Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇటు గరికపాటి రచ్చ… అటు భట్టి కొత్త ఆహార ప్రకటన… భలే కంట్రాస్టు…

March 21, 2026 by M S R

.

పరాభవ నామ సంవత్సరం… నోటి తీట ఉన్నవాళ్లకు… ప్రముఖంగా భక్తి ప్రవచనాలు చెప్పేవాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పాడు కదా… అదే జరిగింది, ఆ తీటతోనే గరికపాటి చిక్కుల్లో పడ్డాడు… నిన్న సోషల్ మీడియా హోరెత్తిపోయింది గరికపాటిని నిందిస్తూ…

గుర్తుంది కదా… బడి పిల్లలకు మధ్యాహ్న భోజనాలు, యూనిఫారాలు దేనికి, జస్ట్, చదువు చెప్పండి చాలు, వస్తే వస్తారు, అన్నీ సమకూరిస్తే పిల్లలు శోభనం పెళ్లికొడుకులు అవుతున్నారు, పైగా గుడ్డు అట, గాడిదగుడ్డు, వాటికి లెక్క రాసుకోవాలి మాస్టార్లు…. ఇలా సాగింది తన ‘ప్రవచనం’…

Ads

ఇది దుమ్ముదుమారం అయిపోతున్న సమయంలోనే తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇదే బడిపిల్లల ఆహారానికి సంబంధించి ఓ ఆదర్శ నిర్ణయాన్ని వెలువరిస్తున్నాడు… జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం వర్తింపు, పబ్లిక్ స్కూళ్లలో నర్సరీ నుంచి టెన్‌ ప్లస్ టు దాకా ఉదయం అల్పాహారం కూడా… మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం…

ఖచ్చితంగా మంచి నిర్ణయమే… తెలంగాణ బడి పిల్లల్లో పౌష్ఠికాహారలోపం (మాల్ న్యూట్రిషన్), అండర్ వెయిట్ గురించి హెల్త్ సర్వేలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి… మధ్యాహ్న భోజనం ప్రారంభమయ్యాకే డ్రాపవుట్స్ శాతం తగ్గించి, పిల్లల అభ్యసన స్థాయి పెరిగింది, చురుకుదనం కూడా… పొద్దున తినీతినక స్కూల్‌కు వచ్చే పిల్లలు మధ్యాహ్నభోజనం సమయం దాకా ఆకలితో ఉంటున్న తీరు గమనించాక ప్రభుత్వం ఇదుగో ఇలా ఉదయం అల్పాహారం గురించి ఆలోచించింది…

ఈ నేపథ్యంలో గరికపాటి ప్రవచనం ఎంత మూర్ఖత్వంతో సాగిందో అర్థం చేసుకొండి… (విద్వత్తు వేరు, విజ్ఞత వేరు) … ఇది రచ్చ రచ్చ అయ్యాక తన టీమ్ ఏదో ప్రకటన విడుదల చేసింది… అదింకా నాసిరకంగా ఉంది… ఇలా…

గరికపాటి

తన మాటల్ని వక్రీకరించారట… అదెలా, అంత స్పష్టంగా వీడియోలో తన మాటలు వినిపిస్తున్నాయి కదా… చేసిందే తప్పు, పైగా దాన్నీ వక్రీకరించే వివరణలు, సమర్థనలు దేనికి..? మరింత పరువు తీసుకోవడమే ఇది… వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో మాట్లాడిన మాటల్ని కలిపేసి, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారట…

ఆయన హిందూ ధర్మ ప్రవచనాల ప్రభావం చూసి జీర్ణించుకోలేక, ఓర్వలేక తనను పేదల నుంచి దూరం చేయడానికి జరుగుతున్న కుట్ర అట… అవునూ, ఇదంతా సరే గానీ… తన అఫిషియల్ టీమ్, అఫిషియల్ సోషల్ ఖాతాల నుంచి ఈ వక్ర వివరణలు దేనికి.,.. నేరుగా తనే ఓ వీడియో విడుదల చేయొచ్చు కదా… తన పేదల పక్షపాతాన్ని కూడా ఓ ప్రచవనంలా చెప్పొచ్చు కదా… తప్పులో కాలు వేస్తే, దాన్ని తలవంచి, శుభ్రంగా కడుక్కోవడం కూడా ఓ కళ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions