Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉస్మాన్ తారీఖ్… కంట్రవర్సీ బౌలర్… కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే…

February 19, 2026 by M S R

.

John Kora …. ధోనీయే నా ఇన్‌స్పిరేషన్… ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ఉస్మాన్ తారిఖ్ గురించే చర్చ జరిగింది. అతను బంతిని విసిరే విధానం, చేతిని వంచే పద్దతి కొంచెం వివాదాస్పదంగా ఉండటంతో సామాన్య అభిమానుల నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు తారిఖ్ గురించే మాట్లాడుకున్నారు.

సోషల్ మీడియాలో అయితే గ్రె* నే* డ్లు విసిరిన అనుభవం అనుకుంటూ మార్ఫింగ్ ఫొటోలు విడుదల చేశారు. అయితే తారిఖ్ ప్రెస్ ముందు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత.. అతను తన కుటుంబం కోసం పడిన కష్టం కనిపించింది. శత్రుదేశానికి చెందిన వాడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడాం.. కానీ అతను అందుకు అర్హుడు కాదు. కష్టపడి ఎదిగిన ఒక క్రికెటర్‌గానే నాకు ఇప్పుడు కనిసిపిస్తున్నాడు.

Ads

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో తారిఖ్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం. అయితే నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయిన తర్వాత కొన్నాళ్లు క్రికెట్ ఆడినా.. ఒక వయసు వచ్చాక కుటుంబ బాధ్యత మొత్తం తారిఖ్ మీడ పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రికెట్ వదిలేసి దుబాయ్ వెళ్లాడు.

అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ మ్యాన్‌గా పని చేశాడు. ఇలా పని చేసుకుంటున్న సందర్భంలోనే అనుకోకుండా ‘ఎంఎస్ ధోనీ’ సినిమాను చూశాడు. ఒక వైపు జాబ్ చేసుకుంటూనే క్రికెట్ కోసం ధోనీ ఎంత తపించిపోయాడు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా జీవితం కూడా అంతే కదా.. ఉద్యోగం కోసం క్రికెట్‌ను వదిలేశా.. ధోనీలాగ నేనెందుకు చేయలేను అని అనుకున్నాడు.

ధోనీ కూడా ఒక మామూలు మనిషినే కదా.. ఆయన సాధించగా లేనిది తానెందుకు సాధించలేనని భావించాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోవాలి. మళ్లీ క్రికెట్ ఆడాలి అని అనుకున్నాడు.

క్రికెట్ మీ ప్రేమతో తిరిగి పాకిస్తాన్ వస్తాడు ఉస్మాన్ తారిఖ్. ఒక స్నేహితుడి ద్వారా పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ పరిచయం అవుతాడు. తారిఖ్ టాలెంట్ గమనించిన ఫకర్.. అతడ్ని ఒక కోచ్‌కు పరిచయం చేస్తాడు. అలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వజహతుల్లా వస్తీ దగ్గర కూడా ఉస్మాన్ శిక్షణ తీసుకుంటాడు.

అలా క్రికెట్‌ను మరింత మెరుగుపరుచుకున్న తర్వాత అతడికి పీఎస్ఎల్‌లోని క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తీసుకుంటుంది. అంతే కాకుండా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, ఐఎల్‌టీ20లో డెజర్ట్ వైపర్స్ తరపున క్రికెట్ ఆడటం మొదలు పెడతాడు.

2025 చివర్లో పాకిస్తాన్ జాతీయ జట్టులో తారిఖ్ స్థానం సంపాదిస్తాడు. అప్పటి నుంచి టీ20 జట్టులో తారిఖ్ కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఇతని బౌలింగ్ యాక్షన్ మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిపుణుల సహాయంతో బయోమెకానిక్స్ పరీక్ష నిర్వహిస్తుంది.

తారిఖ్ పుట్టడంతోనే డబుల్ జాయింటెడ్ ఆర్మ్స్‌తో పుడతాడు. సహజంగానే ఆ చేతులు అలా వంగి ఉంటాయి. తప్ప తాను స్వయంగా, కావాలని వంచడం లేదని వివరించాడు. దీంతో ఆ పరీక్షలో తారిఖ్ పాసవుతాడు.

తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై వివాదాలు చెలరేగినప్పుడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వాట్సన్ సాయం చేశాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ హెడ్‌ కోచ్‌గా షేన్ వాట్సన్ ఉండేవాడు. అతనే తారిఖ్‌కు అండగా నిలిచాడు. నీ యాక్షన్ బాగానే ఉంది. భయపడకు అని వెన్నుతట్టి ప్రోత్సహించాడు.

అలా పరోక్షంగా ధోనీ, ప్రత్యక్షంగా వాట్సన్ ఇచ్చిన ధైర్యం, స్పూర్తితో తారిఖ్ ఇవ్వాళ సెన్సేషనల్ బౌలర్‌గా ఎదిగాడు. తారిఖ్ ఆడిన గత 24 మ్యాచ్‌లలో ఒక్క వికెట్ తీయని మ్యాచ్‌ ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఎస్.. పాకిస్తాన్ వాడైతే ఏంటి.. టాలెంట్ ఉంటే తప్పక అభినందించాల్సిందే. #భాయ్‌జాన్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వామ్మో, ఏం కి‘లేడీ’ ప్లాన్ వేసిందిర భయ్… పాపం, ఆ భర్త బతికిపోయాడు…
  • ఉస్మాన్ తారీఖ్… కంట్రవర్సీ బౌలర్… కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే…
  • యాటిట్యూడ్‌కే అమ్మ..! వాణిశ్రీ అంటే అప్పట్లో ఓ సినీ శివగామి..!!
  • ‘‘కల్వర్టు కిందకు లాక్కెళ్లి, దుస్తులు విప్పి… అత్యాచారయత్నమే కాదంటే…?’’
  • ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!
  • ‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…
  • తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…
  • స్వరరచనలో లబ్ధి ప్రతిష్ఠుడే… లిటిగెంటుగా పే-ద్ద లుబ్ధ ప్రతిష్ఠుడే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions