Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే అడ్డదిడ్డం కథ- అమితాబ్‌కు ఎందుకు నచ్చిందో మరి…

June 18, 2026 by M S R

.

Priyadarshini Krishna … అప్పట్లో రాసిన రివ్యూ లాంటిది….
కొత్త మిత్రులకోసం మాత్రమే కాదు, పాత మిత్రులు కూడా మళ్లీ చదివి నవ్వుకోండి ……

మళ్లీ ఇంకో సినిమా నన్ను మోసం చేసింది. 150/- వృధా ఐపోయాయి. అమితాబచ్చన్ సైతం ఆహాఓహో అన్న సినిమా మరేంటో గానీ నాకు నచ్చలేదు.
నిజానికి అసలు అందులో కథే లేదు ‘హమారీ అధూరి కహాని‘ అనేకంటే ‘బిన్ కహాని’ అనగా కథ లేని కథ మళ్లీ ఇంకో సినిమా నన్ను మోసం చేసింది. 150/- వృధా ఐపోయాయి. (2015 నాటి సినిమా, మెయిన్ ఓటీటీల్లో కూడా లేదు)

Ads

అమితాబచ్చన్ సైతం ఆహాఓహో అన్న సినిమా ఎందుకో గానీ నాకు నచ్చలేదు.
నిజానికి అసలు అందులో కథే లేదు ‘హమారీ అధూరి కహాని’ అనేకంటే ‘బిన్ కహాని’ అంటే చాలా aptగా వుండేది.
సినిమా ఓపెనింగ్ సీన్ నుంచీ ఇంటర్వెల్ వరకూ కథ అన్నది మచ్చుకు కూడా కనపడలేదు. సర్లే సెకండ్ హాఫ్ లో ఉంటుందేమో అని కళ్ళు విప్పార్చి, చెవులు రిక్కించి మరీ ఎదురుచూసా.

ఫస్ట్ హాఫ్ అంతా అందమైన అలంకరణ చేసిన రూమ్స్ లొకేషన్స్ , బెదురు చూపులు చూసే విద్యాబాలన్ తో నింపేసారు.
ఇక రెండో భాగంలో కూడా కథ అనే ‘బ్రహ్మపదార్థం’ ఎక్కడా లేదు. దానికోసం ఎదురుచూడటం వృధా అని ఒక పది నిముషాలకిగానీ అర్థం కాలేదు.

ఇంతకి ఈ సినిమాలో ఏముంది అంటే – పాత చింతకాయ పచ్చడి లాంటి సతీ సావిత్రి, మొగుడు నక్షలైట్ అని పోలీసులు ముద్రవేసినా నల్లపూసలే నాధునిగా భావించి బతికేస్తుంది. ఇంతలో మన ఇమ్రాన్ ప్రేమిస్తున్నా అంటూ ఎంటర్ అవుతాడు. అన్ని పాత చింతకాయ సినిమాల్లాగే వీరిద్దరూ ఏకమవుతున్న సమయంలో సదరు మొగుడు గారు ఎంటర్ వుతాడు.

ఇంతలో ఆ భర్త గారిని పోలీసులు పట్టుకుంటారు. ఇక మన విద్యాబాలన్ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి, భర్తను విడిపించుకోడానికి ప్రియుని సాయం కోరుతుంది. తన అమితమైన ప్రేమను నిరూపించుకునే మహాదావకాశం ఇదే అని అతగాడు ఆ విధంగా ముందుకు పోయి ప్రియురాలి భర్తను విడిపించే అధారాలు సేకరించి చివరికి పొరపాటున గ్రహపాటున ఏమరుపాటున నక్షలైట్లు పాతిన ల్యాండ్ మైన్ మీద కాలేసి అమరుడైపోతాడు.
భర్త గారు నిరపరాధిగా విడుదలవుతాడు!

చిట్టచివర్లో వచ్చే సీన్ కోసం ఆ సీన్ లో డైలాగ్ కోసం విద్యాబాలన్ నిర్జీవమైన నటన కోసం రెండుగంటల సోది భరించాల్సిందా అని మనం realise అయ్యేసరికి end titles పడుతుంటాయి.
ఇదీ విషయం…!!!!

PS: ఇమ్రాన్ హాష్మి వున్నాడు కదా అని హడావిడిగా వెళ్లినవారికి టికెట్ డబ్బులు ఏమాత్రం గిట్టుబాటు కాలేదు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కృష్ణ నిజంగా సాహసి – మొండి … అందుకే ఎన్టీయార్‌తో ఢీకొట్టాడు…
  • ఈ మీసం ఫోటో గుర్తుంది కదా! – కేటీయార్ జుట్టు దొరికినట్టేనా..?!
  • ఇంతమందికి ఉరి ఇదే తొలిసారి! సరైన తీర్పు- ఇప్పటికే లేటైంది!!
  • సబాంగ్ పోర్ట్! చైనా సముద్ర వ్యూహాలకు ఇండియా తెలివైన చెక్!
  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions