప్పుడు ఆ సిగ్గులన్నీ సిగ్గు లేకుండా వదిలేసుకుంటున్నారు, అది వేరే సంగతి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!
  • గ్రేట్ నికోబార్… దేశరక్షణ అవసరమే… కానీ ఏ మూల్యానికి..? (రెండో పార్ట్)…
  • గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు… రుతుపవనాల తీరునూ దెబ్బ తీయబోతోందా…
  • నో, నో… అన్నా మలై బుద్దిలేని బొద్దింక కాదు… తన రూటే సపరేట్…
  • ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!
  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions