Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు బుల్లితెరపైకి సోనీ… స్టార్‌మా, జీతెలుగు చానెళ్లకు పోటీ…

March 11, 2026 by M S R

.

తెలుగు బుల్లితెరపై ‘సోనీ’ యుద్ధం… స్టార్ మా, జీ తెలుగులకు అసలైన సవాల్‌… రేటింగ్స్ లెక్కలు మారుతాయా? తెలుగు టెలివిజన్ రంగం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు వద్ద ఉంది…

దశాబ్దాలుగా డామినేట్ చేస్తున్న తెలుగు వినోద ఛానళ్లకు పోటీగా మరో పాపులర్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ సోనీ టీవీ తెలుగులోకి వస్తోంది… గతంలో ఈటీవీ బ్రాండ్ ఫేమస్… కానీ ఇప్పుడు స్టార్ మా, జీ తెలుగు చానెళ్ల నడుమే అసలు పోటీ ఉంది… నిజానికి పేరుకు రంగంలో నాలుగు శాటిలైట్ వినోద చానెళ్లున్నా… జెమిని టీవీ ఎప్పుడో పోటీ నుంచి తప్పుకుంది…

Ads

తరువాత కాలంలో ఈటీవీ రేటింగ్స్ కూడా దెబ్బ తిని, జెమిని టీవీకి పోటీ ఇస్తోంది ఇప్పుడు… వాస్తవానికి స్టార్ మా టీవీ దేశంలోనే నంబర్ వన్ ప్లేసులో ఉంది ఇప్పుడు… దానికి దీటైన పోటీ ఇవ్వాలంటే అది సోనీ టీవీతోనే అవుతుందని చాలామంది అనుకుంటారు… అనుకున్నట్టుగా సోనీ టీవీ తెలుగు ఎడిషన్ స్టార్ట్ చేస్తోంది… దాని పేరే సోనీ తెలుగు చానెల్… ఇప్పుడు తెలుగు టీవీల నడుమ అసలైన పోటీ ఏర్పడనుంది…

సోనీ తెలుగు

ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న ఈటీవీ, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్‌ను మార్చడంలో వెనుకబడింది… ఒకప్పుడు దానిబలం రియాలిటీ షోలు, అవీ దెబ్బతినడంతోపాటు దాని సీరియల్స్ నాణ్యత ప్రేక్షకులకు నచ్చకపోవడంతో రేటింగ్సులో దెబ్బతినిపోయింది…

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ (Urban) , రూరల్ (Rural) ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో స్టార్ మా (Star Maa) నెంబర్ వన్ స్థానంలో ఉండగా, దానికి జీ తెలుగు (Zee Telugu) ఎంతో కొంత పోటీ ఇస్తోంది… ఇదుగో తాజా చిత్రం…

తెలుగు టీవీ

సోనీ తెలుగు – అసలైన వ్యూహం… ఈ సోనీ నెట్‌వర్క్ ఇప్పుడు కేవలం ఒక ఛానల్‌ను ప్రారంభించడం మాత్రమే కాకుండా, నేరుగా ఈ రెండు దిగ్గజాల మార్కెట్ వాటాను (Market Share) టార్గెట్ చేస్తోంది… తెలుగు టీఆర్పీల ప్రాధాన్యం తెలుసుకుంది…

  • డబ్బింగ్ కంటెంట్‌కు స్వస్తి…: సోనీ గతంలో కొన్ని డబ్బింగ్ ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు… అందుకే ఈసారి ఆగస్టు 1 నుండి ప్రారంభం కాబోయే ఛానల్‌లో 100% స్ట్రెయిట్ తెలుగు కథలను, భారీ నిర్మాణ విలువలతో తీసుకురానుంది…

  • రియాలిటీ షోల అస్త్రం..: స్టార్ మాకు ‘బిగ్ బాస్’, జీ తెలుగుకు ‘సరిగమప’ వంటి బలమైన షోలు ఉన్నాయి… వీటికి దీటుగా సోనీ తన అంతర్జాతీయ ఫార్మాట్ అయిన KBC (కోటీశ్వరుడు) ని ఒక క్రేజీ స్టార్ హీరోతో లాంచ్ చేసి, ప్రారంభంలోనే భారీ ఓపెనింగ్స్ సాధించాలని చూస్తోంది… (గతంలో ముగ్గురు స్టార్ హీరోలు ఈ షోను తెలుగులో చేసినా ఎవరూ క్లిక్ కాలేదు, రంజింపచేయలేదు…)

క్లిక్కయితే సమీకరణాలు మారతాయా? సోనీ వద్ద ఉన్న భారీ బడ్జెట్, టెక్నికల్ స్టాండర్డ్స్ ఒకవేళ తెలుగు నెటివిటీకి సరిగ్గా సింక్ అయితే, అది స్టార్ మా, జీ తెలుగు టీవీల రేటింగ్ బ్యాంకులను చీల్చడం ఖాయం… ముఖ్యంగా యువతను, ఆధునిక ఆలోచనలు ఉన్న కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సోనీ తన ప్రోగ్రామింగ్‌ను డిజైన్ చేస్తోంది… నిజానికి స్టార్ మా, జీ తెలుగు బలం సీరియళ్లు…

నెలకు ₹19 ధరతో, క్వాలిటీ కంటెంట్‌తో సోనీ వస్తుండటం పాత ఛానళ్లకు హెచ్చరిక లాంటిదే… ఒకవేళ సోనీ అనుకున్నట్లుగా రేటింగ్స్ సాధిస్తే, తెలుగు బుల్లితెరపై మళ్ళీ ‘ముక్కోణపు పోటీ’ మొదలవుతుంది… ఈ పోటీలో అంతిమంగా లాభపడేది ప్రేక్షకులే, ఎందుకంటే పోటీ పెరిగేకొద్దీ మరింత నాణ్యమైన వినోదం అందుబాటులోకి వస్తుంది… కమాన్ సోనీ, వెల్‌కమ్…

జాతీయ స్థాయిలో ఇవీ టాప్ చానెళ్లు… (తాజా రేటింగ్స్)… టాప్ సెవన్‌లో రెండు తెలుగు వినోద చానెళ్లు… అదీ తెలుగు రేటింగులు, రీచ్ ప్రయారిటీ…

1 STAR Maa 2540.75
2 STAR Utsav 2346.98
3 STAR Sports 1 Hindi 1981.58
4 Sun TV 1843.6
5 SONY SAB 1810.91
6 STAR Plus 1611.39
7 Zee Telugu 1597.45
8 Dangal 1525.77

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికాలో రిలయెన్స్ రిఫైనరీ… ఆయిల్ మార్కెట్‌లో సంచలనం…
  • తెలుగు బుల్లితెరపైకి సోనీ… స్టార్‌మా, జీతెలుగు చానెళ్లకు పోటీ…
  • ‘‘స్వాతిముత్యపు జల్లులలో….’’ ఈ పాటొక్కటే సినిమాలో చూడబుల్…
  • ‘నీ దుకాణం మూసుకుంటావా’… నమస్తే తెలంగాణకు బిగ్‌ టీవీ సవాల్…
  • సిందూర్ దెబ్బ… రిపేర్లూ కష్టమై ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ కూల్చివేత…
  • కక్కు- కిక్కు…! సర్కారు సారా Vs చీప్ లిక్కర్…! ఏ భూతం తక్కువ డేంజర్…?!
  • మళ్లీ ఏదో కూశాడు… ఇక మారడు, సైకియాట్రిస్టులే శరణ్యం…
  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…
  • నేపాలీ సెన్సేషన్… ఓ ఆయుర్వేద డాక్టర్ కొడుకు, ఓ ర్యాపర్… ఎవరితను..?!
  • తర్జుమాలే ఉద్యమంగా! … Tribute to Mukthavaram Pardhasaaradhi ….

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions