Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?

March 1, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … బ్రిక్స్ దేశాలే టార్గెట్! ఇల్యూమినాటి BRICS కూటమి దేశాలని టార్గెట్ చేస్తున్నది!

ఇరాన్ – ఆఫ్ఘనిస్తాన్ – వెనిజులా – పాకిస్థాన్!
వెనిజులాలో చైనా పెట్టుబడులు పెట్టింది. డిస్కౌంట్ తో ముడి చమురు కొంటూ వచ్చింది, డాలర్ కానీ యువాన్ కానీ చెల్లించకుండా! బదులుగా వెనిజులా దేశంలోకి చైనా ఉత్పత్తులని డంప్ చేస్తూ వచ్చింది. మొబైల్ ఫోన్లు, కార్లు, ట్రక్కులు, మెడిసిన్స్, వైద్య పరికరాలు, రోడ్లు, వంతెనలు ఇలా పెద్ద లిస్టే ఉంది.

Ads

వెనిజులా నుండి డిస్కౌంట్ తో ఆయిల్ కొంటున్నా ట్రేడ్ డెఫిసిట్ వెనిజులా వైపే ఉంటూ వచ్చింది. వెనిజులా చైనాకి ఎగుమతి చేసేవి తక్కువ, చైనా నుండి దిగుమతి చేసుకునేవే ఎక్కువ! ఫలితంగా చైనా వెనిజులాకి ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేకుండా చూసుకుంది. ఇదే తరహా వాణిజ్య ఒప్పందాలు ఆఫ్రికా దేశాలతో చేసుకుంది చైనా!

అమెరికా నేరుగా బ్రిక్స్ దేశాలతో తలపడకుండా బ్రిక్స్ దేశాలకి వాణిజ్యపరంగా లాభం చేకూర్చే ఏవైతే దేశాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నది.
వెనిజులాని స్వాధీనం చేసుకొని డిస్కౌంట్ ఆయిల్ ని చైనాకి అందకుండా చేసింది అమెరికా. అలా అని వెనిజులా నుండి ఆయిల్ కొనకుండా ఆపలేదు. ఆయిల్ కొనవచ్చు కానీ డాలర్స్ తో కొనాలి ఏ దేశం అయినా.
చైనా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ధరతో ఆయిల్ కొనేది ఇరాన్ దగ్గర నుండి. ఇరాన్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లలో చైనా $500 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇరాన్ తో చైనా చేసే వాణిజ్యంలో 4 బిలియన్ డాలర్ల మొత్తo సర్ప్లస్ తో ఉంది. ఇరాన్ ఆయిల్ ని తప్పిస్తే మిగతా వాటితో పోలిస్తే చైనా ఎక్కువ లాభపడుతున్నది.

అమెరికా లక్ష్యం ఇరాన్ నుండి చైనాకి ఆయిల్ సప్లై ఆపేయడం! ఒకవేళ చైనా కొనాల్సివస్తే డిస్కౌంట్ తో కాకుండా మార్కెట్ రేట్ తో డాలార్లతో కొనేలా చేయడం!
ఇరాన్ ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చున్నది అటు క్రెమ్లిన్ కి ఇటు బీజింగ్ కి.

*************
యుద్ధ నివారణ చర్యలలో భాగంగా జెనివాలో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
యుద్ధం నివారించేందుకు ఇరాన్ కి అమెరికా చేసిన ప్రతిపాదనలు…

1.ఇరాన్ తన మూడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిన ఫార్దో ( Fardow ), నటాంజ్ ( Natanz ), ఇస్ఫ హాన్ ( Isfahan ) లని శాశ్వతంగా మూసివేయాలి.
2.ఇప్పటికే శుద్ధి చేసి నిల్వ ఉంచిన వెపన్ గ్రేడ్ యురేనియం అమెరికాకి అప్పచెప్పాలి.

3.ఇరాన్ కనుక అణుశక్తితో నడిచే విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలి అని కోరితే అమెరికా సహాయం చేస్తుంది.
4.అణు స్థావరాలని మూసివేసి, శుద్ధి చేసిన యురేనియం అమెరికాకి అప్పచెప్పినా ఇరాన్ మీద విధించిన ఆంక్షలని ఎత్తివేయడం జరగదు.

ఇవీ అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలలో భాగంగా అమెరికా చేసిన ప్రతిపాదనలు.
ఇరాన్ ఈ ప్రతిపాదనలని తిరస్కరించింది!
శుద్ధి చేసిన యురేనియం అమెరికా కి అప్పచెప్పినా, తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మూసివేసినా అమెరికా ఇజ్రాయేల్ తన మీద దాడిచేస్తాయని ఖోమేని కి తెలుసు!

అమెరికా చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏమిటంటే…..
ఫిబ్రవరి 13 న మ్యూనిచ్ ( జెర్మనీ ) లో జరిగిన సెక్యూరిటీ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా హాజరయ్యాడు.
అదే రోజు ఇరాన్ మాజీ రాజు షా పెహ్లావి కూడా అక్కడికి వెళ్ళాడు. ప్రత్యేకించి జెలెన్స్కీ తో సమావేశం అయ్యి ఇరాన్ ప్రజలు ఖోమేనికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా జెలెన్స్కీ మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపాడు షా పెహ్లావి!

షా పెహ్లావి ప్రవాసంలో ఉంటున్న మాజీ ఇరాన్ రాజు! మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది దేశాధినేతలు లేదా ఆయా దేశాల విదేశాంగా మంత్రులకి మాత్రమే సంబంధించినది. షా పెహ్లావి ఎలాంటి అధికార పదవిలో లేడు. మరి ప్రవేశం ఎలా లభించింది?

పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ సమావేశాల కోసం సైనిక దుస్తులలోనే వెళ్లినా గుర్తింపు కార్డు చూపించమని సెక్యూరిటీ అధికారులు డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డు చూపించిన తరువాతే లోపలికి అనుమతించారు! ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా హై లైట్ చేసింది కూడా!
మరి షా పెహ్లావిని ఎలా అనుమతించారు?

ఒక పక్కన శాంతి చర్చలు అంటూ జెనీవాలో పలుమార్లు సమావేశం అవుతుండగా షా పెహ్లావిని తెర మీదకి తేవడం టెహ్రాన్ కి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది.
నిన్నటి రోజున యుద్ధం అనివార్యం అయింది!
మరి ముందు ఎవరు దాడి చేయాలి ఇరాన్ మీద?

ట్రంప్ సలహాదారులలో ఎవరూ ఇరాన్ మీద దాడి చేయడానికి ఇష్టపడలేదు!
ఇరాన్ ఇంటర్ కాంటినేంటల్ బాలిస్టిక్ మీసైల్స్ భారీ స్థాయిలో తయారు చేసి నిల్వ చేసింది! అఫ్కోర్స్ వాటికి సాటిలైట్ నావిగేషన్ లేదు కానీ ఇనర్షియల్ నావిగేషన్ తో ప్రయాణిస్తాయి!
INS అంటే GPS అవసరం లేకుండా స్వతంత్రంగా పనిచేసే నావిగేషన్ వ్యవస్థ అన్నమాట. GPS అంత పర్ఫెక్ట్ కాదు కానీ ప్రమాదకరమే! టార్గెట్ మీద నేరుగా పడకపోయినా చుట్టుపక్కల విధ్వంసం సృష్టించగలదు!

పెంటగాన్ అధికారులు ఇరాన్ ఇప్పటికే ఒకటో రెండో అణు బాంబులని సిద్ధం చేసుకొని ఉండవచ్చు అని భావిస్తున్నారు . ఒకటి ఇజ్రాయేల్ మీద ప్రయోగిస్తే రెండవది అమెరికా దాకా రావొచ్చు కాబట్టి మొదటి దాడి ఇజ్రాయల్ చేత చేయించి ఫలితాన్ని బట్టి అప్పుడు అమెరికా దాడిచేయవచ్చు అని ట్రంప్ కి సలహా ఇచ్చారు.

ఇజ్రాయేల్ మొదట దాడి మొదలు పెట్టింది నిన్న ఉదయం! ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయేల్ మీద ప్రతిదాడి మొదలు పెట్టింది.
ఇజ్రాయేల్ చిన్న దేశం కాబట్టి ఈసారి భారీగానే నష్టపోవచ్చు! ప్రస్తుతం ఇరాన్ వద్ద నాలుగు వందల బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అవి పూర్తిగా ఇజ్రాయేల్ మీద ప్రయోగించకుండా ఉండాలి అంటే మొదట వాటిని నిల్వ ఉంచిన ప్రదేశాలని నాశనం చేయాల్సి ఉంటుంది!

ఇజ్రాయేల్ కి ఇరాన్ లోని ప్రభుత్వ వ్యతిరేక ప్రజల నుండి ఇంటెలిజెన్స్ వస్తుండడం ఒకటే పెద్ద అడ్వాంటేజ్!
ఆయుతోల్లా అలీ ఖోమేని ఇప్పటికే రష్యా పారిపోవడానికి సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది.
IRGC ( Iran Revolutionary Gaurds Corps ) లో విభేదాలు ఉన్నాయి. ఒక గ్రూపు ఖోమేని అనుకూల వర్గం అయితే రెండో గ్రూపు ఖోమేని వ్యతిరేక వర్గం. నిన్న ఇజ్రాయేల్ చేసిన దాడులలో ఇరాన్ రక్షణ మంత్రి హతం అవ్వడం వెనుక IRGC లోని ఖోమేని వ్యతిరేక గ్రూపు ఇచ్చిన సమాచారం కారణం!

పుతిన్ ఇజ్రాయేల్, అమెరికా ఎక్కడ దాడి చేస్తాయో ముందే వివరంగా రూట్ మాప్ ఇచ్చినా కూడా ఇరాన్ రక్షణ మంత్రి ఇజ్రాయేల్ దాడిలో మరణించాడు!
చైనా తన గూఢచార ఉపగ్రహాల ద్వారా రియల్ టైమ్ సమాచారం ఇస్తున్నది గత వారం రోజుల నుండి!
పుతిన్, జీ జిన్‌పింగ్ లకి ఇరాన్ తమ అధీనంలో ఉండడం అత్యవసరం! మధ్య ప్రాచ్యంలో సిరియా కోల్పోవడం ఒక ఎత్తయితే ఇరాన్ అమెరికా చేతిలోకి పోవడం మరో భారీ నష్టం!

ఈసారి దాడులలో యూరోపు దేశాలు పాల్గొనడం లేదు.
బ్రిటన్?
ఇరాన్ మీద దాడి కోసం తమ దేశ ఎయిర్ బేస్ లు, పోర్టులని వాడుకోవడానికి అనుమతి ఇవ్వబోనని బ్రిటన్ ప్రధాని కీర్ స్ట్రామర్ ఇప్పటికే ప్రకటించాడు!
ఇజ్రాయేల్ నుండి F-35 లు ఇరాన్ దాకా ప్రయాణించలేవు. మధ్యలో రీ ఫ్యూయల్ తప్పనిసరిగా అవసరం ఏర్పడుతుంది కానీ ఎయిర్ ట్యాంకర్స్ ని కాపాడుకోవడం కష్టం! ఎందుకంటే చైనా ఉపగ్రహాలు ఇరాన్ కి సమాచారం ఇస్తే వాటిని కూల్చడం ఇరాన్ కి పెద్ద కష్టం కాదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”
  • తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!
  • క్లీన్ కవిత..! అసలే మూలిగే బీఆర్ఎస్ మీద పే-ద్ధ తాటిపండు పడ్డట్టు..!!
  • ఆమె జేఆర్‌డి టాటాకు నేరుగా ఓ పోస్ట్ కార్డు రాసింది… ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ…
  • ఒక్కతే… 2 లక్షల కిలోమీటర్లు… మోటార్ బైక్‌పై… అనేక దేశాల్లో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions