.
ఒక స్పందన… ఒకే డైలాగ్… కాదు, ఒక హరీష్ రావు కాదు, ఒక కేసీయార్ కాదు, చివరకు ఒక కేటీయార్ కూడా కాదు… నిన్నటి దాకా కవిత మీద అవాకులూ చవాకులూ ప్రచారం చేసిన ఆ క్యాంపే… ఇప్పుడు లిక్కర్ స్కాంలో కవితతోపాటు అందరూ దోషులు కారని అదేదో రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిన తరువాత, మొత్తం కేసునే క్లోజ్ చేసేసిన తరువాత… ఆ పింక్ క్యాంపు నుంచి కనిపించిన స్పందన ఏమిటో తెలుసా..?
అఫ్కోర్స్, కేటీయార్ న్యాయం గెలిచింది అన్నట్టు ఏదో ట్వీటాడు సరే… ఇన్నాళ్లూ కవిత కుటుంబం, కేసీయార్, కేటీయార్, హరీష్ రావు తదితరులు ఓ ఆడబిడ్డ పట్ల ఎంత కుత్సితంగా, అమర్యాదగా ప్రవర్తించారో అందరమూ చూశాం…
Ads
(తెలంగాణలో ఆడబిడ్డ కాళ్లకు మొక్కుతారు తండ్రులైనా, సోదరులైనా… దొరల కుటుంబాల్లో ఎలా ఉంటుందో తెలియదు… కుటుంబం నుంచి, పార్టీ నుంచి ఆమెను ఇంత అవమానకరంగా పంపిస్తారని మాత్రం తెలంగాణ సమాజం అనుకోలేదు…) (గొప్ప పాలకుడు, గొప్ప తండ్రి, గొప్ప నాయకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అనేవి భ్రమపదార్ధాలు, బ్రహ్మపదార్థాలు..)
‘‘కేసీయార్ పెంపకానికి క్లీన్ చిట్, నిబద్ధతతో అధినేత నడిపిన ప్రభుత్వానికి…’’ ఇదీ బీఆర్ఎస్ క్యాంపు నుంచి తొలి స్పందన..!! అవునా..? అసలు అధినేత నడిపిన తెలంగాణ ప్రభుత్వానికీ మద్యం కుంభకోణానికీ సంబంధం ఏమిటసలు..? పైగా అంతగా పెంపకం బాగుంటే మరి కుటుంబమే ఎందుకు బహిష్కరించింది..? అది తన పెంపకానికి తన స్వీయ అభిశంసన కాదా..?
అసలు కేసీయార్ ఆమెను ఎందుకు దూరం పెట్టాడనేదే ఓ పెద్ద మిస్టరీ కదా… ఇప్పుడు ఈ క్లీన్ చిట్‌తో కవిత ఇంటికి హరీష్, కేటీయార్, కేసీయార్ పోయి ఆప్యాయంగా ఆలింగనాలు చేసుకుని, ఇంటిలోకి, పార్టీలోకి రావమ్మా మహాలక్ష్మీ అని అడుగుతారా..? అంతా ఓ భ్రమ…
- ఎందుకంటే..? కేటీయార్ తన ట్వీట్లో గత ఎన్నికల్లో ఓటమికి కవిత మద్యం కేసు కూడా ఓ కారణమే అన్నట్టు ట్వీటాడు, దాన్ని వెంటనే పట్టుకున్న కవిత… మీ వైఫల్య ఓటమిని నా మెడలో ఎందుకు వేస్తున్నారు అని తిప్పికొట్టింది..!!
నిజానికి ఈ ఢిల్లీ సీబీఐ కోర్టు చెప్పగానే అయిపోలేదు… సీబీఐ హైకోర్టుకు, తరువాత సుప్రీందాకా వెళ్తుంది… కేంద్రంలోని బీజేపీ వదలదు… కేజ్రీవాల్‌ను వదలదు… ఏమో, అవసరమైతే ఏకంగా సీబీఐ డైరెక్టర్ పోస్టు ఊడిపోవచ్చు కూడా..! ఖలిస్థానీ అనుకూల ఆప్ ఎప్పుడూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నచ్చదు… జాతీయ ప్రయోజనాల రీత్యా అది అవసరం లేదు కూడా…
కాకపోతే కవిత ఏదో ప్రెస్ మీట్ పెడుతుందట… అమ్మా, దయచేసి… తెలంగాణ గెలిచింది అని మాత్రం అనకు… సూత్రీకరించకు… విచారణ, దర్యాప్తు, జైలు జీవితం సమయాల్లో ప్రతిసారీ నువ్వు పదే పదే తెలంగాణ ఓడిపోదు అని చెబుతూ వచ్చావు… అక్కడికి తెలంగాణకు నీ స్వార్థ మద్యం కేసుకూ లింకేమిటసలు..? ప్లీజ్, కాస్త తెలంగాణ సెంటిమెంటుకు గౌరవం ఇవ్వు… మీ డాడీలాగే ప్రతి అంశాన్నీ తెలంగాణ ఆత్మాభిమానం, గౌరవాలు, మనోభావాలతో ముడిపెట్టకు… ఆ నెత్తుటి వారసత్వం ఎంతున్నా సరే..!! ఆయనే ఆ వారసత్వాన్ని నిరాకరిస్తున్నా సరే..!!
చివరగా... ఇన్నాళ్లూ ఆమె కేసీయార్ పాలనకాలం నాటి దుర్మార్గాలు, తన చుట్టూ చేరిన దెయ్యాల నుంచి ఆరోపణలు చేస్తుంటే ఆ మద్యం వాసనల దృష్ట్యా పెద్ద క్రెడిబులిటీ వచ్చేది కాదు... ఇప్పుడు *కడిగిన ముత్యం* కథ వేరే ఉంటుంది..!!
Share this Article