Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది లొట్టపీసు కేసు కాదు… రేవంత్ వర్సెస్ కేటీఆర్ – తిరగబడ్డ కాలచక్రం!

March 24, 2026 by M S R

.

సీన్ రివర్స్… కాలం- విధి విచిత్రమైంది… భలే పాఠాలు చెబుతుంది… పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాస్తుంది… చాన్నాళ్లు కూడా కాలేదు కదా… వోటుకునోటు అంటూ పదే పదే రేవంత్ రెడ్డిని వేలెత్తి చూపుతూ పింక్ ప్రచారం… అప్పుడు జస్ట్ 50 లక్షల కథ… కానీ ఇప్పుడు… ఏకంగా 55 కోట్ల కథ, ఏ1, అనగా ప్రథమ నిందితుడు కేటీయార్… నువ్వు ఒక వేలెత్తి చూపిస్తే, నాలుగు వేళ్లు నిన్ను నిలదీస్తుంటాయ్ ఇక… అప్పుడు సీఎం కుర్చీపై కేసీయార్, నిందితుడు రేవంత్ రెడ్డి… ఇప్పుడు సీఎం కుర్చీపై అదే రేవంత్ రెడ్డి, కేటీయార్ నిందితుడు… రోల్ రివర్సల్…

రాజకీయాల్లో ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం ఎంతసేపు…! అసలు హైదరాబాద్ వంటి నగరంలో ట్రాఫిక్ డిస్టర్బ్ చేస్తూ ఆ ఫార్ములా రేస్ పెట్టడమే అబ్సర్డ్… పైగా దానికి 55 కోట్ల అనుమతి లేని చెల్లింపులు… అదేదో సంస్థ నుంచి కేటీయార్ పార్టీకి క్విడ్‌ప్రోకో కింద ఎన్నికల బాండ్లు… అంతా తవ్విన ఏసీబీ చార్జి‌షీటు దాఖలు చేసింది… అందులో ఏ1 కేటీయార్… ఏ2 అర్వింద్ కుమార్ ఐఏఎస్…

Ads

మొత్తానికి కేసీయార్ తన హయాంలో ఏసీబీని ఓ నిష్క్రియాపరమైన దర్యాప్తు సంస్థగా మార్చితే… ఇప్పుడు అదే ఏసీబీ అదే కేసీయార్ కుటుంబానికే సంబంధించిన హైప్రొఫైల్ అక్రమాల కేసును విజయవంతంగా విచారణ పూర్తి చేసి, కోర్టుకు చార్జిషీటు దాఖలు చేసింది… విశేషమే… సరే, గొర్ల కేసు ఏమైందో కాసేపు పక్కన పెట్టేద్దాం…

కేటీయార్ మాత్రమే కాదు… కాళేశ్వరంలో కేసీయార్, హరీష్ రావు… ఫోన్ ట్యాపింగులో కేసీయార్… రోజూ వార్తల్లో ఉంటారు, ప్రజల ద‌ృష్టిలో దోషులుగానో, నిందితులుగానో…!! బీఆర్ఎస్ ముఖ్యులు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు, జనం చర్చల్లోనే ఉంటారు… నెగెటివ్ కోణంలో..!!

కేటీయార్ అరెస్టుకు మానసికంగా రెడీ అయిపోయినా సరే… మేకపోతు గాంభీర్యంతో లొట్టపీసు కేసు అని పైకి సణుగుతున్నా సరే… రేవంత్ రెడ్డి అరెస్టు మాత్రం చేయడు… అదుగో గవర్నర్ పర్మిషన్ అంటాడు… అదుగో డీఓపీటీ నుంచి క్లియరెన్స్ రావాలి అంటాడు… తను చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్ కాదు, కాదలచుకోలేదు… రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన కేసీయార్ అసలే కాదు, కాదలుచుకోలేదు… జగన్‌ను అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంగా కూడా కాదలుచుకోలేదు…

అలా మెడలపై కత్తులు వేలాడుతుంటాయి… విచారణలు సాగుతుంటాయి… ప్రజల్లో ఇంకా కేసీయార్ కుటుంబ అక్రమాలపై నెగెటివిటీ ఉంది… దాన్ని కెటకటాల సానుభూతితో తగ్గించదలుచుకోలేదు రేవంత్ రెడ్డి… దీనికిీతోడు తన మాటలతో ఉరిమి రంపాన పెడుతున్న కవిత ఉండనే ఉంది…

రాజకీయాల్లో కక్షసాధింపులకన్నా అప్పర్ హ్యాండ్ కాపాడుకునే ఎత్తుగడలే ప్రధానం... ఎవరూ ఎల్లప్పుడూ తోపులు కాదు, చాణుక్యులు అసలే కాదు..., అనివార్యంగా నేలకు దిగివస్తారు, విధి అలా దింపుతుంది... గృహబందీగా మార్చేస్తుంది... చివరకు జనంలోకి రావడానికీ మొహం చెల్లనంతగా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions