.
- భారత అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు…అలెగ్జాండ్రా హెర్మాన్, Oxford Economics!
- వాణిజ్య ఒప్పందాలు కానీ, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల విషయంలో కానీ అమెరికా భారత్ మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితులు లేవు…. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటో భారత్ నిర్ణయించగలదు కానీ అమెరికా కాదు.. .టకర్ కార్ల్సన్ ( Tucker Carlson) అమెరికన్ జర్నలిస్ట్!
- – భారత దేశ ఆయిల్ కంపెనీల నుండి క్రూడ్ ఆయిల్ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లుగా ఎలాంటి సమాచారం మాకు అందలేదు… దిమిత్రి మెద్వదేవ్!
- భారత్ కనుక ఆయిల్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలనుకుంటే నేను స్వాగతిస్తాను… ఆయిల్ ఒక్కటే కాదు, భారత్ రష్యాల మధ్య స్నేహబంధాన్ని నిర్వచించేది! భారత్ తో స్నేహం అనేది వాణిజ్యంతో ముడిపడి లేదు… వ్లాదిమిర్ పుతిన్!
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికా భారత్ మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ గురుంచి స్పష్టత ఇచ్చారు..… భారత్ మీద అమెరికా విధించిన టారిఫ్స్ మీద భారత అధికారులు తరుచూ అమెరికన్ అధికారులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు గత ఆరు నెలలుగా…
Ads
అయితే ఏవో కొన్ని విషయాలలో నోటిమాటగా అంగీకారం కుదిరినా అది ఒప్పంద సంతకాల వరకూ రాలేదు ఇప్పటికి! వచ్చే వారంలో ఒక స్పష్టత రావొచ్చు. అగ్రిమెంట్ మీద సంతకాలు అనేవి మర్చి నెల మధ్యలో జరిగే అవకాశం ఉంది!
ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులని అమెరికా నుండి దిగుమతి చేసుకునే విషయంలో ప్రతిష్టంభన నెలకొని ఉన్నది ఇప్పటికీ! జన్యు మార్పిడి చేసిన సంకరజాతి ( ఆవు+ పంది) ఆవుల పాలు, పాల ఉత్పత్తుల మీద, నాన్ వెజ్ పాల మీద భారత్ కి అభ్యంతరాలు ఉన్నాయి…
పియూష్ గోయల్ మాత్రం వ్యవసాయ, పాలు, పాల ఉత్పత్తులని అమెరికా నుండి దిగుమతి చేసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు!
ఇక అమెరికా నుండి భారత్ కి దిగుమతి అయ్యే వాటి మీద జీరో టారిఫ్స్ అనే అంశం మీద ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం వింతగా ఉంది…
భారత్ చాలా కాలం నుండి అమెరికా దిగుతుల మీద టారిఫ్స్ విధిస్తూ వస్తున్నది అవి…
ఆపిల్స్…: 50% డ్యూటీ
ఆల్మాండ్స్, వాల్ నట్స్ ల మీద 30% డ్యూటీ…
అమెరికా విధించిన టారిఫ్స్ కి బదులుగా 2025 సెప్టెంబర్ లో పప్పుధాన్యాల (lentils ) మీద 30% డ్యూటీ విధించింది భారత్…
పాలు, వెన్న, నెయ్యి, పాల పౌడర్ల మీద 30% టారిఫ్స్ చాలా కాలం నుండి అమలులో ఉన్నాయి. ట్రంప్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నది వీటి మీద 30% టారిఫ్ ఎందుకని… వారం రోజుల క్రితం ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో మాట్లాడుతూ పాలని యూరియా, డిటేర్జెంట్స్ తో కల్తీ చేస్తున్నారు అని వాపోయాడు.
ఇది నిజమే! కానీ ఇన్నాళ్ళూ మౌనంగా ఉండి సరిగ్గా భారత అధికారులు టారిఫ్స్ మీద చర్చలు జరుపుతున్న సమయంలోనే రాజ్యసభలో పాల కల్తీ మీద మాట్లాడడం అనుమానాలకి తావు ఇచ్చినట్లయింది.
- ఆల్కహాలిక్ బేవరిజెస్…: హై టారిఫ్స్ ఉన్నాయి వైన్స్ & స్పిరిట్స్ మీద…
ఆటోమొబైల్స్ , మోటార్ సైకిల్స్…: కార్లు, మోటార్ సైకిల్స్ మీద 70 నుండి 110% టారిఫ్స్ ఉన్నాయి….
ఎలక్ట్రానిక్స్, IT ఉత్పత్తులు…: నెట్వర్కింగ్ స్విచెస్, రూటర్లు, టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద 10 నుండి 20% దాక టారిఫ్స్ ఉన్నాయి…
లక్సరీ ఐటమ్స్…: స్మార్ట్ ఫోన్లు, హై ఎండ్ ఎలక్ట్రానిక్స్, గుర్తించిన కొన్ని ఐటమ్స్ మీద హై టారిఫ్స్ ఉన్నాయి…
ట్రంప్ చాలాసార్లు భారత్ మీద ఆరోపణలు చేశాడు, అమెరికన్ ఉత్పత్తుల మీద భారత్ ఎక్కువ టారిఫ్స్ విధిస్తున్నది చాలా కాలం నుండి కాబట్టి మేము కూడా టారిఫ్స్ విధిస్తున్నాము అని! కొంత నిజం లేకపోలేదు కానీ స్వదేశీ పరిశ్రమల రక్షణ కోసమే అని అమెరికన్ థింక్ టాంక్ కి తెలుసు!
**************
భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గిస్తున్నది లేదా పూర్తిగా ఆపేస్తున్నది అన్న దానిలో నిజానిజాలు ఏమిటీ?
భారత దేశం ఏనాడూ తన అవసరాలలో 10% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ని రష్యా నుండి దిగుమతి చేసుకోలేదు!
సౌదీ అరేబియా, కువైట్, వెనిజులా, సోమాలియా, ఇరాన్ అమెరికా, రష్యాలతోపాటు ఇతర వెస్ట్ ఆఫ్రికన్ దేశాల నుండి చమురు కొనుగోలు చేస్తున్నది.
ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయక ముందు, అంటే 2022 ఫిబ్రవరికి ముందు భారతదేశం తన మొత్తం చమురు అవసరాలలో 6% మాత్రమే కొంటూ వస్తున్నది!
2022 ఏప్రిల్ నెలలో పుతిన్ తన క్రూడ్ ఆయిల్ ని 25% డిస్కౌంట్ ధరకి అమ్ముతానని ఆఫర్ ఇవ్వడంతో అప్పటికే కాంట్రాక్ట్ గడువు ముగుస్తున్నఇతర దేశాల వాటిని రెన్యూవల్ చేయకుండా రష్యాతో కొత్త కాంట్రాక్ట్స్ చేసుకొని కొనడం మొదలుపెట్టింది.
2025 ఆగస్టు నాటికి భారత్ తన మొత్తం అవసరాలలో 36% చమురు రష్యా నుండి కొన్నది. పాత సోవియట్ యూనియన్ కానీ, ప్రస్తుత రష్యాతో కానీ 36% అనేది అత్యధిక శాతం.
2025 ఆగస్టు తరువాత క్రమంగా రష్యా నుండి కొనుగోలు తగ్గించుకుంటూ వచ్చి అది 24% దగ్గర కి చేరుకుంది.
ట్రంప్ ఒత్తిడి ఉంది కనుక మరో 10% తగ్గించినా లేదా 2022 ఫిబ్రవరికి ముందు ఉన్న 6% కి తగ్గించినా ఎవరికీ నష్టం ఉండదు.
పుతిన్ భారత్ తో స్నేహం అనేది చమురు కొనుగోలుతో ముడిపడి లేదు అని ప్రకటించడం వెనుక అర్ధం ఇదే!
రష్యాతో ప్రస్తుత కాంట్రాక్టు 2026 నవంబర్ తో ముగుస్తుంది కాబట్టి కొత్తగా కాంట్రాక్టు ఏమీ ఉండదు. అలా అని పూర్తిగా ఆపేసినట్టు కాదు. కనీసం 6% కొనుగోలు ఉంటుంది దానికి ట్రంప్ అభ్యంతరం చెప్పడు! ట్రంప్ అభ్యంతరం ఏమిటంటే భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం వల్లే రష్యా సుదీర్ఘకాలం యుక్రెయిన్ తో యుద్ధం చేయగలుగుతున్నది అని!
- పుతిన్ ఇప్పటికే రహస్యంగా ఆయిల్ టాంకులను వేరే దేశాలలో రిజిస్టర్ చేయించాడు. వాటికి ఇన్సూరెన్స్ చైనా కంపెనీలు చేస్తున్నాయి కాబట్టి అమెరికా గుర్తించడం కష్టం! ఆయిల్ టాంకర్లని రిజిస్టర్ చేయడం, వాటికి ఇన్సూరెన్స్ చేయడం మీద అమెరికన్ కంపెనీలదే ఆధిపత్యం. వాటిని బైపాస్ చేసేసాయి రష్యా, చైనా, బ్రెజిల్ దేశాలు. ఇక కరెన్సీ అయితే డాలర్ కాదు. అమెరికా ఏం చేయగలదు?
భారత్ రష్యా నుండి అధికశాతం కొనుగోలుని తగ్గిస్తుంది కానీ అసలుకే ఆపేయదు.
మరో ముఖ్య విషయం…: జనవరి 30 న పుతిన్ ఒక ప్రకటన చేస్తూ ఇక నుండి భారత్ తో చేసే వాణిజ్యం మొత్తం ఇండియన్ రూపీస్ లో జరుగుతుందని… ఆంక్షలు పనిచేయవు!
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ‘ట్రూత్ ’లో మెసేజ్ పెట్టాడు మోడీ రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేస్తానని చెప్పాడు అని… ఇంతవరకూ అగ్రిమెంట్ ఖరారు కాలేదు, సంతకాలు చేయలేదు కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ మెసేజ్ పెట్టాడు!
పియూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు చర్చల అజెండాలో లేవు అని! కానీ యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాలతో చేసుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలలో రెండూ ఉన్నాయి కానీ పరిమితులకి లోబడి మాత్రమే అనుమతిస్తారు.
అమెరికన్ వ్యవసాయ, పాల ఉత్పత్తులని యూరోపియన్ దేశాలు కొనవు… ఎందుకంటే ఆయా దేశాల స్ట్రిక్ట్ రూల్స్ కి అనుగుణంగా లేవని…
లక్సరీ ఐటమ్స్ మీద టారిఫ్స్ తగ్గించే అవకాశం ఉంది, అది ఎంత శాతం అన్నది మార్చి రెండో వారంలో కానీ తెలియదు.
భారత్ జీరో టారిఫ్స్ వేస్తున్నది అమెరికా ఉత్పత్తుల మీద అనేది నిజం కాదు. గత సెప్టెంబర్ నెలలో విధించిన 30% టారిఫ్స్ ని జీరో చేస్తుంది.. అదీ పప్పు ధాన్యల మీదనే! మన దేశ పరిశ్రమలు దెబ్బతినవు అనే వాటి మీద జీరో టారిఫ్స్ ఉంటాయి!

ట్రంప్ తాజా కూరగాయలు అన్నీ అమ్ముడుపోయాక చచ్చు, పుచ్చు కూరలని గుట్టగా పోసి అమ్మే చోట బేరాలు ఆడుతున్నాడు!
ఒకసారి ఇవి చూడండి……
జనవరి 19, 2026 న UAE 3 బిలియన్ డాలర్ల LNG ని భారత్ కి సప్లై చేయడానికి ఒప్పందం చేసుకుంది కేవలం రెండు గంటల్లో! ఎందుకంటే ఖతార్ తో భారత్ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకొని మరీ భారత్ కు వచ్చి ఒప్పందాన్ని చేసుకుంది! అఫ్కోర్స్! UAE లో ఆయుధాలు తయారవుతాయి, వాటి విషయంలో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంది!
జనవరి 27, 2026 న యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసింది… కానీ అసలు విషయం ఏమిటో మరో ఆరు నెలల సమయం పడుతుంది పూర్తిగా వివరాలు రావడానికి! ఎలా చూసినా మదర్ అఫ్ ఆల్ డీల్స్ కిందకే వస్తుంది. బెంజ్, ఆడి లాంటి కార్లు సగం ధరకే భారత్ లో కొనవచ్చు డీల్ మీద ఒక నిర్ణయానికి వస్తే! అప్పుడు అమెరికన్ కార్లని ఎవరు కొంటారు?
జనవరి 30 న ట్రంప్ వెనిజులా ఆయిల్ కొనాలని మోడీకి ఆఫర్ ఇచ్చాడు. అమెరికన్ రిఫైనరీలు వెనిజులాలో 150 మిలియన్ డాల్లర్లని ఖర్చుపెడితే కానీ వెనిజులా ఆయిల్ శుద్ది చేయలేమని, అది వాణిజ్యపరంగా తమకి గిట్టుబాటు కాదని చేతులు ఎత్తేసాయి.
రష్యా, చైనా, భారత్ లలో హెవీ క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసే సామర్ధ్యం కలిగి వున్నాయి. అమెరికా కూడా చేయగలదు కానీ అక్కడి సంస్థలు ముందుకు రావడం లేదు. So! వెనిజులా హెవీ ఆయిల్ ని డిస్కౌంట్ రేటుకే అమ్ముతాడు ట్రంప్. భారత్ శుద్ధి చేసి ఇతర దేశాలకి అమ్ముతుంది. సగం వెనిజులాకి సగం తన జేబులో వేసుకుంటాడు ట్రంప్!
మోడీ అవసరం ఉంది ట్రంప్ కే!
బదులుగా ఎప్పటిలాగానే రష్యా నుండి ఆయిల్ కొంటుంది భారత్, దానికి ట్రంప్ అభ్యంతరం చెప్పడు!
జనవరి 30 ,2026 న పుతిన్ ప్రకటన చేశాడు, ఇకముందు భారత్ తో చేసే వాణిజ్యం మొత్తం కూడా రూపీలోనే జరుగుతాయి అని.
ట్రంప్ వెనిజులా ఆయిల్ ఆఫర్ చేయడం, పుతిన్ రూపాయలలోనే వాణిజ్యం జరుగుతుందని జనవరి 30 న జరగడం కాకతాళీయమా లేక ముందే ఒక మాట అనుకొని పధకం ప్రకారం ప్రకటనలు చేశారా?
ఇది జరిగి తీరుతుంది!
వెనిజులా నుండి భారత్ కనుక ఆయిల్ కొనడం మొదలుపెడితే యూరోపు దేశాలు వెంటనే రష్యా నుండి ఆయిల్, సహజ వాయువు కొనడం మొదలు పెట్టేస్తాయి ఆంక్షలని పక్కన పెట్టేసి!
జియో పొలిటిక్స్ అర్ధం చేసుకోవడం కష్టం. నిర్ణయాలు తలుపులు మూసేసిన గదుల్లో తీసుకుంటారు! న్యూస్ హెడ్ లైన్స్ ఉండవు , కేవలం బ్రేకింగ్ న్యూస్ మాత్రమే ఉంటాయి ఘటనలు జరిగాక!
మర్చి నెల మధ్యలో అమెరికా భారత్ మధ్య ఒప్పందాల మీద సంతకాలు జరుగుతాయి, అదీ అధికారుల మధ్య.
ఏప్రిల్ లో ట్రంప్ భారత పర్యటనకి రావొచ్చు!
దశాబ్దకాలంగా మోడీ పని తీరుని ఆశక్తిగా గమనిస్తున్న ఆర్ధిక, రక్షణ రంగ నిపుణులు అంటున్నది ఏమిటంటే మోడీ భారత ప్రధానిగా ఉన్నంతవరకు అతనిదే పైచేయిగా ఉంటుంది అని!
మధ్యంతర ఒప్పందాన్ని జాయింట్ గా అంటే భారత, అమెరికా అధికారులు కలిసి విడుదల చేసిన ప్రకటనలో భారత దేశ మ్యాప్ పూర్తిగా చూపిస్తూ విడుదల చేయడంలో అమెరికా ఆంతర్యం ఏమిటీ?
పాకిస్థాన్ కి సూచన చేస్తూ కాశ్మీర్ అంశం మీద ఇకముందు ఆశ వదులుకోమని అర్ధమా? ఇప్పటి వరకూ కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా చూపించే అమెరికా ఇలా హఠాత్తు గా పూర్తిగా భారతదేశం అంతర్భాగంగా చూపించడం మంచిదే!
Share this Article