Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగునాడు కాదు అవధానీ… ఆంధ్రనాడు… స్వర్ణాంధ్ర భేషైన పదం…

March 4, 2026 by M S R

.

ఒకడు… హోళీ అనేది ఉత్తరాది పండుగ, మనం ఎందుకు రుద్దుకుంటున్నాం అని ఏడుస్తాడు… పైగా ఆంధ్రా మేధావి అట… ఫాఫం, అదీ తన మేధస్సు… ఆ ఆంధ్రా మేధస్సు సంగతేమిటో గానీ, తెలంగాణలో మాత్రం వందల ఏళ్లుగా కాముని పున్నమి ఉంది, కామదహనం ఉంది, జాజిరి పాటల కోలాటల కోలాహలం ఉంది… మోదుగపూల (అగ్నిపూల) రంగులతో హోళీ కేళీ ఉంది… తెలంగాణ మట్టివాసన ఉన్న పండుగ అది…

మరొకడు… సోషల్ మీడియాలో ఓ రచ్చ స్టార్ట్ చేశాడు… విజయ్ దేవరకొండ, రష్మికలు వాళ్ల సొంతూళ్లో, సొంతింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుని, గృహప్రవేశం చేసుకుని, ఊరివాళ్లకు మాంచి భోజనం పెడితే… అది తప్పంటాడు… వ్రతం చేసిన ఇంట్లో నాన్ వెజ్ ఏమిట్రా అనడుగుతాడు… వ్రతం వేరు, ఊరోళ్లకు విందు వేరు… ఐనా ఎవరి ఫుడ్ కల్చర్ వాళ్లది… ఆమే స్వయంగా చెప్పింది మాది పందికూరను ఫుడ్ కల్చర్‌గా భావించే సామాజికవర్గం అని…

Ads

తెలంగాణలో నాన్ వెజ్ విందు సగర్వ ఆహార సంస్కృతే తప్ప అదేమీ అమర్యాద కాదు… కానీ ఎవడో ఏదో అంటుంటాడు… నిజానికి వ్రతం జరిగిన ఇంట్లో కూడా ‘పీట జరిపాక’ అన్నీ సమ్మతమే… (పీట జరపడం అనేది మళ్లీ ఓ వివరమైన సబ్జెక్టు… వినాయకచవితి రోజు కూడా దేవుడిని కదిలించడం అనే ఆనవాయితీ ఒకటి ఉంది…)

ఇంకొకడు… తెలుగునాడు అని ఎన్టీయార్ అప్పట్లో సంకల్పించాడు, అది పెడితేనే మనకు జాతి అభిమానం ఉన్నట్టు… దాంతోనే బాగుపడతాం అంటాడు… ఆ ఆశయాన్ని నెరవేర్చాలి అంటాడు… (ఆ తెలుగు సభల్లోనే అసందర్భంగా సదరు ప్రవచన, అవధాని మస్క్, ట్రంప్ రాక్షసులు అంటాడు… ఖర్మ… తెలుగు సభల్లో ఈ అనాలోచిత, అర్థ జ్ఞాన లేదా అతి జ్ఞాన ప్రదర్శన దేనికో)…

నిజానికి రాష్ట్ర విభజన ప్రకారం అది విభజిత ఆంధ్రప్రదేశ్… నిజమే, బాగాలేదు, సో, పచ్చ మీడియా స్వర్ణాంధ్ర అని రాయసాగింది… అది బాగుంది… దాన్నే ఖాయం చేస్తే, బహుళ ప్రచారంలోకి తీసుకొస్తే బాగుండేది… పైగా ఆంధ్రులు… అంతే తప్ప తెలుగుతనానికి గుండుగుత్తా ఓనర్లు కాదు కదా… ఆ విభజించబడిన ఆంధ్రప్రదేశే తెలుగు ప్రదేశం అయితే మరి తెలంగాణలోని తెలుగువాళ్ల సంగతేమిటి..?

నిజానికి కేరళం, పశ్చిమబంగ, ముంబై, చెన్నై… ఇలా పేర్లు మారుతున్నాయి కదా, మన పేరూ మార్చేద్దాం అంటాడు తను… పేరు మార్పిడితో జాతి అభిమాన ప్రదర్శన నిజమే గానీ, దాంతో బాగుపడేదేమిటి మహాశయా..? పైగా ఆంధ్ర సరే, తెలుగు ప్రదేశం సరే గానీ, మరి రాయలసీమ అస్థిత్వానికి ఆ పేరులో స్థానమేది..?

సహస్రావధానికి తెలుగు భాష అర్థాలు మనం చెప్పనక్కర్లేదు… అది సాహసం అవుతుందిలే గానీ.., ఆయన అపార విద్వత్తును ఏమీ తక్కువ చేయడం లేదులే గానీ… తమిళనాడులోని నాడు అంటే ఓ ప్రాంతం, ఓ దేశం, ఓ రాజ్యం… కానీ తెలుగులో నాడు అంటే ప్రధానంగా రోజు, నిర్ణీతకాలం అని… ఆనాడు, ఈ నాడు, మరునాడు… ఇలా… (Time)…

వేంగినాడు, రేనాడు, పల్నాడు, పొత్తపినాడు… వంటి పదాల్లో కూడా నాడు అంటే ఓ ప్రాంతమే… కానీ తమిళనాడులోని ఆ నాడు (Land) మనకేల..? స్వర్ణాంధ్ర పేరు నీకు నచ్చలేదేమో సరే… ఆంధ్ర సీమ, పోనీ, ఆంధ్రనాడు… ఆంధ్రం పదం ఆంధ్రుల సొంతం, ఆ పదం లేని రాష్ట్రం పేరు దేనికి..? కనీసం ఆంధ్రప్రదేశ్‌ అనేది హిందీగా స్పురిస్తున్నా, అందులో ఆంధ్రం ఉంది మహానుభావా..? నీ తెలుగునాడులో ఆంధ్రం ఎక్కడుంది..? హేమిటో జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే సుమీ..!! చివరగా... తెలుగు అందరిదీ, ఆంధ్రం ఆంధ్రులది..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగునాడు కాదు అవధానీ… ఆంధ్రనాడు… స్వర్ణాంధ్ర భేషైన పదం…
  • కెప్టెన్ టోపీ తీసి అభినందించినప్పుడు నవ్వాడు ఓ నవ్వు… అదీ శాంసన్…
  • లక్షల కోట్ల సంపదకు ట్రస్టీలు… గుడిలో చెత్త ఊడ్చి వెళ్తుంటారు…
  • అక్యూజ్డ్..! ఓ భిన్నమైన జానర్… ‘‘‘సేమ్ జెండర్ కపుల్’’ కథ…
  • తెలంగాణ ప్రగతికి నిజమైన సూచికలు ఏమిటో తెలుసా..? ఇదుగో..!
  • చమురు మంటలే కాదు… డిజిటల్ ప్రపంచానికీ పొంచిన ముప్పు…
  • మతిస్థిమితం తప్పిన హత్యలు- ప్రతీకారం… ఘటనాఘటన సమర్థత…
  • మీడియా బాసుల అహం దెబ్బ తింటే… జర్నలిస్టుల కొలువులు గల్లంతే…
  • ఇరాన్ ప్రాసెస్ డ్రైవెన్ స్ట్రాటజీ … నాయకత్వాన్ని కోల్పోయినా ఆగని యుద్ధం…
  • అమెరికా చమురు దాహం – రక్త పిపాస ఉగ్రవాదం! పశ్చిమాసియా ప్రకంపనలు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions