Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘చూడు కమల్.., నీ చేతినీ, నా చేతినీ పోల్చి చూడు… ఎంత తేడా ఉందో…’’

March 10, 2026 by M S R

.

రాహుల్ అని మా అబ్బాయి… రెండున్నరేళ్లు ఉంటాయి వాడికి అప్పటికి… లాలీ లాలీ అని నేను పాడుతుంటే, వాడు ఓసారి నావైపు చూశాడు… మమ్మీ, నేను పడుకుంటాను కానీ, ప్లీజ్ ఈ పాట మటుకు పాడకు అన్నాడు…

తరువాత రోజు నేను ఇదే పాట హమ్ చేస్తుంటే… నా వెనుక ఉన్న కమలహాసన్ నా నెత్తి మీద ఒక్కటిచ్చాడు… శృతీ లేదు, మన్నూ లేదు, కాస్త నోరు మూస్తావా అన్నాడు.,.

Ads

సువ్వీ సువ్వీ పాట కోసం రాజమండ్రికి వెళ్లాం, అక్కడి నుంచి దూరంగా నీళ్ల మధ్యలో చిన్న ద్వీపంలా ఉంటుంది ఓ చోట… అక్కడికి వెళ్లాక విశ్వనాథ్‌కు ఓ ఆలోచన వచ్చింది…. కమలహాసన్ ట్రెయిన్డ్ డాన్సర్ కదా…  కానీ..?

‘‘నువ్వు శృతి తప్పి డాన్స్ చేయాలి’’ అని చెప్పాడు విశ్వనాథ్… 3 రోజులపాటు షూటింగులో ఉన్న లైట్ ‌మెన్ దగ్గర నుంచి అందరినీ డాన్స్ చేయమని అడిగాడు ఆయన … ఎవరు తప్పు చేసినా, ఆ మూమెంట్ పట్టుకునేవాడు ఆయన…

మూడు రోజుల తరువాత కమలహాసన్‌కు వెలిగింది దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో… అది వన్ బీట్ లెస్… సువ్వీ సువ్వీ పాట స్టెప్స్ అలా పుట్టాయి… తరువాత మైసూరు పోయాం, అక్కడ మనసు పలికే మౌనగీతం పాట…

నేను కమల్‌ను వెనుక నుంచి పట్టుకుని పాడినట్టు యాక్ట్ చేయాలి, కుదరడం లేదు… నీకూ కమల్‌కూ ఏమైనా గ్యాప్ ఉందా, దేహపు వాసన ఏమైనా వస్తోందా అనడిగాడు విశ్వనాథ్… నో, నో, రాధికతో నాకేమీ ప్రాబ్లం లేదు అన్నాడు కమల్… ఏదో ఉంది అంటూ బ్యాగులో నుంచి దర్శకుడు ఓ స్ప్రే తీశాడు… నిజానికి అది పర్‌ఫ్యూమ్ కాదు, ఏదో షేవింగ్ క్రీమ్…

సర్, నాకేమీ ప్రాబ్లం లేదు అంటూనే ఉన్నాను… కానీ విశ్వనాథ్ వోకే వోకే షూట్ చేద్దాం అని స్టార్ట్ చేశాడు… తరువాత రోజు కమల్ నన్నడిగాడు సీరియస్‌గా… నిజంగా నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా… అప్పుడు నేను చెప్పాను… ఓసారి చేయి చాపండి…

నా చేయి పక్కన పెట్టి, నీ చేయి తెల్లగా, నాదేమో నల్లగా… నా ఫేస్‌కన్నా నా చేయి మూడు రెట్లు డార్క్ ఉంది… పట్టుకుంటే నాకే అసహ్యం అనిపిస్తోంది సర్ అన్నాను… థూ, ఇన్నేళ్ల తరువాత నువ్వు, ఇంత సీనియర్, కలర్ గురించి మాట్లాడతావా అన్నాడు…

తరువాత అన్నీ సెట్టయ్యాయి… సినిమా సూపర్, బంపర్ హిట్……… ఇదీ జీటీవీలో వచ్చే ఆట షోలో జడ్జిగా ఉన్న రాధిక చెప్పుకొచ్చిన మాటలు… https://www.facebook.com/reel/709027675630171 

కొన్ని తెర వెనుక విషయాలు సంబంధిత వ్యక్తులే చెబుతుంటే బాగుంటుంది... ఇదీ అలాంటిదే...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!
  • పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?
  • ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!
  • హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?
  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions