Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనాలోచిత వ్యాఖ్యలతో… తనంతతానే పలుచన అవుతున్న హరీషుడు…

March 2, 2026 by M S R

.

ఈమధ్య హరీష్ రావు అనాలోచితంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు… పాపం, కేటీయార్ ఏం మాట్లాడతాడో తెలియదు, కేసీయార్ ఎలాగూ స్వీయ బందిఖానాలో ఉన్నాడు… ఉన్నంతలో కాస్త తెలివిగా, పద్ధతిగా తనొక్కడే మాట్లాడతాడు అనుకుంటే… తనూ సంయమనం కోల్పోతున్నాడు…

చాలామంది అభిప్రాయం ఇదే… తాజా ఉదాహరణ ఏమిటంటే..? రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకురావల్సిన సంస్కరణలు, మార్పులపై రేవంత్ రెడ్డి ఓ కమిషన్ వేశాడు… మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వం… తను రీసెంటుగా ఆ కమిషన్ నివేదికను రేవంత్ రెడ్డికి సమర్పించాడు, ఆల్రెడీ ఒకటీరెండు సిఫారసులపై తన అమలు నిర్ణయాల్ని ప్రకటించేశాడు రేవంత్ రెడ్డి…

Ads

సరే, ఆ సిఫారసులన్నీ అందరూ ఆమోదించాలని, వాటితో ఏకీభవించాలనీ ఏమీ లేదు… అందులో కొన్ని సాధ్యం కూడా కాకపోవచ్చు మన సిస్టంలో… కానీ ఆలోచన, మథనం అనేది అవసరం కదా… అదే మురళి చేసింది… కానీ హరీష్ రావు ఏమన్నాడు..? నోరు పారేసుకున్నాడు… ఆ కమిషన్‌లో విద్యావేత్తలు ఎవరున్నారు అన్నాడు…

ఏరోజుకారోజు ఏదో ఒకటి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద బురద గుప్పించడమే ధ్యేయం అనుకుంటే… ఇదుగో ఇలాంటి అనాలోచిత మాటలే దొర్లుతాయి… ఇంతకీ మురళి మీద తన కక్ష ఏమిటంటే..? కేసీయార్ హయాంలో తనను పూర్తిగా వివక్షకు గురిచేశారు, దీంతో ఐఏఎస్‌కు స్వచ్ఛందంగా వీడ్కోలు పలికాడు… కేసీయార్ బాపతు వివక్షను ఎత్తిచూపాడు… ఆ కక్ష ఇంకా హరీష్‌రావులో ఉన్నట్టుంది… అదే ఈ విమర్శలకు కారణం కావచ్చు బహుశా…

కానీ విద్యావేత్తలు లేని కమిషన్‌కు విలువేముంది అనే విమర్శ కరెక్టేనా..? ఏం చదివి ఉద్దరించాడని కేసీయార్ స్వయంగా శాటిలైట్ పిక్చర్ల మీద అడ్డంగా గీతలు గీసి, కాళేశ్వరం బరాజులు డిజైన్ చేశాడు హరీష్ భాయ్..? దాన్ని సమర్థిస్తావా మరి..? నువ్వే కదా ఆ డిజైన్లను ఎగ్జిక్యూట్ చేసి, లక్ష కోట్ల ప్రాజెక్టును పఢావు పడేసింది..!! మామా అల్లుళ్లు ఫైనాన్స్, ఇరిగేషన్ సబ్జెక్టుల్లో నిపుణులా..?

ఆకునూరి మురళి

బండి సంజయ్ కూడా విద్యా కమిషన్ మీద రాజకీయ విమర్శలు చేశాడు, కానీ రిపోర్టులోని కంటెంటు మీద తను ఏకీభవించని అంశాల మీద మాట్లాడాడు… కానీ హరీష్ రావు అక్షరాలా అనాలోచిత విమర్శలు చేసి దొరికిపోయాడు తనే… రోజూ ఇదే పని కదా…

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే… మురళి భలే కౌంటర్లు వేశాడు హరీష్ రావుకు… ‘‘అసలు మొదటి పేజీ అయినా చదివావా హరీష్ రావ్..? మీ పదేళ్ల కాలంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారు… ఈ కమిషన్‌లో ఉన్నవాళ్ల విద్యార్హతలు తెలుసా నీకు..? ఆరుగురు పీహెచ్డీ చేసినవాళ్లు, అందరికీ టీచింగ్ అనుభవం ఉంది…

22 మంది ప్రొఫెసర్లు, ఒకరు ఎన్ఐటీ, ఒకరు ఐఆర్ఎంఏ, ఒకరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్… వీళ్లు విద్యావేత్తలు కారా..? ఐనా రిపోర్టు మురళి ఒక్కడే రాయడనే బేసిక్ సోయి మరిచిపోతే ఎలా..?’’ ఈ కౌంటర్‌కు నిజంగా హరీష్ రావు దగ్గర సమాధానం లేదు… మరి విద్యా కమిషన్ మీద చేసిన విసుర్లతో ఎందుకిలా పలుచన కావడం..?!

మురళే చెప్పాడు… అన్ని జిల్లాలు తిరిగాం, టీచర్లతో, విద్యార్థులతో, తల్లిదండ్రులతో మాట్లాడం అని… అధ్యయనం అంటే అదే కదా… అది పక్కాగా జరిగిందా లేదానేదే ముఖ్యం… ఆ రిపోర్టుతో ఏకీభవిస్తామా లేదానేది వేరే సంగతి…

కేసీయార్ తన పదేళ్ల పాలనకాలంలో కనీసం ఒక్క గంటసేపైనా విద్య మీద సమక్ష నిర్వహించాడా అనడిగాడు మురళి..! నిజానికి ఆయన పదవీవిరమణ పొందాక ఏపీకి వెళ్లాడు, ఎడ్యుకేషన్ సలహాదారుగా ఏపీలో సర్కారు స్కూళ్లకు నాడు-నేడు పేరిట, ఇంగ్లిష్ మీడియం పేరిట ఓ కొత్త దిశను చూపించాడు… అఫ్‌కోర్స్, కేంద్ర సాయమే అనుకొండి…

హరీష్ భాయ్... ఒక అడ్మినిస్ట్రేటర్ విద్యపై అధ్యయనం చేయాలంటే విద్యావేత్త అయి ఉండాలా..? అంటే మీ అత్యంత భారీ గొప్ప ప్రముఖ విద్యావేత్త మల్లారెడ్డిలాగా..?! అసలు తన విద్యార్హతలు తెలుసా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనాలోచిత వ్యాఖ్యలతో… తనంతతానే పలుచన అవుతున్న హరీషుడు…
  • రేపు చంద్రగ్రహణం- దీనికి ఓ విశిష్టత… ఇవీ జాగ్రత్తలు- పరిహారాలు…
  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions