Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కరీంనగర్ ఇషాన్ కిషన్… బండి సంజయ్… ఓ ఉత్కంఠభరిత మ్యాచ్..!!

February 18, 2026 by M S R

.

మామూలుగా పాకిస్థాన్- ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే…. హై వోల్టేజీ వాతావరణం కదా… కోట్ల మంది టీవీల ముందు కూర్చుని, గోళ్లు కొరుక్కుంటూ ఆ థ్రిల్, ఆ సస్పెన్స్ ఎంజాయ్ చేస్తుంటారు కదా… తుస్… మొన్నటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో అస్సలు థ్రిల్ లేదు, మజా లేదు… వాడు అక్షరాలా చేతులెత్తేసి బావురుమన్నాడు…

కానీ అంతకుమించిన ఓ మ్యాచ్ జరిగింది తెలంగాణలో… అది కరీంనగర్ మేయర్ ఎన్నిక… ఆ మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్ కదా… ఈ కరీంనగర్ టీ-66లో హీరో ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఖచ్చితంగా బండి సంజయ్… అలియాస్ బండి ఇషాన్ సంజయ్…

Ads

  • ఇంత సర్టిఫికెట్ మామూలుగా ఎవరికీ ఇవ్వను నేను… కానీ ఇస్తున్నాను… ఎందుకంటే… ఈ కరీంనగర్ మేయర్ ఎన్నిక అనే మ్యాచులో పర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్, విన్నర్ బండి సంజయే కాబట్టి… ఏ దశలోనూ తన టెంపర్, తన కమిట్మెంట్ కోల్పోలేదు… ఇతర బీజేపీ నేతల్లాగా ఉసూరుమనిపించలేదు…

వివరాల్లోకి కాస్త ఓ క్రమపద్ధతిలో వెళ్దాం… నో డౌట్, మొన్నటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రియల్ హీరోస్ ఆఫ్ బీజేపీ… ధర్మపురి అరవింద్, బండి సంజయ్… కాకపోతే నిజామాబాద్‌లో బాగా కష్టపడ్డాడు గానీ, మజ్లిస్‌ను నిలువరించడంలో అరవింద్ పెద్దగా సక్సెస్ కాలేదు… (తన ఎఫర్ట్స్‌ను తక్కువగా తీసేయడం లేదు ఇక్కడ…)

కానీ కరీంనగర్‌లో మజ్లిస్‌ను కేవలం నాలుగు స్థానాలకు పరిమితం చేయగలిగాడు బండి సంజయ్… అది గెలుపుకు తొలిమెట్టు… పవర్‌లో ఉన్న కాంగ్రెస్‌ 14, మేం తోపు మేం తురుం అని చెప్పుకునే బీఆర్ఎస్ 9 సీట్లకు పరిమితమైపోయారు… ఇక గేమ్ మొదలైంది…

  • మొత్తం సీట్లు 66… మెజారిటీ మార్క్ 34… బీజేపీకి వచ్చినవి 30 సీట్లు… ప్లస్ తన ఎక్స్-అఫిషియో వోటు (సంజయ్)… వెరసి 31… ఇంకా 3 కావాలి… ఇండిపెండెంట్లుగా గెలిచిన బీజేపీ రెబల్స్ ఒకరిద్దరున్నారు… సో, ముగ్గురితో మాట్లాడిన సంజయ్ వాళ్లకు ముందే ఓ ధీమా ఇచ్చాడు…. నన్ను నమ్మి, నాతో రండి, అవసరమైతే మీతో రాజీనామాలు చేయించి, ఈసారి బీజేపీ టికెట్ మీద గెలిపిస్తాను అని… పర్‌ఫెక్ట్ బౌన్సర్…

కానీ కాంగ్రెస్ వదలదు గదా…. రాష్ట్ర రాజకీయాల్లో తెల్లారిలేస్తే బూతులు తిట్టుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి… కానీ యాంటీ బీజేపీకి ఉన్న లెక్క ఏమిటి..? కాంగ్రెస్ 14, మజ్లిస్ 4, ఇండిపెండెంట్లు ముగ్గురు, రెండు ఎక్స్ అఫిషియో వోట్లు… (కాంగ్రెస్ సత్యనారాయణ, బీఆర్ఎస్ కమలాకర్)… దీనికి బీఆర్ఎస్ 9 కలిస్తే వెరసి 32… మరో రెండు కావాలి…

బండి సంజయ్

బీజేపీ వైపు వెళ్లిన స్వతంత్రులకు ప్రలోభాలు, నేరుగా హైదరాబాదు పెద్దల నుంచి హామీలు… కాంగ్రెస్ నుంచి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పీపీసీ మహేష్ గౌడ్… ఇటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు తెల్లార్లూ ఇదే పని… చివరలో కేటీయార్ ఎంట్రీ…

CM డైరెక్షన్స్…. లియోనియో రిసార్ట్స్‌లో హరీష్ రావు, గంగులతో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం గంటల తరబడి రహస్య మంతనాలు… KTR కు BRS కార్పొరేటర్ల అల్టిమేటం… ఆహా, ఎన్ని ట్విస్టులు… అందుకే కదా, థ్రిల్లింగ్ టీ20 మ్యాచుతో పోల్చింది…

  • ఇదే హరీష్ రావు తిట్టాడు కదా… కాంగ్రెస్, బీజేపీ అనైతిక, అధర్మ, అప్రజాస్వామిక పొత్తు, స్నేహం మన్నూమశానం అని… నిజానికి జరిగింది ఏమిటి..,? అదే బీజేపీకి వ్యతిరేకంగా, అవే పద్ధతుల్లో కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ ఎట్సెట్రా కలిసి ప్రజాస్వామిక స్పూర్తిని పాతరేసే ప్రయత్నాలు చేశాయి…

సో, రెండు స్వతంత్ర వోట్లు కావాలి… హైదరాబాదు నుంచి ఆపరేషన్… మామూలుగా కాదు… క్యాంపు, ప్రలోభాలు, నగదు… ఏది కోరితే అది… రెండు రోజులు బండి ఇషాన్‌కు నిద్రలేదు, చివరకు తను ఎంత సీరియస్‌గా తీసుకున్నాడు అంటే… కేంద్రాన్ని కదిలించాడు… అదీ ఫైటింగ్ స్పిరిట్… ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం తపన, ప్రయాస…

  • ఓ రాత్రిపూట ఢిల్లీ నుంచి బీఆర్ఎస్ ముఖ్యులకు ఫోన్… ‘జాగ్రత్త’… వన్ వర్డ్… వెంటనే ‘మేం వోటింగుకు దూరం, తటస్థం… జాతిపిత చెప్పాడు’ అని అందరికీ మెసేజ్… తెల్లారి క్రీజ్ క్లియర్… కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీసు మీద కాషాయ జెండా రెపరెప… ఎస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్… బండి సంజయ్… ఎస్, తనే తెలంగాణ బీజేపీ పగ్గాలకు అసలైన అర్హుడు… ఇంకా ఇంకా ఎన్నేళ్లు కేసీయార్ ఎదుటఅంత పెద్ద జాతీయ పార్టీ  సాగిలబడటం..!!

బండి ఎఐ

  • ఇక కార్పొరేషన్ ఆఫీసు మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడమే అని కలలగంటున్న నేతలకు షాక్… హైదరాబాదు నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్లకూ… బీఆర్ఎస్ ఎందుకు భయపడి వెనక్కి పోయిందో అర్థం కాలేదు… సీన్ కట్ చేస్తే… ప్లాన్ తల్లకిందులు…

ఇక వేరే విశ్లేషణలోకి వెళ్దాం… చెప్పుకుంటూనే ఉన్నాం కదా… 8 మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది పార్టీలు అని…!! మజ్లిస్ సీట్లను నిలువరించడంలో ధర్మపురి ఫస్ట్ సెట్ బ్యాక్… తరువాత మైనారిటీలో పడిపోగానే… స్వతంత్రులను తనవైపు ఆకర్షించడంలో ఫెయిల్… రూపాయి ఇవ్వను, ప్రతిపక్షంలో కూర్చుంటాను అనేసరికి బీజేపీ వైపు వద్దామనుకున్నవాళ్లూ వాపస్…

ఎంపీ రఘునందన్ ‌రావు చెబుతున్నాడు… మా పార్టీ చెప్పింది, నేను బీఆర్ఎస్‌కు వోటేశాను అని… అంటే రాష్ట్ర బీజేపీ పార్టీ అధికారికంగానే బీఆర్ఎస్ అనుకూల వైఖరి తీసుకుందా..? అదేదో స్పష్టంగా చెప్పి ఏడవొచ్చుకదా తెలంగాణ బీజేపీ..? బండి సంజయ్ ఫైటింగ్ స్పిరిట్‌లో వీసమెత్తు కూడా రాష్ట్ర పార్టీకి లేకపోతే ఎలా..?

మిగతా బీజేపీ ఎంపీల లెక్కల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… కానీ ఢిల్లీకి తెలంగాణ బీజేపీ అసలు లోటుపాట్లు, అంతర్గత విభేదాలు, కమిటెడ్ లీడర్స్ గురించి ఇప్పటికైనా ఓ ఐడియా వచ్చిందా..? అదీ అసలు డౌట్..!!

.

‘ఢిల్లీకి సలాం కొట్టే సామంతులం కాదు మేం.... ఇదే కదా కేటీయార్ నిన్న చేసిన ప్రకటన... నవ్వొచ్చింది కదా...’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కరీంనగర్ ఇషాన్ కిషన్… బండి సంజయ్… ఓ ఉత్కంఠభరిత మ్యాచ్..!!
  • మేడం సార్, మేడం, అంతే… వయస్సు మీద పడినా భానుమతి లెవల్ అదే…
  • 24 ఏళ్లు సరే… అసలు ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా..?
  • నచ్చిన వార్త..! కొన్ని ఉద్వేగాలకు లెక్కలు, లాజిక్కులు ఉండవ్..!!
  • ఉత్తమ పురుష్..! లేడీ ఐఏఎస్‌లకు ఆయనంటే ఎందుకో క్రేజ్..?
  • పోచమ్మ దయ..! పొడుగోడు కేటీయార్ కోరిక తీర్చిన పొట్టోడు రేవంత్..!!
  • చూస్తూ ఉండండి… జియో ఆయిల్ పాలిటిక్సులో… పాకిస్థాన్ 4 ముక్కలు…
  • ఈ చంద్రబాబు దోస్త్‌కు మన తెలంగాణ ఆడపిల్లలు జస్ట్ గినియా పిగ్స్..!!
  • ఓ బందిపోటు కథ కాదు… దేహమంతా లైంగిక దాడి గాయాల బాధితురాలి కథ …
  • ఇప్పుడంటే ఎర్రతనం క్షీణదశ కానీ… అప్పట్లో ఎర్రెర్ర సినిమాలు ఎక్కువే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions