Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…

June 3, 2026 by M S R

.
Subramanyam Dogiparthi …. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడబుధ్ధి వేస్తాయి . అంతే కాదు . ప్రతిసారీ ఆ సినిమాతో మమైకం అయిపోతాం . అలాంటి సినిమాలలో ఒకటి ఈ సుందరకాండ సినిమా . సినిమా అంతా రోజా పాత్రలో నటించిన అపర్ణే . ఆ అల్లరి , తప్పో ఒప్పో మాస్టారిని ఆరాధించటం , చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించటం .

ఆ పాత్రను సృష్టించిన తమిళ దర్శకుడు భాగ్యరాజాని ముందుగా అభినందించాలి . ఆ పాత్రను తమిళంలో సింధుజ ఎలా నటించిందో నాకు తెలియదు . కానీ , మన తెలుగులో అపర్ణని కాకుండా మరొకరిని ఊహించుకోలేం కూడా . ఆమెకు ఇదే మొదటి సినిమా . దర్శకేంద్రుడు గొప్పగా ఐడెంటీఫై చేసారు .

సినిమాకు షీరో ఆమే . అలా అని వెంకటేష్ , మీనాల నటనను తక్కువ చేయలేం . బాధ్యత కల మాస్టారుగా , మనసు కల ఒక మనిషిగా వెంకటేష్ గొప్పగా నటించాడు . అమాయక భార్యగా మీనా అద్భుతంగా నటించింది . అలా ఈ సినిమాకు ఓ షీరో , ఓ హీరో , ఓ హీరోయిన్ ఉన్నారు .

Ads

తమిళంలో హిట్టయిన సుందరకాండం అనే సినిమాకు రీమేక్ మన సుందరకాండ . తమిళంలో భాగ్యరాజా , భానుప్రియ , సింధుజ నటించారు . హిందీలోకి అందాజ్ టైటిలుతో రీమేక్ అయింది . అనిల్ కపూర్ , జూహి చావ్లా , ఖరిష్మా కపూర్ లీడ్ రోల్సులో నటించారు . కన్నడంలోకి సుందరకాండ అనే టైటిలుతోనే రీమేక్ అయింది . అందులో శివ రాజ్ కుమార్ , సుజిత , రోజా నటించారు .

బహుశా ఈ సినిమా చూడనివారు ఎవరూ ఉండరు . చాలా తరచుగా టివిలో ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . తాను చదువుకున్న జూనియర్ కాలేజీకే తెలుగు మాస్టారిగా వచ్చిన వెంకటేశ్వర్లుని అన్నింటిలో టాపర్ అయిన రోజా ప్రేమించేస్తుంది . ఆరాధించేస్తుంది . చివరకు వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు వదులుతుంది .

ఈ సినిమా ఓ మ్యూజికల్ వండర్ . అద్భుతమైన సంగీతాన్ని అందించారు కీరవాణి . ముఖ్యంగా ఐకానిక్ సాంగ్ ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకే . ఈ పాటకు వేటూరి వారికి నంది అవార్డు కూడా వచ్చింది . ఈ పాటలో ఎంత వేదాంతం ఉందో అంతే సుందరంగా , ఆర్ద్రతతో చిత్రీకరించారు రాఘవేంద్రరావు . Hats off to all of them .

సుందరాకాండకు సందడే సందడి కాలేజీలో అందరూ కలిసి పాడే పాట చాలా హుషారుగా సాగుతుంది . అలాగే మరో పాట ఉలికి పడకు కుకుకుకు పెదవి కలిపేందుకు వెంకటేష్ , అపర్ణ మీద బాగుంటుంది . ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా అంటూ సాగే డ్యూయెట్ వెంకటేష్ , మీనా మీద రాఘవేంద్రరావు స్టైల్లో ఉంటుంది . అలాంటిదే మరో పాట కోకిలమ్మ కొత్త పాట పాడింది కూనలమ్మ కూచిపూడి ఆడింది . శ్రావ్యమైన పాటల్ని అందించిన బాలసుబ్రమణ్యం , చిత్రను ప్రత్యేకంగా అభినందించాలి . ప్రభుదేవా , తార డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .

ఇతర ప్రధాన పాత్రల్లో ముఖ్యమైనది బ్రహ్మానందం పాత్ర . వెంకటేష్ క్లాస్ మేట్ అతనికే విద్యార్ధి కావటం . ఇతర ప్రధాన పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు , కోట శ్రీనివాసరావు , హేమా చౌదరి , నిర్మలమ్మ , తదితరులు నటించారు . నిర్మాత కె వి వి సత్యనారాయణ . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసినా మళ్ళా చూడొచ్చు . It’s a romantic musical splendour .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!
  • ‘పొంతన’ కుదరని ‘గుణాలు ! అన్నీ బాగున్నా ఇన్ని విడాకులేమిటి మరి !?
  • మోక్షమార్గానికి ముందే ‘సైజ్ చెకింగ్ గ్రిల్స్’… అది దాటితేనే మోక్షం!!
  • ఎడాపెడా ఎయిర్‌పోర్టులు ! కొన్నింటికి విమానాల్లేవు- ప్రయాణికుల్లేరు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions