Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’

March 1, 2026 by M S R

.

ప్రస్తుతం తెలుగు పాఠకుల్లో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు, ఆ వీడియో ఇక్కడ పెట్టలేం… కానీ ఆ పెద్దాయనతో సన్నిహితంగా కనిపిస్తున్న ఆమె ఎవరు..? ఆమె ఎవరో, పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో, ఈయనకు ఆమె ఏమవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు… కానీ యాంటీ- టీడీపీ సెక్షన్  మాతరం బలంగా జనంలోకి వీటిని తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నట్టుంది… ఎందుకు..?

చూశారా..? అనైతిక బంధాల ఈ పెద్ద మనిషిని ఏకంగా అంతటి బలమైన, పెద్ద ధార్మిక సంస్థకు పెబ్బను చేశాడు చంద్రబాబు అని బాగా బదనాం చేయడానికి కావచ్చు… లడ్డూ సహా అనేక విషయాల్లో జగన్ అండ్ కో వెంకన్నకు, హిందూ ఆధ్యాత్మిక ప్రపంచానికి నిస్సిగ్గుగా చేసిన మహా నిర్వాకాల నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం కూడా కావచ్చు… కానీ ఇరాన్ సంచలన వార్తల నేపథ్యంలో కూడా ఈ వీడియో, ఈ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి…

Ads

ఏమో… అదే యెల్లో గ్యాంగులో ఆధిపత్యాలు, విధేయతల పోరులో పరస్పరం పడని కేరక్టర్లు ఉంటాయి కదా, అందులో భాగంగా సాగుతున్న బదనాం ప్రచారం కూడా కావచ్చు… ఏమో, ఆల్రెడీ మొదలైన కౌంటర్ ప్రచారాల్లో చెబుతున్నట్టు ఎఐ బాపతు క్రియేషన్ కూడా కావచ్చు .. ఐనా నడవడమే కష్టంగా ఉందాయనకు, ఈ ప్రచారాలతో జనంతో వచ్చే నెగెటివిటీ ఏముంటుంది… (ఎన్.డి. తివారీని మాత్రం ఏమైనా వదిలారా అంటారా..?) సరే, ఈ వాదనల్ని అలా వదిలేస్తే… ( ఆ చానెల్ ప్యూర్ పచ్చదనం, అపాత్రికేయం, పడని వ్యక్తుల్ని ఆ స్టాఫ్ టార్గెట్ చేసే తీరు మాత్రం డిబేటబులే…)



ఆ వీడియో, ఆ ఫోటోలు చూడగానే గుర్తొచ్చింది ఏమిటో తెలుసా..? అదుర్స్ అని జూనియర్ ఎన్టీయార్ బాపతు ఓ సూపర్ హిట్ సినిమాలో బ్రహ్మానందం వేసిన పాత్ర, తన సీన్లు, ఆ డైలాగులు… తను వృత్తిపరంగా అర్చకుడు… ఓ వితంతువు బిడ్డల మీద కన్నేసి, ఆమెను చేరదీసి, ఆర్థికంగా ఆదుకుంటూ ల్యూర్ చేసే ప్రయాసలో ఉంటాడు…

తోటి అగ్రహారీకులేమో  ఆ భర్తపోయిన వితంతువును బ్రహ్మానందం ఔదార్యంతో, ఆదర్శంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడేమో అని అపార్థం చేసుకుంటారు పాపం… చివరకు నిజం తెలిసి ఛీత్కరిస్తారు… అక్కడ ఓ ఫేమస్ డైలాగ్…

  • ‘‘ఏం తప్పేంటి..? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు… వాళ్ల కష్టసుఖాల్ని పంచుకున్నాడు..,. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్దావిడను కట్టుకుని ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలని అనుకోవడం తప్పా..?’’

అదుర్స్

  • ఆ వితంతువు రమాప్రభ సిగ్గుపడుతుంది… ‘‘ఛిఛీ, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది’’ అని బ్రహ్మానందానికి ఏడుపొక్కటే తక్కువ…

సరే, ఆ సీన్ ఈ సీన్ ఒకటని కాదు… ఒకటని కూడా ఇక్కడ చెప్పడం లేదు… ఇక విషయానికి వద్దాం… సదరు పెద్దాయన మీద పెద్దగా ఎవరికీ సదభిప్రాయం కూడా ఏమీ లేదు… అరచేతుల్లో వెంట్రుకలు మొలిపించే ఉత్పత్తుల్ని అమ్మినప్పుడే తెలిసిపోయింది తనేమిటో… తన చానెల్‌లో డిబేట్ ప్రజెంటర్ల కామెడీ వ్యాఖ్యలు సరేసరి… చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు… వయస్సు కూడా 70 ఏళ్లు దాటి ఉంటుందేమో చూడబోతే…

కానీ తనేమీ ప్రజాజీవితంలో లేడు… ఈ వ్యక్తిగత అప్రతిష్ట ప్రచారాలతో తనకు, చంద్రబాబుకు, ఆ పార్టీకి జరిగే నష్టమూ పెద్దగా ఉండదు… అంతెందుకు..? ఈ చానెల్ అంటే అస్సలు పడని అదే యెల్లో గ్యాంగుకు చెందిన మరో మీడియా పెద్ద మనిషి కూడా భార్య చనిపోయాక, ఓ డాక్టర్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి… ఏమైంది..? ఎవరూ పట్టించుకోలేదు… అవి వ్యక్తిగతాలు… (ఇదే జగన్ మూడు పెళ్లిళ్ల పెద్దమనిషి అని ఆక్షేపించిన పవన్ కల్యాణ్‌కు ఏమైనా నష్టం జరిగిందా..? లేదు కదా..!)

అంత ఏల..?  అంత పెద్ద ఎన్టీయారుడే, తన సొంత పిల్లలు అందరున్నా సరే, ఎవరూ పట్టించుకోని ఆ ముసలి వయస్సులో లక్ష్మిపార్వతిని పెళ్లి చేసుకోలేదా పాపం..? జనం కూడా ఆమోదించారు కదా… సరే, ఆమె ‘ఓవరాతి యాక్షన్’ చేసి మొత్తం పచ్చ రాజకీయాల్లోనే చిచ్చు పెట్టింది, అది వేరే కథ… ఒక పచ్చ నాయుడు, తనకు అండగా నిలబడిన ఒక పచ్చ అధి నాయకుడు… నాలుగు రోజుల దుమారం… తరువాత సైలెన్స్… ఎన్ని చూడలేదు..?!

ఆల్రెడీ సారు గారు అదంతా ఎఐ క్రియేషన్, రాజకీయ దురుద్దేశం, తప్పుడు ప్రచారం, సైబర్ క్రైం వాళ్లకు ఫిర్యాదు చేశాను, దుష్టశక్తుల్ని వదిలేది లేదు అని కౌంటరిస్తూ ఖండించాడు...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”
  • తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions